ఈ రాశి వారు భూములు కొనుగోలు చేస్తారు | Rasi Phalalu: Daily Horoscope On 06-11-2026 In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu: ఈ రాశి వారు భూములు కొనుగోలు చేస్తారు

Nov 6 2026 4:42 AM | Updated on Nov 6 2026 4:43 AM

Rasi Phalalu: Daily Horoscope On 06-11-2026 In Telugu

గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వయుజ మాసం, తిథి: బ.ద్వాదశి ఉ.10.56 వరకు, తదుపరి త్రయోదశి, నక్షత్రం: హస్త తె.5.36 వరకు (తెల్లవారితే శనివారం), తదుపరి చిత్త, వర్జ్యం: ప.1.56 నుండి 3.32 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.19 నుండి 9.05 వరకు, తదుపరి ప.12.06 నుండి 12.51 వరకు, అమృత ఘడియలు: రా.2.50 నుండి 4.18 వరకు, ధనత్రయోదశి.

సూర్యోదయం :    6.04
సూర్యాస్తమయం     :  5.25
రాహుకాలం : ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం :  ప.3.00 నుండి 4.30 వరకు

మేషం...వ్యవహారాలలో విజయం. శుభవార్తా శ్రవణం. ఆర్థికాభివృద్ధి. ముఖ్య నిర్ణయాలు. స్థిరాస్తి లాభం. వ్యాపారాలు కొంత విస్తరిస్తారు. ఉద్యోగాలలో నూతనోత్సాహం.

వృషభం....ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి. శ్రమాధిక్యం. దూరప్రయాణాలు. అనారోగ్యం. బంధువులతో విభేదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

మిథునం....మిత్రులతో కలహాలు. రుణయత్నాలు. శ్రమకు ఫలితం ఉండదు. కొన్ని వ్యవహారాలలో అవాంతరాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఊహించని మార్పులు.

కర్కాటకం...ఆసక్తికర సమాచారం అందుతుంది.  ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. ఆలయ దర్శనాలు. వాహనయోగం. స్థిరాస్తి ఒప్పందాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళంగా ఉంటాయి.

సింహం....పనులలో ప్రతిబంధకాలు. ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది. బంధువులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిళ్లు.

కన్య....నూతన విద్యావకాశాలు. ప్రముఖులతో పరిచయం. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వాహనయోగం. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగాలలో పైస్థాయి ప్రశంసలు.

తుల...దూరప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. కొన్ని పనులు నత్తనడకన సాగుతాయి. . శ్రమాధిక్యం. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశ.

వృశ్చికం...పరిస్థితులు అనుకూలిస్తాయి. ఇంటాబయటా అనుకూలం. వాహనయోగం. చర్చలు సఫలం. ఉద్యోగలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత అభివృద్ధి.

ధనుస్సు....కొత్త పనులకు శ్రీకారం. శుభవార్తా శ్రవణం. ధన,వస్తులాభాలు. మిత్రులతో సఖ్యత. కుటుంబసభ్యులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం.

మకరం...పనులలో అవాంతరాలు. కొత్త రుణయత్నాలు. ఆర్థిక పరిస్థితి అనుకూలించదు. వ్యయప్రయాసలు. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

కుంభం...మిత్రులతో విభేదాలు. ప్రయాణాలు వాయిదా. శ్రమ తప్పదు. పనుల్లో జాప్యం. ధనవ్యయం. వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి. ఉద్యోగాలలో మార్పులకు అవకాశం.

మీనం...పనుల్లో మరింత వేగం. ఆప్తుల నుంచి పిలుపు. ఆర్థికంగా బలం చేకూరుతుంది. భూలాభాలు. అంచనాలు నిజమవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement