పులివెందులలో అర్ధరాత్రి టీడీపీ అరాచకం | Tdp Goons Incident In Pulivendula | Sakshi
Sakshi News home page

పులివెందులలో అర్ధరాత్రి టీడీపీ అరాచకం

Oct 21 2026 6:45 AM | Updated on Oct 21 2026 7:03 AM

Tdp Goons Incident In Pulivendula

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా: స్థానిక సంస్థల ఎన్నికల్లో చంద్రబాబు సర్కార్‌ అరాచకపర్వం కొనసాగుతోంది. పులివెందులలో అర్ధరాత్రి టీడీపీ గూండాలు బీభత్సం సృష్టించారు. మున్సిపల్‌ ఎన్నికల్లో కౌన్సిలర్‌గా నామినేషన్ వేసిన నిరంజన్ రెడ్డి, అంజనప్ప ఇళ్లపై దాడి చేశారు. నిరంజన్‌రెడ్డి ఇంటిపై బీరు బాటిళ్లతో దాడి చేసిన పచ్చమూకలు.. ఇంటి ముందు ఉన్న లారీ తగలబెట్టారు. అంజనప్ప ఇంటి వద్ద స్కూటీకి టీడీపీ గూండాలు నిప్పంటించారు. నామినేషన్ వేసిన వారిని ప్రచారం చేసుకోనివ్వకుండా పచ్చమూకలు భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి.

కాగా, కడప వైఎస్సార్‌సీపీ మేయర్‌ అభ్యర్థి బండి దీప్తి రెడ్డి ఇంటిపై సోమవారం అర్ధరాత్రి పచ్చ టీడీపీ గూండాలు దాడికి దిగిన సంగతి  తెలిసిందే. అర్ధరాత్రి బీరు బాటిళ్లతో ఇంటిపై దాడికి దిగి అరాచకం సృష్టించారు. వాహనంలో వచ్చి వేటకొడవల్లు, బీరు బాటిళ్లు ఇంట్లోకి విసిరిన మూకలు.. ఇంటి అద్దాలు ధ్వంసం చేశారు. అధికార పక్షానికి బండిదీప్తి కంటగింపుగా మారింది. పైగా మేయర్‌ అభ్యర్థిగా ఆమె నామినేషన్‌ ఆమోదం లభించింది. దీంతో మేయర్‌ స్థానానికి పోటీ అనివార్యం కానుంది. ఈ నేపథ్యంలో ఎలాగైనా పోటీ నుంచి విరమించాలన్న లక్ష్యంతో టీడీపీ శ్రేణులు పనిచేస్తున్నాయి.

ఇదీ చదవండి: ‘ప్రజాస్వామ్యంలో బ్యాలెట్లు కావాలి.. బుల్లెట్లు కాదు’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement