ఈ రాశి వారికి ధన, వస్తులాభాలు | Rasi Phalalu: Daily Horoscope On 18-10-2026 In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu: ఈ రాశి వారికి ధన, వస్తులాభాలు

Oct 18 2026 1:34 AM | Updated on Oct 18 2026 1:34 AM

Rasi Phalalu: Daily Horoscope On 18-10-2026 In Telugu

గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వయుజ మాసం, తిథి: శు.అష్టమి పూర్తి (24గంటలు), నక్షత్రం: పూర్వాషాఢ ఉ.11.47 వరకు, తదుపరి ఉత్తరాషాఢ, వర్జ్యం: రా.7.53 నుండి 9.41 వరకు, దుర్ముహూర్తం: సా.4.01 నుండి 4.48 వరకు, అమృత ఘడియలు: లేవు, దుర్గాష్టమి.

సూర్యోదయం        :  5.56
సూర్యాస్తమయం    :  5.34
రాహుకాలం :  సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం : ప.12.00 నుంచి 1.30 వరకు

మేషం... కొత్త రుణాలు చేయాల్సిన పరిస్థితి. దూరప్రయాణాలు. సోదరులతో విభేదాలు. మీ కష్టం ఇతరులకు ఉపయోగిస్తుంది. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.

వృషభం... పరిస్థితులు అనుకూలించవు. వ్యయప్రయాసలు. బంధువుల నుండి సమస్యలు. ఆరోగ్యం కొంత ఇబ్బంది కలిగిస్తుంది. ఖర్చులు అధికం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త వివాదాలు.

మిథునం... చిన్ననాటి మిత్రుల నుండి ఆహ్వానాలు. విందువినోదాలు. వాహనయోగం. చర్చలు సఫలం. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

కర్కాటకం... పలుకుబడి మరింత పెరుగుతుంది. ఆత్మీయుల ఆదరణ లభిస్తుంది. వస్తు, వస్త్రలాభాలు. పాతమిత్రులను కలుసుకుంటారు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

సింహం... సన్నిహితుల నుండి మాటపడతారు. ఆర్థిక పరిస్థితి అగమ్యగోచరంగా ఉంటుంది. ఎంత శ్రమించినా ఫలితం శూన్యం. ప్రయాణాలు వాయిదా. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

కన్య... కొన్ని విషయాలలో పొరపాట్లు దొర్లుతాయి. ఆర్థికంగా ఇబ్బందులు. ప్రయాణాలు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. మానసిక అశాంతి. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

తుల... పనుల్లో విజయం. ఆప్తుల నుండి ముఖ్య సమాచారం. ఆర్థికంగా ఇబ్బందులు తీరతాయి. ఆలోచనలు అమలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

వృశ్చికం... సన్నిహితులతో కలహాలు. రుణయత్నాలు ముమ్మరం చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్య సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిదానిస్తాయి.

ధనుస్సు... వ్యవహారాలలో కీలక పాత్ర∙పోషిస్తారు. సమాజసేవలో పాల్గొంటారు. రావలసిన డబ్బు అందుతుంది. వస్తులాభాలు. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం తొలగుతుంది.

మకరం... ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి.

కుంభం... దూరప్రాంతాల నుండి కీలక సమాచారం. విందువినోదాలు. ఆలోచనలు అమలు చేస్తారు. వాహనసౌఖ్యం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీదే పైచేయి.

మీనం... బంధువులతో వివాదాలు. ప్రయాణాలు ముందుకు సాగవు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. సోదరుల నుండి ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త చిక్కులు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement