ఢిల్లీ: ఇవాళ సుప్రీంకోర్టులో వైఎస్సార్సీపీ పిటిషన్‌పై విచారణ జరగనుంది. జస్టిస్ జాయ్మాల్య భాగ్చి, జస్టిస్ మోహన ధర్మాసనం విచారణ చేపట్టనుంది. మున్సిపల్ ఎన్నికలలో నామినేషన్లు అడ్డుకోవడంపై సుప్రీంకోర్టులో వైఎస్సార్సీపీ పిటిషన్ దాఖలు చేసింది. ఏపీ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో వైఎస్సార్సీపీ సవాల్ చేసింది.
ఇటీవల పంజాబ్‌లో ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులను నామినేషన్లు అడ్డుకోవడంతో 50 వార్డులలో ఎన్నికలు రద్దు చేసి.. రీ పోలింగ్‌కి సుప్రీంకోర్టు ఆదేశించింది. అర్బన్ లోకల్ బాడీల్లో నామినేషన్ దాఖలు చేసే గడువును పొడిగించాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ వైఎస్సార్సీపీ పిటిషన్ వేసింది. ఏకగ్రీవ ఎన్నికపై స్టే ఇవ్వాలని పిటిషన్లో వైఎస్సార్సీపీ విజ్ఞప్తి చేసింది.
నామినేషన్ పేపర్లు స్వీకరించేందుకు అదనపు, ప్రత్యామ్నాయ కేంద్రాలను ఏర్పాటు చేయాలని, మొత్తం ప్రక్రియను వీడియోగ్రఫీ చేయాలని వైఎస్సార్సీపీ కోరింది. నామినేషన్ కేంద్రాలకు వెళ్లే అభ్యర్థులు, ప్రపోజర్లకు తగిన పోలీసు రక్షణ కల్పించాలని, ఇప్పటికే స్వాక్ష్యాపత్రాలు దాఖలైన అభ్యర్థులు, అలాంటి ఇతర అభ్యర్థుల నామినేషన్లు పొడిగించిన గడువులో స్వీకరించాలని వైఎస్సార్సీపీ కోరింది.
ఇదీ చదవండి: పులివెందులలో అర్ధరాత్రి టీడీపీ అరాచకం


