ఈ రాశి వారికి కొత్త వ్యక్తుల పరిచయం... శుభవార్తలు వింటారు | Today Telugu Horoscope On October 31st, 2026: Know Astrological Predictions Of Your Zodiac Signs In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu: ఈ రాశి వారికి కొత్త వ్యక్తుల పరిచయం... శుభవార్తలు వింటారు

Oct 31 2026 7:22 AM | Updated on Oct 31 2026 8:29 AM

Rasi Phalalu: Daily Horoscope On 31-10-2026 In Telugu

గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వయుజ మాసం, తిథి: బ.పంచమి రా.11.41 వరకు, తదుపరి షష్ఠి, నక్షత్రం: మృగశిర ప.1.52 వరకు, తదుపరి ఆరుద్ర, వర్జ్యం: రా.9.38 నుండి 11.07 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.18 నుండి 9.03 వరకు, తదుపరి ప.12.06 నుండి 12.52 వరకు,అమృత ఘడియలు: రా.2.50 నుండి 4.18 వరకు.

సూర్యోదయం :    6.01
సూర్యాస్తమయం     :  5.28
రాహుకాలం : ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం :  ప.3.00 నుండి 4.30 వరకు

మేషం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తా శ్రవణం. ఆర్థికాభివృద్ధి. ముఖ్య నిర్ణయాలు. ముఖ్య నిర్ణయాలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహం.

వృషభం: కొన్ని వ్యవహారాలలో అవాంతరాలు. రుణయత్నాలు ముమ్మరం చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్య సమస్యలు. ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి సమస్యలు.

మిథునం: పనులు వేగవంతంగా సాగుతాయి. ఆప్తుల నుంచి శుభవార్తలు. ఒక సమాచారం ఊరటనిస్తుంది. దైవదర్శనాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో కొత్త ఇబ్బందులు.

కర్కాటకం: వ్యవహారాలు నెమ్మదిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బంది పెట్టవచ్చు. దూరప్రయాణాలు. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.

సింహం: ఆసక్తికర సమాచారం. శుభకార్యాల ప్రస్తావన. ధనలబ్ధి. ప్రముఖుల నుంచి శుభవార్తలు. భూవివాదాలు కొలిక్కి వస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు అధిగమిస్తారు.

కన్య: బంధువుల సాయం స్వీకరిస్తారు. వాహనయోగం. నూతన విద్య, ఉద్యోగావకాశాలు. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.

తుల: కష్టపడ్డా ఫలితం కనిపించదు. వ్యయప్రయాసలు. స్వల్ప అనారోగ్యం. ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆటుపోట్లు.

వృశ్చికం: సన్నిహితులతో విభేదాలు. ఆరోగ్యభంగం. ముఖ్య వ్యవహారాలు మందగిస్తాయి. కుటుంబంలో ఒత్తిడులు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశ.

ధనుస్సు: స్థిరాస్తి వృద్ధి. పనుల్లో ప్రతిబంధకాలు తొలగుతాయి. ధనలాభ సూచనలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలు ఆశాజనకం.

మకరం: చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆకస్మిక ధనలాభం. పరిచయాలు మరింత పెరుగుతాయి. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత సాఫీగా సాగుతాయి.

కుంభం: వ్యవహారాలు నిదానంగా సాగుతాయి. కొన్ని నిర్ణయాలు మార్చుకుంటారు. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశాజనకంగా ఉంటాయి.

మీనం: శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. బాధ్యతలు మరింత పెరుగుతాయి. ఆధ్యాత్మిక చింతన. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో  సమస్యలు ఎదురుకావచ్చు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement