గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వయుజ మాసం, తిథి: బ.దశమి సా.1.12 వరకు, తదుపరి ఏకాదశి, నక్షత్రం: మఖ ఉ.6.32 వరకు, తదుపరి పుబ్బ తె.5.53 వరకు (తెల్లవారితే గురువారం), వర్జ్యం: ప.2.18 నుండి 3.52 వరకు, దుర్ముహూర్తం: ఉ.11.22 నుండి 12.07 వరకు, అమృత ఘడియలు: రా.11.37 నుండి 1.11 వరకు.
సూర్యోదయం : 6.04
సూర్యాస్తమయం : 5.26
రాహుకాలం : ప.12.00 నుండి 1.30 వరకు
యమగండం : ఉ.7.30 నుండి 9.00 వరకు
మేషం... ఎంత శ్రమపడ్డా ఫలితం కనిపించదు. పనుల్లో జాప్యం. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ పరుస్తుంది. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు చికాకు పరుస్తాయి.
వృషభం... పనులు మధ్యలో విరమిస్తారు. దూరప్రయాణాలు. అనారోగ్యం. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు అంతగా అనుకూలించవు. ఉద్యోగాలలో ఒత్తిడులు, సమస్యలు.
మిథునం... మిత్రుల సలహాలు స్వీకరిస్తారు. వ్యవహారాలలో విజయమే. వస్తులాభాలు. ఒక సమాచారం ఊరటనిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో పొరపాట్లు సరిదిద్దుకుంటారు.
కర్కాటకం... వ్యయప్రయాసలు. మిత్రుల నుంచి ఒత్తిళ్లు. ఆరోగ్యం మందగిస్తుంది. పనులు నిదానంగా సాగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఊహించని మార్పులు.
సింహం... శ్రమకు ఫలితం కనిపిస్తుంది. పనులు సజావుగా పూర్తి. సంఘంలో ఆదరణ. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.
కన్య... ప్రయాణాలు వాయిదా వేస్తారు. పనుల్లో ఆటంకాలు. ఆలయాలు సందర్శిస్తారు. శ్రమ తప్పదు. బంధువుల నుంచి కొన్ని సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో లేనిపోని ఇబ్బందులు.
తుల... వ్యవహారాలలో పురోగతి. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన. ఆకస్మిక ధన, వస్తులాభాలు. పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం.
వృశ్చికం... శుభవార్తలు వింటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కొన్ని పాతబాకీలు వసూలవుతాయి. ముఖ్య నిర్ణయాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో సమస్యలు తొలగుతాయి.
ధనుస్సు... ప్రయాణాలలో అవాంతరాలు. పనుల్లో నిదానం అవసరం. స్వల్ప అనారోగ్య సూచనలు. ధనవ్యయం. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగాలలో కొన్ని మార్పులు.
మకరం... పనుల్లో స్వల్ప ఆటంకాలు. రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. సోదరులతో విభేదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు కాస్త ఇబ్బందిగా మారవచ్చు.
కుంభం... బాకీలు వసూలవుతాయి. చిన్ననాటి స్నేహాలు గుర్తుకు వస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలలో అనుకూలత. ముఖ్య నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.
మీనం... రుణభారాలు తొలగుతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. ముఖ్య వ్యవహారాలలో పురోగతి. దైవదర్శనాలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో మంచి గుర్తింపు.


