గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వయుజ మాసం, తిథి: బ.చవితి రా.2.06 వరకు, తదుపరి పంచమి, నక్షత్రం: రోహిణి ప.3.28 వరకు, తదుపరి మృగశిర, వర్జ్యం: ఉ.7.57 నుండి 9.27 వరకు, తదుపరి రా.8.41 నుండి 10.11 వరకు, దుర్ముహూర్తం: ఉ.9.49 నుండి 10.35 వరకు, తదుపరి ప.2.24 నుండి 3.09 వరకు, అమృత ఘడియలు: ప.12.29 నుండి 1.57 వరకు, తదుపరి తె.5.39 నుండి 7.07 వరకు, సంకటహర చతుర్ధి.
సూర్యోదయం : 6.00
సూర్యాస్తమయం : 5.29
రాహుకాలం : ప.1.30 నుండి 3.00 వరకు
యమగండం : ఉ.6.00 నుండి 7.30 వరకు
మేషం... శ్రమపడ్డా ఫలితం కనిపించదు. ఒప్పందాలలో ఆటంకాలు. పనులు ముందుకు సాగవు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు నిదానిస్తాయి. ఉద్యోగాలలో చికాకులు.
వృషభం... ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. పరిచయాలు పెరుగుతాయి. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. సన్నిహితుల సాయం అందుతుంది. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో ముఖ్య మార్పులు.
మిథునం... పనుల్లో ప్రతిష్ఠంభన. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. ఆస్తి వివాదాలు. ఆరోగ్య సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు.
కర్కాటకం... వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆప్తుల నుంచి ముఖ్య సమాచారం. కుటుంబంలో ఉత్సాహవంతంగా గడుస్తుంది. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి.
సింహం... కొత్త పనులు చేపడతారు. ఆలోచనలు అమలు చేస్తారు. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత పుంజుకుంటాయి.
కన్య... వ్యయప్రయాసలు. బంధుమిత్రులతో మాటపట్టింపులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు.
తుల... రుణయత్నాలు సాగిస్తారు. అనుకోని ప్రయాణాలు. ఆలయ దర్శనాలు. కుటుంబసభ్యులతో విభేదాలు. స్వల్ప అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.
వృశ్చికం... శ్రమ ఫలిస్తుంది. నూతన వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. కొన్ని వివాదాలు పరిష్కారం. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత సామాన్యంగా ఉంటాయి.
ధనుస్సు... కొత్త మిత్రుల పరిచయం. శుభవార్తలు వింటారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు. విద్యా, ఉద్యోగావకాశాలు. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలు సాఫీగా సాగుతాయి.
మకరం... ఆర్థిక ఇబ్బందులు. కొత్త రుణయత్నాలు. ప్రయాణాలలో అవాంతరాలు. దైవదర్శనాలు. కుటుంబంలో ఒత్తిడులు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి.
కుంభం... పరిస్థితులు అనుకూలించవు. వ్యయప్రయాసలు. మిత్రులతో కలహాలు. ఆరోగ్యభంగం. దూరప్రయాణాలు. పనులు వాయిదా వేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.
మీనం... రుణదాతల ఒత్తిడులు తొలగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో సఖ్యత. భూములు, వాహనాలు కొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి.


