ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం | Rasi Phalalu: Daily Horoscope On 11-10-2026 In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu: ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం

Oct 11 2026 3:30 AM | Updated on Oct 11 2026 3:30 AM

Rasi Phalalu: Daily Horoscope On 11-10-2026 In Telugu

గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం,శరదృతువు, ఆశ్వయుజ మాసం,తిథి: శు.పాడ్యమి రా.8.28 వరకు,తదుపరి విదియ, నక్షత్రం: చిత్త రా.10.41 వరకు,తదుపరి స్వాతి, వర్జ్యం: ఉ.6.12 నుండి 7.53 వరకు, తదుపరి తె.4.34 నుండి 6.12 వరకు(తెల్లవారితే సోమవారం), దుర్ముహూర్తం: సా.4.06 నుండి 4.52 వరకు, అమృత ఘడియలు: సా.4.05 నుండి 5.44 వరకు.

సూర్యోదయం        :  5.55
సూర్యాస్తమయం    :  5.39
రాహుకాలం :  సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం : ప.12.00 నుంచి 1.30 వరకు

మేషం... దీర్ఘకాలిక సమస్య పరిష్కారం. కొన్ని వ్యవహారాలు విజయవంతంగా సాగుతాయి. బంధువులతో మరింత ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.

వృషభం... మిత్రులతో కలహాలు. రుణయత్నాలు. దూరప్రయాణాలు. శ్రమ పెరుగుతుంది. పనులు వాయిదా. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణంగా ఉంటాయి.

మిథునం... కుటుంబంలో చికాకులు. అనారోగ్యం. కొన్ని పనులు మధ్యలో విరమిస్తారు. ఆలోచనలు కలసిరావు. బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.

కర్కాటకం... పనుల్లో విజయం. ఆప్తులతో ముఖ్య విషయాలపై చర్చలు. శుభవర్తమానాలు. అదనపు రాబడి. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో మరింత అనుకూలత.

సింహం... సన్నిహితులతో మాటపట్టింపులు. వృథా ఖర్చులు. బాధ్యతలు పెరుగుతాయి. కీలక సమాచారం. ఉద్యోగయత్నాలు ముందుకు సాగవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

కన్య... పనుల్లో పురోగతి. కుటుంబసమస్యలు తీరతాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.

తుల... వ్యయప్రయాసలు. బంధువర్గంతో అకారణంగా తగాదాలు. ధనవ్యయం. ముఖ్య వ్యవహారాలలో అవాంతరాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణంగా ఉంటాయి.

వృశ్చికం... ఉత్సాహంగా పనులు చక్కదిద్దుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆలయాలు సందర్శిస్తారు. దూరపు బంధువుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకం.

ధనుస్సు... నిరుద్యోగుల యత్నాలు ఫలిస్తాయి. ఆస్తిలాభం. కార్యసిద్ధి. పలుకుబడి పెరుగుతుంది. దైవదర్శనాలు. «వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో కొత్త ఆశలు.

మకరం... మిత్రులు శత్రువులుగా మారతారు. పనుల్లో ఆటంకాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.

కుంభం... కుటుంబంలో ఒత్తిడులు. బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఆధ్యాత్మిక చింతన. ముఖ్య పనులలో కొంత జాప్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత ఇబ్బందికరంగా ఉండవచ్చు.

మీనం... మిత్రుల నుంచి శుభవర్తమానాలు. ఆకస్మిక ధనలాభం. ప్రయాణాలు లాభిస్తాయి. దైవదర్శనాలు. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement