ఓట్లు తీసేసి ఎన్నికలు జరిపితే అవి ఎన్నికలు అవుతాయా?: రాహుల్‌ | Lok Sabha LoP Congress MP Rahul Gandhi Addressing at Bharat Summit 2026 | Sakshi
Sakshi News home page

ఓట్లు తీసేసి ఎన్నికలు జరిపితే అవి ఎన్నికలు అవుతాయా?: రాహుల్‌

Nov 14 2026 4:49 PM | Updated on Nov 14 2026 4:52 PM

Lok Sabha LoP Congress MP Rahul Gandhi Addressing at Bharat Summit 2026

హైదరాబాద్‌: ప్రపంచంలోనే భారత ప్రజాస్వామ్యం గొప్పది, పెద్దది అని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ అన్నారు. అయితే, ప్రజాస్వామ్య స్ట్రక్షర్‌ కూలిపోతోందని ఆందోళన వ్యక‍్తం చేశారు. హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న భారత్‌ సమ్మిట్‌లో రాహుల్‌ గాంధీ పాల్గొని మాట్లాడారు.

‘‘ఓట్లు తినేసి ఎన్నిక జరిపితే అవి ఎన్నికలు అవుతాయా? లోక్‌సభ ఎన్నికల్లో ఏం జరిగిందో మహారాష్ట్ర ఎన్నిక‍ల్లో అదే జరిగింది. భారత ‍ప్రజాస్వామ్యంపై నాకు నమ్మకం ఉంది. ప్రతిపక్షంగా పోరాడడానికి కనీస మద్దతు ఉండడం లేదు. చాలా వ్యవస్థలు పాసిస్ట్‌ శక్తుల చేతుల్లోకి వెళ్లాయి. దేశంలో లిక్విడిటీ కారణంగానే ప్రజాస్వామ్యం భ్రష్టుపట్టింది. కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకు పాదయాత్రలో ‍ప్రజలతో కలిసి, మాట్లాడాను. ప్రజలు చెప్పేది వినడమే కాదు.. మమ్మల్ని మేం తెలుసుకున్నాం. ఓట్లు తీసేసి ఎన్నికలు జరిపితే అవి ఎన్నికలు అవుతాయా?’’ అని రాహుల్‌ గాంధీ విమర్శించారు.

వ్యాపార సంస్థల అధిపతులుగా, విద్యారంగంలోనూ అన్నీ తమకే తెలుసన్నట్లు వ్యవహరించే వ్యక్తులు కనిపిస్తారని రాహుల్‌ గాంధీ అన్నారు. రాజకీయాల్లో అలాంటి వారిని ఫాసిస్టులుగా పిలుస్తామని చెప్పారు. ‘‘ఫాసిస్టులు సాధారణంగా గట్టిగా అరుస్తుంటారు. కేకలు వేస్తారు. అరుస్తూ ఉంటారు కానీ, ఇతరులు చెప్పేది వినరు. మెజారిటీ ప్రజలు వింటారు, విషయాలను శ్రద్ధగా గమనిస్తారు, వినయంగా ఉంటారు. అందుకే ఫాసిస్టుల గొంతు ఎక్కువగా వినిపిస్తుంది. వ్యవస్థలు కుప్పకూలినప్పుడు చరిత్రలో ఫాసిస్టులు తెరపైకి వస్తుంటారు. గత దశాబ్ద కాలంగా ఫాసిస్టులు స్వేచ్ఛగా చెలరేగిపోతూ, ఎగిరిపడుతూ, అరుస్తూ, కేకలు వేస్తూ ఉన్నారు’’ అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.

2014లో ప్రజాస్వామ్యం ధ్వంసమైంది
దేశంలో 2014లో పూర్తిగా కొత్త తరహా ఎన్నికలను చూశామని రాహుల్‌ గాంధీ చెప్పారు. ‘‘ఇంతకుముందెన్నడూ చూడని విధంగా ఆ ఎన్నికలు జరిగాయి. రాజకీయ వ్యవస్థలోకి లక్షలాది, కోట్లాది డాలర్ల డబ్బు ప్రవహించింది. స్వల్ప తేడాలతో జరిగే ఎన్నికల్లో సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడేందుకు ఉపయోగపడిన ఎన్నికల వ్యవస్థ ఒక్కసారిగా తలకిందులైంది. 

ఈ పరిణామంతో ప్రతిపక్షం దిగ్భ్రాంతికి గురైందని చెప్పకపోతే అది అబద్ధమే అవుతుంది. దశాబ్ద కాలంగా భారత రాజకీయాల్లో ఈ సంక్షోభం కొనసాగింది. ఆ తర్వాత ఒక్కసారిగా అసలు ఏం జరుగుతుందో మాకు అర్థమైంది. ఏం జరిగిందో మేం గుర్తించాం. 2014లో భారతదేశంలో ప్రజాస్వామ్యం ధ్వంసమైందని ఎలాంటి సందేహానికీ తావులేకుండా నిరూపించాం’’ అని రాహుల్ గాంధీ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement