గ్రహం అనుగ్రహం: శ్రీపరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వయుజ మాసం, తిథి: పౌర్ణమి ఉ.9.48 వరకు, తదుపరి బహుళ పాడ్యమి, నక్షత్రం: అశ్విని రా.7.06 వరకు, తదుపరి భరణి, వర్జ్యం: ప.3.12 నుండి 4.46 వరకు,తదపరి తె.4.20 నుండి 5.52 వరకు (తెల్లవారితే మంగళవారం), దుర్ముహూర్తం: ప.12.07 నుండి 12.54 వరకు, తదుపరి ప.2.26 నుండి 3.12 వరకు, అమృత ఘడియలు: ప.12.04 నుండి 1.40 వరకు
సూర్యోదయం : 5.59
సూర్యాస్తమయం : 5.30
రాహుకాలం : ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం : ఉ.10.30 నుండి 12.00 వరకు
మేషం... ఉద్యోగావకాశాలు. సంఘంలో గౌరవప్రతిష్ఠలు. చిన్ననాటి మిత్రుల కలయిక. కొన్ని వివాదాలు తీరతాయి. ఆకస్మిక ధనలబ్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో సానుకూలం.
వృషభం... పనుల్లో జాప్యం. ఆర్థిక విషయాలు నిరాశ కలిగిస్తాయి. శ్రమాధిక్యం. ఆరోగ్యసమస్యలు. మిత్రులతో విభేదాలు. ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరిన్ని చికాకులు.
మిథునం... బంధువులతో సఖ్యత. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. వాహనసౌఖ్యం. ముఖ్య
నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి.
కర్కాటకం... కొన్ని పనులు పూర్తి కాగలవు. ఆర్థికాభివృద్ధి. ప్రముఖులతో పరిచయాలు. సన్నిహితుల సాయం అందుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.
సింహం... కొన్ని పనులు హఠాత్తుగా విరమిస్తారు.. శ్రమాధిక్యం. మిత్రుల నుంచి ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి.
కన్య... కుటుంబసభ్యులతో మనస్పర్థలు. ఆలయాలు సందర్శనం. అనారోగ్యం. ఆకస్మిక ప్రయాణాలు. ఒప్పందాలు వాయిదా వేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యస్థితిలో ఉంటాయి.
తుల... శ్రమకు ఫలితం దక్కుతుంది. స్వల్ప అనారోగ్యం. దూరప్రయాణాలు. ఇంటాబయటా వ్యతిరేకత. యత్నకార్యసిద్ధి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పూర్వవైభవం.
వృశ్చికం... చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి. ఆప్తుల నుంచి కీలక సందేశం. విలువైన వస్తువులు కొంటారు. ఆస్తుల వివాదాలు కొలిక్కి వస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.
ధనుస్సు... పరిస్థితులు అనుకూలించవు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో స్వల్ప వివాదాలు. ఆరోగ్యభంగం. ఉద్యోగయత్నాలు మందగిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు.
మకరం... కొన్ని వ్యవహారాలలో అవాంతరాలు. అనుకోని ప్రయాణాలు. సన్నిహితులు ఒత్తిడులు పెంచుతారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు.
కుంభం... చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆలయాలు సందర్శిస్తారు. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.
మీనం... సన్నిహితులతో మనస్పర్ధలు. ఆర్థిక విషయాలు నిరాశ పరుస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబసభ్యులతో విభేదాలు. స్వల్ప అస్వస్థత. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత అనుకూలిస్తాయి.


