గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం, తిథి: శు.ద్వాదశి రా.1.24 వరకు, తదుపరి త్రయోదశి, నక్షత్రం: రేవతి రా.3.31 వరకు, తదుపరి అశ్యిని, వర్జ్యం: ప.3.33 నుండి 5.09 వరకు, దుర్ముహూర్తం: ఉ.6.12 నుండి 7.41 వరకు, అమృత ఘడియలు: ప.2.58 నుండి 4.35 వరకు, క్షీరాబ్ది ద్వాదశి.
సూర్యోదయం : 6.12
సూర్యాస్తమయం : 5.20
రాహుకాలం : ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం : ప.1.30 నుండి 3.00 వరకు
మేషం... ఆర్థికంగా ఇబ్బందులు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. శారీరక రుగ్మతలు. కుటుంబసభ్యులతో విభేదిస్తారు. దేవాలయ దర్శనాలు. వృత్తులు, వ్యాపారాలలో నిరుత్సాహం.
వృషభం... శుభకార్యాలకు హాజరవుతారు. వాహనయోగం. కుటుంబసభ్యులతో సఖ్యత. వృత్తులు, వ్యాపారాలు సంతృప్తినిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. ఆస్తిలాభం.
మిథునం... నూతన ఉద్యోగయోగం. ముఖ్య నిర్ణయాలు. కార్యక్రమాలలో విజయం. సమాజంలో ప్రత్యేక గుర్తింపు. కొన్ని సమస్యల పరిష్కారం. వృత్తులు, వ్యాపారాలలో ఒడిదుడుకుల నుంచి విముక్తి.
కర్కాటకం... చేపట్టిన కార్యాలలో జాప్యం. ఆదాయం కంటే ఖర్చులు పెరుగుతాయి. వ్యయప్రయాసలు. బంధువుల నుంచి ఒత్తిడులు. స్వల్ప శారీరక రుగ్మతలు. వృత్తులు,వ్యాపారాలలో నిరాశ.
సింహం... వ్యయప్రయాసలు. రాబడి కంటే ఖర్చులు అధికం. బంధువర్గం నుంచి ఒత్తిళ్లు. దైవారాధనలో పాల్గొంటారు. వృత్తులు, వ్యాపారాలలో నిరుత్సాహమే. చర్చలు సఫలం.
కన్య... సన్నిహితుల సాయం అందుతుంది. కార్యజయం. పాతస్నేహితుల కలయిక. వృత్తులు, వ్యాపారాలలో పురోగతి. చర్చలు సఫలం. వాహనసౌఖ్యం. శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం.
తుల... నూతన పరిచయాలు. సమాజంలో గౌరవం. విలువైన వస్తువులు కొంటారు. కొన్ని వివాదాలు తీరతాయి. వృత్తులు, వ్యాపారాలలో ఒత్తిడులు తొలగుతాయి. పారిశ్రామికవేత్తలకు యత్నకార్యసిద్ధి.
వృశ్చికం... ఆదాయం అంతగా కనిపించదు. ఖర్చులు అధికం. కుటుంబసభ్యులతో వివాదాలు. శారీరక రుగ్మతలు. వృత్తులు, వ్యాపారాలలో ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన.
ధనుస్సు... అనుకోని ఖర్చులు. బంధువులతో వివాదాలు. స్నేహితులతో విభేదిస్తారు. దేవాలయాలు సందర్శిస్తారు. వృత్తులు, వ్యాపారాలలో మార్పులు. నిర్ణయాలు వాయిదా వేస్తారు.
మకరం... కొత్త విషయాలు తెలుసుకుంటారు. వాహనయోగం. కార్యక్రమాలలో ముందడుగు వేస్తారు. ఇంటాబయటా మీదే పైచేయిగా ఉంటుంది. ఆస్తిలాభం. వృత్తులు, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.
కుంభం... కుటుంబసభ్యులతో వివాదాలు. రాబడికి మించి ఖర్చులు. శ్రమ పెరుగుతుంది. వృత్తులు, వ్యాపారాలు కొంత సామాన్యంగా ఉంటాయి. శారీరక రుగ్మతలు.
మీనం... నూతన పరిచయాలు. సమాజంలో గౌరవం. కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. దైవారాధనలో పాల్గొంటారు. వృత్తులు, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. వాహనయోగం.


