మేషం..
కొత్త పనులను పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. ఆస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో ఇబ్బందులు తొలగుతాయి. కళాకారులు, పారిశ్రామికవర్గాలకు ఊహించని విదేశీ పర్యటనలు ఉంటాయి. వారం ప్రారంభంలో ధనవ్యయం. అనారోగ్యం. గులాబీ, నేరేడు రంగులు. శివాష్టకం పఠించండి.
వృషభం..
విద్యార్థులకు ఊహించని∙అవకాశాలు దక్కుతాయి. ఉన్నత వ్యక్తులు పరిచయమవుతారు. ముఖ్య కార్యక్రమాలు కొంత శ్రమపడ్డా పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు మెరుగుపడతాయి. వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు విస్తరణలో అవాంతరాలు తొలగుతాయి. ఉద్యోగాలలో మరింత గుర్తింపు రాగలదు. క్రీడాకారులు, రాజకీయవర్గాలకు శుభవార్తలు అందుతాయి. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. బంధువిరోధాలు. గులాబీ, ఆకుపచ్చ రంగులు. కనకధారా స్తోత్రాలు పఠించండి.
మిథునం..
సమయానికి డబ్బు చేతికందుతుంది. ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. శ్రమ పెరిగినా ఫలితం కనిపిస్తుంది. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. ఉద్యోగావకాశాలు దక్కించుకుంటారు. గృహ నిర్మాణయత్నాలు కలసివస్తాయి. వ్యాపారాలు బాగా సాగుతాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు తథ్యం. పారిశ్రామికవర్గాలకు కొత్త అనుమతులు లభిస్తాయి. వారం మ«ధ్యలో ధనవ్యయం. అనారోగ్యం. ఎరుపు, లేత ఆకుపచ్చ రంగులు. గణేశాష్టకం పఠించండి.
కర్కాటకం..
వ్యవహారాలలో పురోగతి కనిపిస్తుంది. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు విద్యావకాశాలు దక్కుతాయి. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరం. వ్యాపారాలలో అభివృద్ధి కనిపిస్తుంది. ఉద్యోగాలలో అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. కళారంగం వారికి కొత్త అవకాశాలు. వారం చివరిలో ఆరోగ్యభంగం. శ్రమా«ధిక్యం. బంధువిరోధాలు. నీలం, నేరేడు రంగులు. నృసింహస్తోత్రాలు పఠించండి.
సింహం..
ముఖ్యమైన కార్యక్రమాలలో విజయం సాధిస్తారు. పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. భూవివాదాలు కొలిక్కి వస్తాయి. కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. విద్యార్థులు, నిరుద్యోగులకు ఆలోచనలు కలసివస్తాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. రాజకీయవేత్తలు, కళారంగం వారికి శుభవర్తమానాలు. వారం చివరిలో ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. ఎరుపు, నేరేడు రంగులు. రాఘవేంద్రస్తుతి మంచిది.
కన్య..
ఆర్థిక లావాదేవీలు ఆశాజనకం. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. ముఖ్యమైన పనులు విజయవంతంగా సాగుతాయి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకుల నుంచి బయటపడతారు. రాజకీయ, పారిశ్రామికవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం ప్రారంభంలో అనారోగ్యం. బంధువిరోధాలు. నీలం, నేరేడు రంగులు. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.
తుల..
అనుకున్న వ్యవహారాలు నెమ్మదిగా పూర్తి చేస్తారు. వ్యతిరేకులు కూడా అనుకూలురుగా మారతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కొన్ని శుభకార్యాలు నిర్వహిస్తారు. వాహనయోగం. ఒక ప్రకటన నిరుద్యోగులకు ఊరటనిస్తుంది. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో సమస్యల నుంచి బయటపడతారు. రాజకీయవర్గాలకు మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారం మధ్యలో బంధువిరోధాలు. శ్రమ పెరుగుతుంది. ఆకుపచ్చ, నేరేడు రంగులు. స్తోత్రాలు పఠించండి.
వృశ్చికం..
ఆర్థిక వ్యవహారాలలో ఆటుపోట్లు ఎదురవుతాయి. బంధువులతో తగాదాలు. శ్రమ తప్ప ఫలితం కనిపించదు. విద్యార్థులు, నిరుద్యోగుల యత్నాలు నెమ్మదిస్తాయి. ఆరోగ్య సమస్యలు ఎదురుకావచ్చు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో పనిఒత్తిడులు పెరుగుతాయి. కళాకారులు, రాజకీయవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం మధ్యలో ధనలబ్ధి. వాహనయోగం. పసుపు, లేత ఎరుపు రంగులు. లక్ష్మీస్తుతి మంచిది.
ధనుస్సు..
పలుకుబడి, హోదాలు కలిగిన వారితో పరిచయాలు. ఆస్తుల వివాదాల నుంచి గట్టెక్కుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. సోదరులతో సఖ్యత నెలకొంటుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకున్న మార్పులు ఉండవచ్చు. పారిశ్రామికవర్గాలకు కొత్త ఆశలు చిగురిస్తాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు. మిత్రులతో విభేదాలు. నీలం, నేరేడు రంగులు. నవగ్రహస్తోత్రాలు పఠించండి.
మకరం..
ముఖ్య వ్యవహారాలు విజయవంతంగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకం. స్థిరాస్తి వివాదాలను పరిష్కరించుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. గృహ నిర్మాణాలు చేపడతారు. ఎంతటి వారినైనా మాటలతో ఆకర్షిస్తారు. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగాలలో కొత్త హోదాలు దక్కే అవకాశం. రాజకీయవర్గాలకు పదవులు వరించవచ్చు. వారం ప్రారంభంలో కుటుంబంలో చికాకులు. అనారోగ్యం. ఎరుపు, గులాబీ రంగులు. గణేశాష్టకం పఠించండి.
కుంభం..
మొదట కొన్ని ఇబ్బందులు ఎదురైనా ఆత్మవిశ్వాసంతో అధిగమిస్తారు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. విద్యార్థులకు అనుకూల ఫలితాలు ఉంటాయి. స్థిరాస్తి వివాదాల పరిష్కారంపై చర్చలు జరుపుతారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో కొత్త హోదాలు దక్కుతాయి. పారిశ్రామికవేత్తలు, కళారంగం వారికి ప్రోత్సాహకరమైన సమయం. వారం చివరిలో అనారోగ్యం. మిత్రులతో విభేదాలు. నీలం, ఆకుపచ్చ రంగులు. హనుమాన్ చాలీసా పఠనం మంచిది.
మీనం..
మొదట్లో కొన్ని ఇబ్బందులు ఎదురుకావచ్చు. ఆత్మస్థైర్యంతో అధిగమిస్తారు. విద్యార్థులకు మంచి ఫలితాలు ఉంటాయి. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. వాహనాలు కొంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో కొత్త హోదాలు దక్కుతాయి. క్రీడాకారులు, కళాకారుల ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. వారం చివరిలో అనారోగ్యం. నీలం, ఆకుపచ్చ రంగులు. దుర్గాస్తోత్రాలు పఠించండి.


