గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు,ఆశ్వయుజ మాసం, తిథి: శు.నవమి ఉ.9.11 వరకు, తదుపరి దశమి, నక్షత్రం: శ్రవణం ప.3.43 వరకు, తదుపరి ధనిష్ఠ, వర్జ్యం: రా.8.00 నుండి 9.43 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.16 నుండి 9.02 వరకు, తదుపరి రా.10.31 నుండి 11.20 వరకు,అమృత ఘడియలు: లేవు, విజయ దశమి.
సూర్యోదయం : 5.57
సూర్యాస్తమయం : 5.34
రాహుకాలం : ప.3.00 నుండి 4.30 వరకు
యమగండం : ఉ.9.00 నుండి 10.30 వరకు
మేషం... పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. రుణ బాధలు తొలగుతాయి. ఆసక్తికర విషయాలు తెలుస్తాయి. దూరపు బంధువుల కలయిక. వృత్తి, వ్యాపారాలలో పురోగతి.
వృషభం... పనులు నిలిపివేస్తారు. శ్రమాధిక్యం. బంధువులు, మిత్రులతో తగాదాలు. నిర్ణయాలలో యుక్తితో మెలగడం మంచిది. దైవదర్శనాలు. వ్యాపారాలు మందగిస్తాయి.
మిథునం... ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. బంధువులతో వివాదాలు. విద్యార్థుల యత్నాలు మందగిస్తాయి. కొన్ని కార్యక్రమాలు వాయిదా. వృత్తి, వ్యాపారాలలో మార్పులు.
కర్కాటకం... పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల ఆదరణ పొందుతారు. వాహనయోగం. సంఘంలో ఆదరణ. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.
సింహం... ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. విలువైన వస్తువులు సేకరిస్తారు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. వృత్తి, వ్యాపారాలలో పురోగతి.
కన్య... ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. వ్యయప్రయాసలు. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. అనారోగ్యం. శ్రమ తప్పదు. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు
తుల... రుణాలు చేస్తారు. బంధువర్గంతో వివాదాలు. విలువైన వస్తువులు భద్రం. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు. విద్యార్థులకు అంతగా అనుకూలించదు.
వృశ్చికం... నూతన ఉద్యోగలాభం. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కీలక నిర్ణయాలు. విద్యార్థులు, నిరుద్యోగులకు శుభవార్తలు. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.
ధనుస్సు... వ్యవహారాలలో ప్రతిబంధకాలు. ధనవ్యయం. మనస్సు కుదుటగా ఉండదు. కుటుంబసభ్యులతో వివాదాలు. వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహం. ఆధ్యాత్మిక చింతన. అనారోగ్యం.
మకరం... మిత్రులు, బంధువుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. వ్యవహారాలలో విజయం. కొన్ని బాకీలు వసూలవుతాయి. దైవచింతన. వ్యాపార, ఉద్యోగాలు మరింత ఆశాజనకం.
కుంభం... పనుల్లో అవాంతరాలు. ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది. సోదరులతో వివాదాలు. ఆరోగ్య సమస్యలు. వ్యాపార, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు. దైవదర్శనాలు
మీనం... కొత్త వ్యక్తుల పరిచయం. విచిత్ర సంఘటనలు ఎదురవుతాయి. శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. వృత్తి, వ్యాపారాలలో అనుకూలత. సంఘంలో ఆదరణ.


