గ్రహం అనుగ్రహం: శ్రీపరాభవనామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వయుజ మాసం తిథి: శు.తదియ రా.10.02 వరకు, తదుపరి చవితి, నక్షత్రం: విశాఖ రా.1.31 వరకు తదుపరి అనూరాధ, వర్జ్యం: తె.5.51 నుండి 7.35 వరకు(తెల్లవారితే బుధవారం), దుర్ముహూర్తం: ఉ.8.15 నుండి 9.02 వరకు, తదుపరి రా.10.32 నుండి 11.21 వరకు, అమృత ఘడియలు: సా.4.06 నుండి 5.49 వరకు.
సూర్యోదయం: 5.55
సూర్యాస్తమయం: 5.38
రాహుకాలం: ప.3.00 నుండి 4.30 వరకు
యమగండం: ఉ.9.00 నుండి 10.30 వరకు
మేషం...
శుభవార్తలు అందుతాయి. సోదరులతో సఖ్యత. పనులు సకాలంలో చక్కదిద్దుతారు. ప్రముఖుల పరిచయం. వాహనయోగం. ధనలాభం. వ్యాపార, ఉద్యోగాలలో పురోభివృద్ధి.
వృషభం...
పనుల్లో విజయం. ఆప్తుల నుండి ముఖ్య సమాచారం. చర్చలు సఫలం. వాహనయోగం. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపార, ఉద్యోగాలలో ప్రగతి ఉంటుంది.
మిథునం...
సన్నిహితులతో మాటపట్టింపులు. ఆర్థిక ఇబ్బందులు. కొత్త రుణాల అన్వేషణ. పనుల్లో జాప్యం. దూరప్రయాణాలు. వ్యాపార, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.
కర్కాటకం...
వ్యవహారాలలో అవాంతరాలు. రుణయత్నాలు ముమ్మరం చేస్తారు. ఆర్థిక ఇబ్బందులు. పనులు ముందుకు సాగవు. దైవదర్శనాలు. వ్యాపార, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.
సింహం...
పరిచయాలు విస్తృతం కాగలవు. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభవార్తలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహంగా ఉంటాయి.
కన్య...
మిత్రులతో కలహాలు. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్య సూచనలు. బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. వ్యాపార, ఉద్యోగాలు నిదానిస్తాయి.
తుల...
నూతన ఉద్యోగాలు దక్కవచ్చు. ప్రముఖులతో పరిచయాలు. ఆలయ దర్శనాలు. కుటుంబంలో ప్రోత్సాహం. విందువినోదాలు. వ్యాపార, ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి.
వృశ్చికం...
సన్నిహితులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. శ్రమ పెరుగుతుంది. కుటుంబంలో సమస్యలు. వ్యాపార, ఉద్యోగాలు కొంత ఇబ్బందికరంగా మారతాయి.
ధనుస్సు...
నూతన వ్యక్తుల పరిచయం. శుభవార్తా శ్రవణం. ధనలాభం. అత్యంత కీలక నిర్ణయాలు తీసుకుంటారు. నూతన విద్య, ఉద్యోగావకాశాలు. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలత.
మకరం...
ఆదాయం పెరుగుతుంది. వస్తులాభాలు. నూతన ఉద్యోగయోగం. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. వృత్తులు, వ్యాపారాలలో మరింత ప్రోత్సాహం.
కుంభం...
పరిస్థితులు అనుకూలించవు. వ్యవహారాలలో ఆటంకాలు. ఆరోగ్యం కొంత చికాకు పరుస్తుంది. దైవదర్శనాలు. వ్యాపార, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.
మీనం...
మిత్రులతో కలహాలు. కష్టమే తప్పితే ఫలితం కనిపించదు. ఆస్తి తగాదాలు. ప్రయాణాలలో ఆటంకాలు. వ్యాపార, ఉద్యోగాలు సాధారణంగానే ఉంటాయి.


