ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..? | Weekly Horoscope Telugu 22-11-2026 To 28-11-2026 | Sakshi
Sakshi News home page

Weekly Horoscope In Telugu: ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?

Nov 22 2026 12:54 AM | Updated on Nov 22 2026 12:54 AM

Weekly Horoscope Telugu 22-11-2026 To 28-11-2026

మేషం..
ఆర్థిక వ్యవహారాలలో మరింత  పురోగతి.  అనుకున్న  పనులు ఆలస్యం లేకుండా సజావుగా పూర్తి చేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. కొన్ని సమస్యలను స్వయంగా పరిష్కరించుకుంటారు.. జీవిత భాగస్వామి ద్వారా ఆస్తిలాభ సూచనలు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. విద్యార్థులు ఆశించిన అవకాశాలు అందిపుచ్చుకుంటారు. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు సఫలం. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపార లావాదేవీలు సంతృప్తినిస్తాయి. కొత్త పెట్టుబడులకు తగిన సమయం. ఉద్యోగవర్గాలకు నూతనోత్సాహం. క్రీడాకారులు, పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు ఉంటాయి. వారం చివరిలో ఆరోగ్యభంగం. శ్రమ పెరుగుతుంది. ధనవ్యయం. ఆకుపచ్చ, తెలుపు రంగులు. లక్ష్మీస్తుతి మంచిది.

వృషభం...
ఆర్థికంగా గతం కంటే మెరుగ్గా ఉంటుంది. ముఖ్యమైన  పనులు సవ్యంగా పూర్తి కాగలవు. ఇంటాబయటా మీదే పైచేయిగా ఉంటుంది. సన్నిహితులు, సోదరులతో విభేదాలు తొలగుతాయి. బంధువులు మీపై మరింత ఆదరణ చూపుతారు. చాకచక్యంగా వ్యవహరించి శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకుంటారు. ఉద్యోగయత్నాలలో కొంత అనుకూలత. పలుకుబడి మరింత పెరుగుతుంది. వాహనయోగం. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో  ఉన్నత హోదాలు దక్కే ఛాన్స్‌. కళాకారులు, రాజకీయవర్గాలకు ఆకస్మిక  విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో దూరప్రయాణాలు. వృథా ఖర్చులు. వ్యయప్రయాసలు.  గులాబీ, లేత ఎరుపు రంగులు. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

మిథునం...
పెండింగ్‌  పనులు సైతం పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు. పరిచయాలు విస్తృతమవుతాయి. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. వివాహ, ఉద్యోగయత్నాలలో పురోగతి ఉంటుంది. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపార లావాదేవీలు ఆశాజనకమే. ఉద్యోగాలలో ఉన్నతపోస్టులు రావచ్చు.  క్రీడాకారులు, కళారంగం వారికి  విదేశీ పర్యటనలు. వారం చివరిలో అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. గులాబీ, పసుపు రంగులు.  నవగ్రహస్తోత్రాలు పఠించండి.

కర్కాటకం...
ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. అనుకోని సంఘటన ఆకట్టుకుంటుంది. విద్యార్థుల కృషి ఫలిస్తుంది. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది.  ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. వాహనాలు, భూములు కొంటారు. వివాహ యత్నాలలో కదలికలు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ నిర్ణయాలు కుటుంబసభ్యులు స్వాగతిస్తారు.  వ్యాపార లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి.  వైద్య, కళారంగాల వారికి మరింత అనుకూలత ఉంటుంది.  వారం ప్రారంభంలో ధనవ్యయం. ఆరోగ్యసమస్యలు. మిత్రులతో వివాదాలు. ఎరుపు, గులాబీ రంగులు.  హనుమాన్‌ ఛాలీసా పఠించండి.

సింహం...
పనులు కొంత నత్తనడకన సాగుతాయి. ఆదాయ వ్యయాలు సమానస్థాయిలో ఉంటాయి. మిత్రులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. ఆరోగ్యం మందగిస్తుంది. ఆస్తి వివాదాలను నేర్పుగా పరిష్కరించుకుంటారు. దూరపు బంధువులను కలుసుకుని కష్టసుఖాలు విచారిస్తారు. ఆప్తులతో ఉత్తరప్రత్యుత్తరాలు. భూములు, వాహనాలు కొనుగోలులో కొంత జాప్యం. నిరుద్యోగులు, విద్యార్థుల శ్రమకు ఫలితం దక్కే సమయం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.  వ్యాపారాలలో అనుకున్న లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో అనుకోని ప్రగతి కనిపిస్తుంది.  క్రీడాకారులు, పారిశ్రామికవర్గాలకు శుభవార్తలు అందుతాయి. వారం చివరిలో వృథా ఖర్చులు. సోదరులతో మాటపట్టింపులు. నీలం, నేరేడు రంగులు.  విçష్ణుధ్యానం చేయండి.

కన్య...
ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. వేడుకలు, సభలలో  పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. పెండింగ్‌ పనులు సైతం ప్రస్తుతం పూర్తి చేస్తారు. బంధువులతో మరింత ఉత్సాహంగా గడుపుతారు. కొన్ని కీలక నిర్ణయాలపై కుటుంబసభ్యులతో సంప్రదింపులు. తీర్థయాత్రలు చేస్తారు. స్వల్ప అనారోగ్య సూచనలు. గృహ నిర్మాణ యత్నాలు అనుకూలిస్తాయి. నిరుద్యోగుల శ్రమ ఫలిస్తుంది. ఒక ఆహ్వానం ఆశ్చర్యం కలిగిస్తుంది. వ్యాపారాలకు కొత్త పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగాలలో ప్రతిబంధకాలు తొలగుతాయి. వైద్యరంగం, పారిశ్రామికవేత్తలకు ఉపయుక్త సమాచారం అందుతుంది.,  వారం ప్రారంభంలో శ్రమాధిక్యం. బంధువులతో విభేదాలు. గులాబీ, లేత ఆకుపచ్చ రంగులు. శ్రీరామరక్షాస్తోత్రం పఠించండి.

తుల...
రావలసిన సొమ్ము అందుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. మిత్రుల నుంచి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. ఆరోగ్యం కొంత కుదుటపడుతుంది. విద్యార్థులకు ఊహించని అవకాశాలు. ఇంటి నిర్మాణాలు, కొనుగోలులో ప్రతిష్ఠంభన తొలగుతుంది. ఇంటిలో శుభకార్యాలపై చర్చలు. వ్యాపారాలు గతం కంటే పుంజుకుంటాయి. ఉద్యోగాలలో మరిన్ని ప్రశంసలు అందుతాయి. క్రీడాకారులు, పారిశ్రామికవర్గాలకు ఊహలు నిజం కాగలవు. వారం మధ్యలో వ్యయప్రయాసలు. బంధువిరోధాలు. ఆకుపచ్చ, గులాబీ రంగులు. శివస్తుతి మంచిది.

వృశ్చికం...
ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. సన్నిహితులతో ఉల్లాసంగా గడుపుతారు. శ్రేయోభిలాషుల నుంచి అందిన సమాచారం సంతోషం కలిగిస్తుంది. సంఘంలో గౌరవం మరింతగా పెరుగుతుంది. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు దక్కించుకుంటారు. ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కుటుంబంలో శుభకార్యాలపై చర్చలు. వాహనాలు, భూములు కొంటారు. నూతన వ్యక్తుల పరిచయం. వ్యాపార లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగాలలో పదోన్నతులు దక్కించుచకుంటారు. కళాకారులు,  రాజకీయవేత్తలకు నూతనోత్సాహం. వారం చివరిలో అనారోగ్యం. ఇంటాబయటా ఒత్తిడులు. తెలుపు, పసుపు రంగులు.  నృసింహస్తోత్రాలు పఠించండి.

ధనుస్సు...
పట్టింది బంగారమే కాగలదు. కుటుంబసభ్యులు మరింత ఆప్యాయత కనబరుస్తారు. బంధువులతో సఖ్యత నెలకొంటుంది. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. మీ అంచనాలు, వ్యూహాలు ఫలిస్తాయి. చిరకాల మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. ఇంటి నిర్మాణాలలో ఆటంకాలు తొలగుతాయి. ఆరోగ్య సమస్యలు కొంత చికాకు పరుస్తాయి. విద్యార్థులు, నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు పురోగతిలో సాగి లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో  ఉన్నత హోదాలు. క్రీడాకారులు, పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం చివరిలో అనుకోని ధనవ్యయం. శ్రమ తప్పకపోవచ్చు. ఎరుపు, నేరేడు రంగులు.  గణేశాష్టకం పఠించండి.

మకరం...
ఆర్థిక విషయాలు గతం కంటే ఆశాజనకంగా ఉంటాయి. రుణదాతల ఒత్తిడుల నుంచి బయటపడతారు. బంధువులు మరింత దగ్గరవుతారు. కొత్త వ్యక్తుల పరిచయం. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. కొత్త కాంట్రాక్టులు పోటీని తట్టుకుని దక్కించుకుంటారు. ఆలయాలు సందర్శిస్తారు. నిరుద్యోగులను ఒక ప్రకటన ఆకట్టుకుంటుంది. వ్యాపారాలలో అనుకున్న రీతిలో పెట్టుబడులు అందుకుంటారు. ఉద్యోగాలలో పదోన్నతి అవకాశాలు. పరిశోధకులు, కళాకారులకు గౌరవ , పురస్కారాలు అందుతాయి. వారం ప్రారంభంలో అనారోగ్య సూచనలు. మిత్రులతో విభేదాలు. గులాబీ, లేత ఎరుపు రంగులు.  విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

కుంభం...
పనులు సాఫీగా సకాలంలో  పూర్తి చేస్తారు. శుభకార్యాలలో చురుగ్గా పాల్గొంటారు. రావలసిన బాకీలు అంది అవసరాలు తీరతాయి. బంధువుల నుంచి ఆహ్వానాలు రాగలవు. ఆస్తి వివాదాలను పరిష్కరించుకుంటారు. నిరుద్యోగుల యత్నాలు  సఫలం. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్యపరంగా కొద్దిపాటి చికాకులు. వ్యాపారాలు మరింత లాభసాటిగా ఉండవచ్చు. ఉద్యోగాలలో మీదే పైచేయిగా నిలుస్తుంది. వైద్యరంగం, రాజకీయవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం మధ్యలో ధనవ్యయం. బంధువుల నుంచి ఒత్తిడులు. నేరేడు, ఆకుపచ్చ రంగులు.  అన్నపూర్ణాష్టకం పఠించండి.

మీనం...
పనుల్లో కొంత జాప్యం. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. ముఖ్య నిర్ణయాలలో తొందరపాటు వద్దు. ఆలోచనలు స్థిరంగా ఉండవు.  ఆరోగ్యభంగం. సన్నిహితుల నుంచి  ఒత్తిడులు పెరుగుతాయి. మీ అభిప్రాయాలను కుటుంబసభ్యులు తిరస్కరిస్తారు.  వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు వాయిదా వేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. విద్యార్థులకు శ్రమాధిక్యం.  వ్యాపారాలలో కొంత నిరాశ. ఉద్యోగాలలో అనుకోని మార్పులు ఉండవచ్చు. క్రీడాకారులు, కళాకారులు సామాన్యంగానే ఉంటుంది. వారం మధ్యలో శుభవార్తలు. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. ఎరుపు, తెలుపు రంగులు. దేవీస్తుతి మంచిది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement