ఈ రాశి వారికి ఆస్తి లాభం | Rasi Phalalu: Daily Horoscope On 10-10-2026 In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu: ఈ రాశి వారికి ఆస్తి లాభం

Oct 10 2026 12:32 AM | Updated on Oct 10 2026 12:32 AM

Rasi Phalalu: Daily Horoscope On 10-10-2026 In Telugu

    గ్రహం అనుగ్రహం: శ్రీపరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, తిథి: అమావాశ్య రా.8.27 వరకు, తదుపరి ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి, నక్షత్రం: హస్త రా.9.59 వరకు, తదుపరి చిత్త, వర్జ్యం: ఉ.6.16 నుండి 7.52 వరకు, దుర్ముహూర్తం: ఉ.5.55 నుండి 7.29 వరకు, అమృత ఘడియలు:  ప.3.55 నుండి 5.33 వరకు, మహాలయ అమావాస్య.

సూర్యోదయం :    5.55
సూర్యాస్తమయం     :  5.41
రాహుకాలం : ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం :  ప.1.30 నుండి 3.00 వరకు 

మేషం... కొత్త పనులు చేపడతారు. పరిచయాలు పెరుగుతాయి. సన్నిహితుల సాయం అందుతుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో మరింత పురోగతి. ఉద్యోగాలలో లేనిపోని చికాకులు.

వృషభం... కొత్తగా అప్పులు చేస్తారు. పనులు మధ్యలో విరమిస్తారు. అనుకోని ధనవ్యయం. శ్రమ తప్పదు. నిర్ణయాలు మార్చుకుంటారు. దైవచింతన. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగాలలో సమస్యలు.

మిథునం... కష్టపడ్డా ఫలితం కనిపించదు. దూరప్రయాణాలు. ఒప్పందాలు వాయిదా. పనులలో అవాంతరాలు. బంధుమిత్రులతో మాటపట్టింపులు. వ్యాపారాలలో శ్రమ తప్పదు. ఉద్యోగాలలో మార్పులు.

కర్కాటకం... పనులు సకాలంలో పూర్తి చేస్తారు. దైవచింతన. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. ఆత్మీయులు దగ్గరవుతారు. కాంట్రాక్టర్లకు  అరుదైన పురస్కారాలు.

సింహం... కుటుంబసభ్యులతో విభేదాలు. ఆరోగ్యసమస్యలు. ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేస్తారు. అనుకోని ధనవ్యయం. వ్యాపారాలలో ఒత్తిళ్లు పెరుగుతాయి. ఉద్యోగాలలో గందరగోళం.

కన్య... శ్రేయోభిలాషుల సూచనలు పాటిస్తారు. పనులు అనుకున్న విధంగా పూర్తి.గౌరవమర్యాదలకు లోటు ఉండదు. ఆస్తిలాభం. ఉద్యోగయత్నాలు సానుకూలం. వ్యాపారాలలో పురోగతి. ఉద్యోగాలలో ఒత్తిడుల నుంచి విముక్తి.

తుల... రాబడి కన్నా ఖర్చులు అధికం. పనులలో ఆటంకాలు. అనారోగ్య సూచనలు. మిత్రులతో మాటపట్టింపులు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో స్వల్ప లాభాలు. ఉద్యోగాలలో స్వల్ప అవాంతరాలు.

వృశ్చికం... వ్యవహారాలలో విజయం. శుభవర్తమానాలు. ధనలబ్ధి. ప్రముఖులతో పరిచయాలు.సన్నిహితులతో వివాదాల పరిష్కారం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో కొత్త ఆశలు చిగురిస్తాయి.

ధనుస్సు... ఆత్మీయులు, బంధువులతో ఆనందంగా గడుపుతారు. విందువినోదాలు.యత్నకార్యసిద్ధి. దేవాలయ దర్శనాలు. వాహనయోగం. వ్యాపారాలు మరింత విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఆటుపోట్లు తొలగుతాయి.

మకరం... ధనవ్యయం. విద్యార్థుల కృషి అంతగా ఫలించదు. ముఖ్యమైన వ్యవహారాలు ముందుకు సాగవు. ఆరోగ్యసమస్యలు. దైవదర్శనాలు. వ్యాపారాలలో  ఇబ్బందులు. ఉద్యోగాలలో చిక్కులు.

కుంభం... ముఖ్యమైన వ్యవహారాలలో అవాంతరాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో  కొద్దిపాటి సమస్యలు. అనారోగ్యం. వ్యాపారాలలో కొద్దిపాటి లాభాలు. ఉద్యోగాలలో కొత్త చిక్కులు.

మీనం... ప్రముఖుల నుంచి ముఖ్య సందేశం. దైవదర్శనాలు. ఆస్తిలాభ సూచనలు. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఉత్సాహం పెరుగుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement