డాగీని అక్కున చేర్చుకుని.. వెంటబెట్టుకుని..! | Blinkit Riders Rescue Puppy Who Now Joins Them On Deliveries Internet Reacts | Sakshi
Sakshi News home page

డాగీని అక్కున చేర్చుకుని.. వెంటబెట్టుకుని..!

Oct 17 2026 8:06 PM | Updated on Oct 17 2026 8:20 PM

Blinkit Riders Rescue Puppy Who Now Joins Them On Deliveries Internet Reacts

నిరాశ్రయులకు,నిర్భాగ్యులకు ఏమాత్రం ఆదరణ లభించినా ఆ ఆనందానికి అవధులు ఉండవు. ఇందులో మనుషులకు, జంతువులకు తేడా లేదు.ఇందుకు సాక్ష్యమే ఈ సంఘటన. ముంబైకి చెందిన ఒక ప్రొఫెషనల్ ఇటీవల ఒక హృద్యమైన సంఘటనను పంచుకోవడం  నెట్టింట ఇది వైరల్‌గా మారింది.

ముంబైకి చెందిన ఓ డెలివరీ బాయ్‌కి.. రహదారి పక్కన గాయాలతో బాధపడుతున్న ఓ కుక్క పిల్ల కనిపించింది. వెంటనే అతను దానిని దగ్గరకు తీసుకుని ఆహారాన్ని అందించాడు. కొద్దిసేపట్లోనే అతనికి దగ్గరైన ఆ కుక్కపిల్లను అతనికి వదిలేయాలని పించలేదు. దీంతో ఆ బుజ్జి కుక్కపిల్లను కూడా తన వెంటే ఉంచుకుని తన బైక్‌ పైనే తిప్పుతున్నాడు ఆ డెలివరీ బాయ్‌. వీరిద్దరి అనుబంధానికి సంబంధించిన ఈ వీడియో ఇపుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారి పలువురి మనసుల్ని గెలుచుకుంటోంది. మూగజీవాల పట్ల ప్రేమ చూపించడానికి పెద్ద హోదా, సంపాదన అక్కర్లేదని రుజువవుతోంది. 

ఇదీ చదవండి: పసికందుపై అఘాయిత్యం, బతికుండగానే ఇసుకలో పాతేశాడు!

 నెటిజన్లు స్పందన 
ముందు ఇది చదివినప్పుడు ఇది మరో బాధాకరమైన అనుభవం గురించిన పోస్ట్ లా అనిపించింది. అయితే, పూర్తిగా చదివాక బాగుంది. సానుకూల స్పందనలు రావడం చాలా ముఖ్యం అని ఒకరన్నారు.  ఈ కుక్కపిల్ల '3 ఇడియట్స్' సినిమాలోని 'జానే నహీ దేంగే తుఝే' డైలాగ్‌ను గుర్తు తెస్తోంది.   మానవత్వం, దయ ఆచరణలో చూడటం చాలా బాగుందని మరో యూజర్ రాశారు.ఇలాంటి కథలు మానవత్వంపై నాకు మళ్లీ నమ్మకాన్ని కలిగిస్తాయి...దాన్ని  జాగ్రత్తగా చూసుకోవడమే కాకుండా, డెలివరీలకు కూడా తమతో పాటు తీసుకువెళ్లడం బచాలా హృద్యంగా ఉందని మరొకరుసంతోషం  వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి: భార్యకు సింపుల్‌ గిఫ్ట్‌ : రూ. 5 కోట్ల సర్‌ప్రైజ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement