AP: రోడ్డు ప్రమాదం.. తెలంగాణ ఐఏఎస్‌కు గాయాలు | Telangana Ias Officer Rajiv Hanumanthu Injured In A Road Accident | Sakshi
Sakshi News home page

AP: రోడ్డు ప్రమాదం.. తెలంగాణ ఐఏఎస్‌కు గాయాలు

Nov 15 2026 7:09 AM | Updated on Nov 15 2026 7:16 AM

Telangana Ias Officer Rajiv Hanumanthu Injured In A Road Accident

సాక్షి, నెల్లూరు జిల్లా: రోడ్డు ప్రమాదంలో తెలంగాణ  ఐఏఎస్‌ గాయపడ్డారు. నెల్లూరు జిల్లా చాపరాళ్లపల్లిలో స్కూల్‌ వ్యాన్‌ను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐఏఎస్‌ హనుమంతు, ఆయన కుటుంబ సభ్యులు గాయపడ్డారు. తెలంగాణ రెవెన్యూ, స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్స్‌ ఐజీ రాజీవ్‌ హనుమంతు.. ఆయన కుటుంబసభ్యులతో కలిసి తిరుమల నుంచి శ్రీశైలం వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. వారిని మెరుగైన వైద్యం కోసం నెల్లూరు తరలించారు.

వేర్వేరు ఘటనల్లో..
తిరుపతి జిల్లాలో రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. చంద్రగిరి మండలం పనపాకం దగ్గర లారీని  సుమో ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా, ఇద్దరు గాయపడ్డారు.  వారిని ఆసుపత్రికి తరలించారు.

కారుతో పాటు వ్యక్తి సజీవ దహనం 
మార్కాపురం జిల్లా: కారు దగ్ధమై అందులో ఉన్న వ్యక్తి కూడా సజీవ దహనమైన ఘటన పోరుమామిళ్ల –శింగరాయకొండ జాతీయ రహదారిపై శుక్రవారం అర్ధరాత్రి జరిగింది. ఎస్‌ఐ కట్టా అనూక్‌ తెలిపిన వివరాలు.. షిఫ్ట్‌ డిజైర్‌ కారు తగలబడుతోందని శుక్రవారం రాత్రి కొందరు పోలీసులకు ఫోన్‌ చేశారు. పోలీసులు అక్కడి వెళ్లి చూడగా.. అప్పటికే కారు పూర్తిగా దగ్ధమై కారులోని వ్యక్తి కూడా డ్రైవర్‌ సీట్లోనే పూర్తిగా కాలిపోయినట్లు గుర్తించారు.

నంబర్‌ ఆధారంగా ఆ కారు మైదుకూరు మండలం నల్లపురెడ్డిపల్లి గ్రామానికి చెందిన పోలు విష్ణువర్ధన్‌రెడ్డిదిగా గుర్తించారు. కారులో దగ్ధమైంది విష్ణువర్ధన్‌రెడ్డా లేక వేరేవారా.. అనేది విచారణలో తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. ప్రమాద స్థలాన్ని ఎస్పీ పంకజ్‌కుమార్‌ మీనా పరిశీలించారు.   

ఇదీ చదవండి: కొండగట్టు.. కోట్ల ‘గుట్టు’

 

 

 

 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement