టీమిండియా బౌలింగ్‌.. తుది జట్టులో స్టార్‌ బౌలర్‌ | IND VS NZ 1st T20I: Toss and Playing XI | Sakshi
Sakshi News home page

టీమిండియా బౌలింగ్‌.. తుది జట్టులో స్టార్‌ బౌలర్‌

Oct 22 2026 12:05 PM | Updated on Oct 22 2026 12:45 PM

IND VS NZ 1st T20I: Toss and Playing XI

source: X

న్యూజిలాండ్‌ పర్యటనలో టీమిండియా ఇవాళ తమ తొలి మ్యాచ్‌ ఆడుతుంది. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా క్రైస్ట్‌ చర్చ్‌ వేదికగా ఇవాళ తొలి టీ20 జరుగనుంది. భారతకాలమానం ప్రకారం​ ఈ మ్యాచ్‌ మధ్యాహ్నం 12:30 గంటలకు మొదలవుతుంది. 

ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్నాడు. భారత్‌ తరఫున స్టార్‌ బౌలర్‌ భువనేశ్వర్‌ కుమార్‌, ఆల్‌రౌండర్‌ నితీశ్‌ కుమార్‌ రెడ్డి (శివమ్‌ దూబే స్థానంలో), పేసర్ మయాంక్‌ యాదవ్‌ (ప్రిన్స్‌ యాదవ్‌ స్థానంలో) తుది జట్టులోకి వచ్చారు. వరుణ్‌ చక్రవర్తి, వైభవ్‌ సూర్యవంశీ బెంచ్‌కే పరిమితమయ్యారు. 

తుది జట్లు..
న్యూజిలాండ్: ఫిన్ అలెన్, టిమ్ సీఫెర్ట్(వికెట్ కీపర్), డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, బెవాన్ జాకబ్స్, మైఖేల్ బ్రేస్‌వెల్, మిచెల్ సాంట్నర్(కెప్టెన్), నాథన్ స్మిత్, ఆడమ్ మిల్నే, మాట్ హెన్రీ, లాకీ ఫెర్గూసన్

భారత్: సంజు సామ్సన్(వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, నమన్ ధీర్, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్, మయాంక్ యాదవ్ 

ఇదీ చదవండి: భారత్‌ క్లీన్‌ స్వీప్‌


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement