నేటి రాశి ఫలాలు: ఈ రాశి వారికి కుటుంబసభ్యులతో కొద్దిపాటి వివాదాలు | Today Horoscope In Telugu 23-11-2026 | Sakshi
Sakshi News home page

నేటి రాశి ఫలాలు: ఈ రాశి వారికి కుటుంబసభ్యులతో కొద్దిపాటి వివాదాలు

Nov 23 2026 6:10 AM | Updated on Nov 23 2026 6:48 AM

Today Horoscope In Telugu 23-11-2026

శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు,కార్తీక మాసం, తిథి: శు.చతుర్దశి రా.1.50 వరకు తదుపరి పౌర్ణమి, నక్షత్రం: భరణి రా.2.10 వరకు, తదుపరి కృత్తిక,వర్జ్యం: ప.12.17 నుండి 1.50 వరకు, దుర్ముహూర్తం: ప.12.08 నుండి 12.52 వరకు, తదుపరి ప.2.21 నుండి 3.06 వరకు,అమృత ఘడియలు: రా.9.31 నుండి 11.04 వరకు

సూర్యోదయం :    6.12
సూర్యాస్తమయం     :  5.20
రాహుకాలం : ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం :  ఉ.10.30 నుండి 12.00 వరకు 

👉మేషం: ఉద్యోగయత్నాలు∙అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. ఆహ్వానాలు రాగలవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలస్థితి. దైవదర్శనాలు.

👉వృషభం : ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. ధనవ్యయం. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో ఒత్తిడులు. ఉద్యోగాలలో చికాకులు. ఆస్తి వివాదాలు.

👉మిథునం : పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. సంఘంలో మీపై  గౌరవం పెరుగుతుంది. విలువైన వస్తువులు సేకరిస్తారు. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

👉కర్కాటకం : ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. ఆర్థికాభివృద్ధి. పనులు విజయవంతంగా సాగుతాయి. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో  సంతృప్తికరంగా సాగుతాయి.

👉సింహం : పనులు వాయిదా పడతాయి. ఆలోచనలు కలసిరావు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. శ్రమ తప్పదు.  వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో చికాకులు.

👉కన్య : కుటుంబంలో ఒత్తిడులు. కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. ఇంటాబయటా నిరుత్సాహం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహం.

👉తుల : పలుకుబడి పెరుగుతుంది. సన్నిహితుల నుంచి ఆహ్వానాలు. పనులు విజయవంతంగా సాగుతాయి. ఊహించని ఆహ్వానాలు అందుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో పురోగతి.

👉వృశ్చికం : పనుల్లో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతమిత్రుల కలయిక. విందువినోదాలు. ఒక ప్రకటన ఆకట్టుకుంటుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి. ధనలాభం.

👉ధనుస్సు :  చేపట్టిన పనులు మందగిస్తాయి. అనారోగ్యం. కుటుంబసభ్యులతో కొద్దిపాటి వివాదాలు. ఆలోచనలు అంతగా కలసిరావు. విద్యార్థులకు నిరుత్సాహం. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణంగా ఉంటాయి.

👉మకరం : పనులు కొన్ని వాయిదా పడతాయి. మిత్రులతో విభేదాలు. శ్రమకు తగ్గ ఫలితం కనిపించదు. వ్యాపారాలు, ఉద్యోగాలలో లేనిపోని చికాకులు. ఆధ్యాత్మిక చింతన.

👉కుంభం : నూతన ఉద్యోగయోగం. ముఖ్య నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారవృద్ధి. కళాకారులకు సన్మానాలు.

👉మీనం : రుణాలు చేస్తారు. పనులు నత్తనడకన సాగుతాయి. నిర్ణయాలు వాయిదా వేస్తారు. శ్రమాధిక్యం. బంధువులతో విభేదాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement