source: X
టీమిండియా వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ నాలుగేళ్ల తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లోకి పునరాగమనం చేసి ప్రపంచ రికార్డు సృష్టించాడు. న్యూజిలాండ్‌తో తొలి టీ20లో భాగంగా పవర్‌ప్లేలో అత్యధిక డాట్ బాల్స్ వేసిన బౌలర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో న్యూజిలాండ్ మాజీ పేసర్ టిమ్ సౌథీ రికార్డును అధిగమించాడు.
క్రైస్ట్‌చర్చ్‌లోని హాగ్లీ ఓవల్‌లో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. తొలి ఓవర్ వేసిన భువనేశ్వర్ కేవలం నాలుగు పరుగులే ఇచ్చి మూడు డాట్ బాల్స్ వేశాడు. దీంతో పూర్తి సభ్య దేశాల బౌలర్లలో టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌ల పవర్‌ప్లేలో అత్యధిక డాట్ బాల్స్ వేసిన బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు.
టీ20 పవర్‌ప్లేల్లో అత్యధిక డాట్ బాల్స్ వేసిన బౌలర్లు:
- భువనేశ్వర్ కుమార్ – 680
- టిమ్ సౌథీ – 679
- రిచర్డ్ నగరవా – 674
- షాహీన్ అఫ్రిది – 625
- బ్లెస్సింగ్ ముజరబానీ – 614
- అర్ష్‌దీప్ సింగ్ – 576
- జస్‌ప్రీత్ బుమ్రా – 569
మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేస్తున్న న్యూజిలాండ్ 7 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టానికి 72 పరుగులు చేసింది. మయాంక్ యాదవ్ బౌలింగ్‌లో సంజూ శాంసన్‌కు క్యాచ్ ఇచ్చి టిమ్ సీఫర్ట్ (24) ఔట్ కాగా.. ఫిన్ అలెన్ (38), డారిల్ మిచెల్ (8) క్రీజ్‌లో ఉన్నారు.
ఇదీ చదవండి: టీమిండియా బౌలింగ్.. తుది జట్టులో స్టార్ బౌలర్


