Uttarakhand: ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి! | Rishikesh Badrinath highway bus accident | Sakshi
Sakshi News home page

Uttarakhand: ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి!

Nov 17 2026 8:31 AM | Updated on Nov 17 2026 8:49 AM

Rishikesh Badrinath highway bus accident

డెహ్రాడూన్‌: ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రిషికేశ్‌-బద్రీనాథ్‌ జాతీయ రహదారిపై ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి వంతెనపై నుంచి సుమారు 100 మీటర్ల దిగువన నీటిలో పడిపోయింది. మంగళవారం గూలర్‌ బజార్‌ సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, మరో 20 మంది గాయపడ్డారు. బస్సులో సుమారు 30 నుంచి 35 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.

ప్రమాదం గురించి తెలియగానే ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు రంగంలోకి దిగాయి. బియాసీ, ఢాల్వాలా ప్రాంతాల నుంచి సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని బాధితులను కాపాడే చర్యలు చేపట్టాయి. క్షతగాత్రులను అంబులెన్సుల్లో సమీప ఆసుపత్రులకు తరలించారు. ఎస్‌డీఆర్‌ఎఫ్‌ కమాండెంట్‌ అర్పణ్‌ యదువంశీ ఆదేశాలతో అదనపు బృందాలను కూడా ఘటనా స్థలానికి పంపించారు. స్థానిక పోలీసులు, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది సమన్వయంతో సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఉత్తరాఖండ్‌లో గత రెండు రోజుల్లో జరిగిన రెండు ప్రమాదాల్లో మొత్తం 10 మంది మృతిచెందారు. సోమవారం రుద్రప్రయాగ్‌ జిల్లాలో బొలెరో వాహనం 500 మీటర్ల లోతైన లోయలో పడటంతో నలుగురు మరణించగా, ఆరుగురు గాయపడ్డారు.

ఇదీ చదవండి: అమెరికాపై ఇరాన్ రసాయన దాడి?.. వాషింగ్టన్‌లో హై అలర్ట్!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement