మేషం... దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. వాహనయోగం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలు సాఫీగా సాగుతాయి.
వృషభం... ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. కుటుంబసమస్యల నుంచి ఊరట. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆటుపోట్లు తొలగుతాయి.
మిథునం... మిత్రులతో విభేదాలు. అనారోగ్యం. కుటుంబంలో చికాకులు. ఆకస్మిక ప్రయాణాలు. ఒప్పందాలు వాయిదా. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.
కర్కాటకం... వ్యయప్రయాసలు. మిత్రుల నుంచి ఒత్తిడులు. ఆలయ దర్శనాలు. పనుల్లో ప్రతిష్ఠంభన. ఆస్తుల వివాదాలు. వ్యాపారాల విస్తరణ వాయిదా. ఉద్యోగాలలో ఒడిదుడుకులు.
సింహం... సన్నిహితుల నుంచి ధనలాభం. కార్యసిద్ధి. పలుకుబడి పెరుగుతుంది. భూవివాదాల పరిష్కారం. వ్యాపారాలు మరింత విస్తరిస్తారు. ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.
కన్య... కొన్ని వ్యవహారాలు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. పనుల్లో అవాంతరాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత మందకొడిగా సాగుతాయి.
తుల... కొత్త విషయాలు తెలుస్తాయి. ప్రముఖులతో పరిచయాలు. శ్రమ ఫలిస్తుంది. ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. శుభవార్తలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి.
వృశ్చికం... బంధువర్గంతో మాటపడతారు. ప్రయాణాలు రద్దు చేసుకుంటారు. పనులు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.
ధనుస్సు... పనులు సజావుగా సాగుతాయి. ఆప్తుల నుంచి ముఖ్య సమాచారం. శ్రమ ఫలిస్తుంది. నూతన ఉద్యోగాలు దక్కవచ్చు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు.
మకరం... సన్నిహితుల నుంచి కీలక సమాచారం. ఆస్తుల పురోగతి. వ్యవహారాలలో విజయం. వాహనయోగం. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు.
కుంభం... పనులు కొంత నెమ్మదిస్తాయి. ఆర్థిక పరిస్థితి నిరాశ పరుస్తుంది. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. వ్యాపార లావాదేవీలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఉద్యోగాలలో చికాకులు.
మీనం... శ్రమాధిక్యంతో పనులు పూర్తి. సోదరులతో విభేదాలు. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. ఇంటాబయటా ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి.


