ఈ రాశి వారికి వృత్తి, వ్యాపారాలలో పురోభివృద్ధి | Rasi Phalalu: Daily Horoscope On 23-10-2026 In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu: ఈ రాశి వారికి వృత్తి, వ్యాపారాలలో పురోభివృద్ధి

Oct 23 2026 12:53 AM | Updated on Oct 23 2026 12:53 AM

Rasi Phalalu: Daily Horoscope On 23-10-2026 In Telugu

గ్రహం అనుగ్రహం: శ్రీపరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వయుజ మాసం, తిథి: శు.ద్వాదశి ఉ.11.41 వరకు, తదుపరి త్రయోదశి, నక్షత్రం: పూర్వాభాద్ర రా.7.32 వరకు, తదుపరి ఉత్తరాభాద్ర, వర్జ్యం: తె.5.16 నుండి 6.53 వరకు (తెల్లవారితే శనివారం), దుర్ముహూర్తం: ఉ.8.16 నుండి 9.03 వరకు, తదుపరి ప.12.08 నుండి 12.54 వరకు, అమృత ఘడియలు: ఉ.11.15 నుండి 12.56 వరకు.

సూర్యోదయం : 5.58
సూర్యాస్తమయం : 5.32
రాహుకాలం : ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం : ప.3.00 నుండి 4.30 వరకు 

మేషం... ఆర్థిక పరిస్థితి అనుకూలం. సంఘంలో గౌరవం. విలువైన సమాచారం. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. వస్తులాభాలు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.

వృషభం.... నూతన ఉద్యోగయోగం. కీలక నిర్ణయాలు. వ్యవహారాలు అనుకూలిస్తాయి. బాకీలు వసూలు. వృత్తి, వ్యాపారాలు మరింత ఆశాజనకంగా ఉంటాయి.

మిథునం... పనుల్లో ఆటంకాలు. వృథా ఖర్చులు. మిత్రుల నుంచి ఒత్తిడులు. ఉద్యోగాల్లో ఒడిదుడుకులు. వ్యాపారాలు ముందుకు సాగవు. దైవదర్శనాలు.

కర్కాటకం.... కొన్ని పనులు వాయిదా వేస్తారు. ధనవ్యయం. దూరప్రయాణాలు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో మార్పులు. దైవదర్శనాలు.

సింహం.... పలుకుబడి పెరుగుతుంది. సన్నిహితుల నుంచి కీలక సమాచారం. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి.  ప్రముఖులతో పరిచయాలు.

కన్య.... పాతమిత్రులను కలుసుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక చింతన. కాంట్రాక్టులు పొందుతారు. వృత్తి, వ్యాపారాలలో అనుకూల పరిస్థితులు.

తుల.... కుటుంబంలో చికాకులు. దూరపు బంధువుల కలయిక. భాగస్వామ్య వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగాలలో ఒత్తిళ్లు. అనుకోని ప్రయాణాలు.

వృశ్చికం.. శ్రమాధిక్యం. కొన్ని కార్యక్రమాలు వాయిదా. సోదరులు, మిత్రులతో కలహాలు. ఆరోగ్య సమస్యలు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

ధనుస్సు... కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆర్థిక వ్యవహారాల్లో పురోగతి. ఇంటాబయటా అనుకూలం. వృత్తి, వ్యాపారాలలో పురోభివృద్ధి.

మకరం...... ఆకస్మిక ప్రయాణాలు. పనుల్లో చికాకులు. వ్యాపార లావాదేవీలు మందగిస్తాయి. ఉద్యోగాలలో మార్పులు. ఆర్థిక ఇబ్బందులు. ఆధ్యాత్మిక చింతన.

కుంభం... ముఖ్య కార్యక్రమాలు సాఫీగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పాతమిత్రుల కలయిక. వస్తులాభాలు. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి.

మీనం..... ప్రయాణాలు వాయిదా. శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. బంధువర్గంతో మాటపట్టింపులు. వృత్తి, వ్యాపారాలు అనుకూలించవు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement