ఈ రాశి వారికి ధన, వస్తులాభాలు | Rasi Phalalu: Daily Horoscope On 19-11-2026 In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu: ఈ రాశి వారికి ధన, వస్తులాభాలు

Nov 19 2026 12:23 AM | Updated on Nov 19 2026 12:25 AM

Rasi Phalalu: Daily Horoscope On 19-11-2026 In Telugu

గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం, తిథి: శు.దశమి రా.2.12 వరకు, తదుపరి ఏకాదశి, నక్షత్రం: పూర్వాభాద్ర రా.3.09 వరకు, తదుపరి ఉత్తరాభాద్ర, వర్జ్యం: ఉ.8.53 నుండి 10.33 వరకు, దుర్ముహూర్తం: ఉ.9.53 నుండి 10.38 వరకు, తదుపరి ప.2.22 నుండి 3.06 వరకు, అమృత ఘడియలు: రా.6.50 నుండి 8.30 వరకు.

- సూర్యోదయం : 6.10
- సూర్యాస్తమయం : 5.21
- రాహుకాలం : ప.1.30 నుండి 3.00 వరకు
- యమగండం :  ఉ.6.00 నుండి 7.30 వరకు

మేషం...
- కొన్ని సమస్యలు తీరతాయి. ఆప్తులు, బంధువులతో సఖ్యత. విందువినోదాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు అనుకూల పరిస్థితి.

వృషభం...
- చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. పనులలో పురోగతి. ఇంటాబయటా మీదే పైచేయి. వృత్తి, వ్యాపారాలలో ముందడుగు వేస్తారు.

మిథునం...
- వ్యయప్రయాసలు. బంధుమిత్రులతో విభేదాలు. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలలో గందరగోళం.

కర్కాటకం...
- ఆకస్మిక ప్రయాణాలు. పనులు వాయిదా పడతాయి. అనారోగ్యం. మిత్రులతో కలహాలు. కష్టించినా ఫలితం కనిపించదు. వృత్తి, వ్యాపారాలు నిరాశ పరుస్తాయి.

సింహం...
- చేపట్టిన కార్యక్రమాలలో విజయం. ఆర్థికాభివృద్ధి. చర్చలు ఫలిస్తాయి. దైవదర్శనాలు. వాహనయోగం. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.

కన్య...
- ఉద్యోగయత్నాలు సానుకూలం. సంఘంలో గౌరవం. వస్తు, వస్త్రలాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. యత్నకార్యసిద్ధి. వృత్తి, వ్యాపారాలలో పురోభివృద్ధి.

తుల...
- రుణదాతల ఒత్తిడులు. పనుల్లో ఆటంకాలు. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

వృశ్చికం...
- ప్రయాణాలలో ఆటంకాలు. ఖర్చులు అధికం. పనులు నిదానంగా సాగుతాయి. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలు న త్తనడకన సాగుతాయి.

ధనుస్సు...
- పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆహ్వానాలు అందుతాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. కార్యజయం. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి.

మకరం...
-మిత్రులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. కుటుంబంలో చికాకులు. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు.

కుంభం...
- ఇంటిలో శుభకార్యాలు. ఆకస్మిక ధనలాభం. కార్యసిద్ధి. పలుకుబడి పెరుగుతుంది. ఉద్యోగయత్నాలు సఫలం. వ్యాపార, ఉద్యోగాలలో పురోగతి.

మీనం...
- కుటుంబసభ్యులతో వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బంధువులను కలుసుకుంటారు. ఆరోగ్య సమస్యలు. శ్రమాధిక్యం.  వృత్తి, వ్యాపారాలలో చికాకులు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement