ఈ రాశి వారికి ఆర్థిక లాభాలు.. అప్రయత్న కార్యసిద్ధి | Rasi Phalalu: Daily Horoscope On 07-10-2026 In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu: ఈ రాశి వారికి ఆర్థిక లాభాలు.. అప్రయత్న కార్యసిద్ధి

Oct 7 2026 2:21 AM | Updated on Oct 7 2026 2:21 AM

Rasi Phalalu: Daily Horoscope On 07-10-2026 In Telugu

గ్రహం అనుగ్రహం: శ్రీపరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, తిథి: బ.ద్వాదశి రా.11.16 వరకు, తదుపరి త్రయోదశి, నక్షత్రం: మఖ రా.10.44 వరకు, తదుపరి పుబ్బ, వర్జ్యం: ఉ.11.15 నుండి 12.47 వరకు, దుర్ముహూర్తం: ఉ.11.24 నుండి 12.12 వరకు, అమృత ఘడియలు: రా.8.25 నుండి 9.56 వరకు.

సూర్యోదయం : 5.54
సూర్యాస్తమయం : 5.44
రాహుకాలం : ప.12.00 నుండి 1.30 వరకు
యమగండం : ఉ.7.30 నుండి 9.00 వరకు 

మేషం..... ప్రయాణాలు వాయిదా. పనుల్లో అవరోధాలు. మిత్రులతో విభేదాలు. ఆరోగ్యసమస్యలు. ఇంటాబయటా ఒత్తిడులు.  వ్యాపారాలు కొంత మందగిస్తాయి. ఉద్యోగాలలో గందరగోళం.

వృషభం... అనుకోని ధనవ్యయం. కుటుంబసభ్యులతో విభేదాలు. బంధువులను కలుసుకుంటారు. పనులు ముందుకు సాగవు. వ్యాపారాలు కొంత నిరాశ కలిగిస్తాయి.  ఉద్యోగాలలో ఒత్తిడులు. శారీరక రుగ్మతలు.

మిథునం... కొత్త పనులు ప్రారంభిస్తారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి. చిన్ననాటి మిత్రుల కలయిక.  ధనలబ్ధి. వాహనయోగం. కీలక నిర్ణయాలు తీసుకుంటారు.

కర్కాటకం.. రాబడి కంటే ఖర్చులు అధికం. పనుల్లో తొందరపాటు. బంధువులతో మాటపట్టింపులు. విద్యార్థులకు శ్రమాధిక్యం. దూరప్రయాణాలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగమార్పులు.

సింహం..... నూతన ఉద్యోగయోగం. ముఖ్యమైన నిర్ణయాలు. వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగాలలో హోదాలు పొందుతారు. కళాకారులకు సన్మానాలు. ఆస్తి వివాదాలు తీరతాయి.

కన్య.... కుటుంబ, ఆరోగ్యసమస్యలు. వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. దూరప్రయాణాలు. బంధువులతో తగాదాలు. ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. వ్యాపారాలలో కొన్ని సమస్యలు.  ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు.

తుల..... పనులు విజయవంతంగా పూర్తి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు.రాబడి పెరుగుతుంది. వస్తు,వస్త్రలాభాలు. ఆస్తుల వివాదాలు తీరతాయి. వ్యాపారవృద్ధి. ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహం.

వృశ్చికం... ప్రయత్నాలలో అనుకూలత. సోదరుల నుంచి ధనలాభం. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆహ్వానాలు అందుతాయి.  వ్యాపారాలలో ముందడుగు. ఉద్యోగాలలో లక్ష్యాలు సాధిస్తారు.  కుటుంబసమస్యలు తీరతాయి.

ధనుస్సు..... కష్టపడ్డా ఫలితం కనిపించదు. ఆస్తి  వివాదాలు ఆకస్మిక ప్రయాణాలు.
వృత్తి, వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. బంధువులతో విభేదాలు. నిరుద్యోగుల యత్నాలు ముందుకు సాగవు.

మకరం...... ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. పనులలో జాప్యం. ఆలయ దర్శనాలు. వ్యాపార, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.

కుంభం... కొత్త విషయాలు తెలుసుకుంటారు. యత్నకార్యసిద్ధి. విలువైన వస్తువులు కొంటారు. విద్యార్థులకు శుభవార్తలు.  వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. ఉద్యోగాలలో హోదాలు దక్కుతాయి.

మీనం... ఆర్థిక లాభాలు. అప్రయత్న కార్యసిద్ధి. పలుకుబడి కలిగిన వారి పరిచయాలు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తులు, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. దైవదర్సనాలు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement