2027 యూపీ ఎన్నికల్లో పొత్తుపై అఖిలేశ్
లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి 2027లో జరిగే ఎన్నికల్లో 181 సీట్లలో పోటీ చేయాలని కాంగ్రెస్ కోరుకుంటోందని సమాజ్‌వాదీ పార్టీ(ఎస్‌పీ) చీఫ్ అఖిలేశ్ యాదవ్ వెల్లడించారు. ఢిల్లీలో శనివారం ఆయన హిందుస్తాన్‌టైమ్స్ లీడర్ షిప్ సమిట్‌లో ఈ విషయం తెలిపారు. ‘అసెంబ్లీలోని మొత్తం 403 సీట్లకు గాను ఎన్ని చోట్ల పోటీ చేయాలో మేం ఇప్పటికే నిర్ణయించుకున్నాం. కాంగ్రెస్ మాత్రం 181 సీట్లు అడుగుతోంది.
ఏదేమైనా, ఈ దఫా బీజేపీని గద్దె దించేందుకు ఇండియా కూటమి ఐక్యంగానే ఎన్నికల బరిలోకి దిగుతుంది’అని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే ఒక కూటమిలో తాము కొనసాగుతున్నందున, బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్‌పీ)తో పొత్తు విషయం ఆలోచించడం లేదు. కాంగ్రెస్‌తో కూడిన ఇండియా కూటమితోనే కొనసాగుతాం. ఈ విషయంలో ఎలాంటి మార్పూ లేదు’అని ఆయన స్పష్టం చేశారు. అయోధ్య రామాలయంలో విరాళాల చోరీయే ఈ ఎన్నికల్లో ప్రధాన అంశంగా మారనుందని చెప్పారు. కాగా, మాయావతి సారథ్యంలోని బీఎస్‌పీ ఇండియా కూటమిలో భాగస్వామి కాదు.


