ఈ రాశి వారికి సంఘంలో గౌరవం పెరుగుతుంది | Rasi Phalalu: Daily Horoscope On 13-11-2026 In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu: ఈ రాశి వారికి సంఘంలో గౌరవం పెరుగుతుంది

Nov 13 2026 4:24 AM | Updated on Nov 13 2026 4:24 AM

Rasi Phalalu: Daily Horoscope On 13-11-2026 In Telugu

గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం, తిథి: శు.చవితి సా.5.45 వరకు, తదుపరి పంచమి, నక్షత్రం: మూల ప.3.38 వరకు, తదుపరి పూర్వాషాఢ, వర్జ్యం: ప.1.51 నుండి 3.38 వరకు, తదుపరి రా.2.16 నుండి 4.03 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.19 నుండి 9.05 వరకు, తదుపరి ప.12.06 నుండి 12.51 వరకు, అమృత ఘడియలు: ఉ.8.34 నుండి 10.20 వరకు, నాగుల చవితి.

సూర్యోదయం :    6.08
సూర్యాస్తమయం     :  5.21
రాహుకాలం : ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం :  ప.3.00 నుండి 4.30 వరకు


మేషం... కుటుంబసభ్యులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగులకు పనిఒత్తిడులు.

వృషభం... కుటుంబంలో చికాకులు. ఆదాయానికి మించి ఖర్చులు. బంధువులతో విభేదాలు. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలలో గందరగోళంగా ఉంటుంది.

మిథునం... నూతన వ్యక్తుల పరిచయాలు. విద్య, ఉద్యోగావకాశాలు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలలో అనుకూల పరిస్థితులు.

కర్కాటకం... కుటుంబసమస్యలు తీరతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. భూములు, వాహనాలు కొంటారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు కీలక మార్పులు.

సింహం... ఆర్థిక ఇబ్బందులు. ప్రయాణాలు వాయిదా. పనుల్లో ఆటంకాలు. అనారోగ్యం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

కన్య... మిత్రులతో మాటపట్టింపులు. వ్యయప్రయాసలు. పనుల్లో ప్రతిబంధకాలు. దైవచింతన. వ్యాపార, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.

తుల... ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభవార్తలు. వృత్తి, వ్యాపారాలలో ముందడుగు వేస్తారు.

వృశ్చికం... రాబడికి మించి ఖర్చులు. బంధువులతో వివాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. అనారోగ్యం. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిళ్లు.

ధనుస్సు... నూతన ఒప్పందాలు. ఆస్తిలాభం. యత్నకార్యసిద్ధి.  విద్యార్థులకు అనుకూల సందేశం. వ్యాపారవృద్ధి. ఉద్యోగులకు మంచి గుర్తింపు.

మకరం... శ్రమ మరింత పెరుగుతుంది. భూవివాదాలు. ఆర్థిక పరిస్థితి కొంత మందగిస్తుంది. ఆరోగ్యభంగం. వ్యాపార, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

కుంభం... శ్రమ ఫలిస్తుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం. శుభవార్తలు. వాహన, వస్తులాభాలు. వ్యాపారాలు ఉత్సాహంగా ఉంటాయి. ఉద్యోగులకు ప్రోత్సాహం.

మీనం... చిన్ననాటి మిత్రులతో సఖ్యత. విందువినోదాలు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారవృద్ధి. ఉద్యోగులకు అనుకూల మార్పులు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement