మాట్లాడేందుకు అవకాశం ఇవ్వలేదంటూ ఆ ఎమ్మెల్యేకు కోపం కట్టలు తెంచుకుంది. ఏకంగా వేదికపైనే మైక్‌ను విసిరికొట్టి, సౌండ్ సిబ్బందిపై బూతుల వర్షం కురిపించారు. అంతటితో ఆగకుండా ముఖ్యమంత్రిపైనే నేరుగా సవాల్ విసిరారు. ఉత్తరాఖండ్‌లోని జౌల్జీబీ జాతరలో కాంగ్రెస్ ఎమ్మెల్యే హరీశ్ సింగ్ ధామి హల్‌చల్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఉత్తరాఖండ్‌లోని పితోర్‌గఢ్ జిల్లాలో జరిగిన చారిత్రాత్మక జౌల్జీబీ జాతరలో ఈ వివాదం చోటుచేసుకుంది. వేదికపై మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకపోవడంతో కాంగ్రెస్ ఎమ్మెల్యే హరీశ్ సింగ్ ధామి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన మైక్‌ను ఆఫ్ చేశారంటూ సౌండ్ సిబ్బందిపై విరుచుకుపడ్డారు. అంతటితో ఆగకుండా మైక్‌ను విసిరికొట్టి, సిబ్బందిని దుర్భాషలాడారు.
జౌల్జీబీ జాతర నిర్వాహక అధ్యక్షుడిగా ఉన్న హరీశ్ ధామి.. ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి పాల్గొన్న కార్యక్రమం ముగిసి.. ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత వేదికపైకి వచ్చారు. తన అనుచరులతో కలిసి ప్రభుత్వంపై, ముఖ్యమంత్రిపై తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యమంత్రిని 'పిరికివాడు' అంటూ వ్యాఖ్యానించడంతో పాటు, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ధార్చులా నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని సవాల్ విసిరారు.
జౌల్జీబీ జాతర అధ్యక్షుడిగా తనను నియమించినప్పటికీ, సభలో మాట్లాడేందుకు అవకాశం ఇవ్వలేదని హరీశ్ ధామి ఆరోపించారు. తాను మాట్లాడుతున్న సమయంలో మైక్‌ను ఆఫ్ చేశారని, తనను మాట్లాడనివ్వకుండా అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వేదికపైనే తన అసంతృప్తిని వెళ్లగక్కారు. అనంతరం ఆయన అనుచరులు కూడా నిరసనకు దిగడంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది.
ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామిపై హరీశ్ ధామి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆయనను పిరికివాడిగా అభివర్ణిస్తూ.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ధార్చులా నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని సవాల్ విసిరారు. తన పార్టీ ఆదేశిస్తే ఏ నియోజకవర్గం నుంచైనా పోటీ చేసి ముఖ్యమంత్రిని ఓడించగలనని వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో ప్రజలే.. ముఖ్యమంత్రికి తగిన సమాధానం చెబుతారన్నారు.
ఈ ఘటనపై బీజేపీ నేతలు స్పందిస్తూ.. హరీశ్ ధామి తీరును మంత్రి రఘువీర్ సింగ్ తప్పుబట్టారు. గత ఐదేళ్లలో తన నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేదని విమర్శించారు. ఎన్నికల్లో ఓడిపోతాననే భయంతోనే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. బహిరంగ వేదికపై ఎమ్మెల్యే ప్రవర్తించిన తీరు ఆమోదయోగ్యం కాదని అన్నారు. రాష్ట్రంలో బీజేపీ వరుసగా మూడోసారి అధికారంలోకి వస్తుందనే భయంతోనే హరీశ్ ధామి ఇలా వ్యవహరిస్తున్నారని రఘువీర్ సింగ్ ఆరోపించారు.
‼️@RahulGandhi 's Mohabbat Ki Dukkan. Watch Uttarakhand Congress MLA Harish Dhami’s Reaction to Mic Glitch at Jauljibi Fair in Pithoragarh. Absolute mentally retarded thugs just like their boss. This is when they're in power. https://t.co/YEprCAaFzJ
— Arun Pudur (@arunpudur) November 15, 2026
ఇదీ చదవండి: బంగ్లాదేశ్‌కు భారీ షాకిచ్చిన భారత్!


