అవినీతి అధికారి.. 2.5 కిలోల బంగారం,1.6 కిలోల వెండి సంచులు లభ్యం | Cash Bag Found In Raid On Madhya Pradesh Officer | Sakshi
Sakshi News home page

అవినీతి అధికారి.. 2.5 కిలోల బంగారం,1.6 కిలోల వెండి సంచులు లభ్యం

Nov 15 2026 5:35 AM | Updated on Nov 15 2026 5:35 AM

Cash Bag Found In Raid On Madhya Pradesh Officer

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లో అవినీతి అధికారుల గుండెల్లో లోకాయుక్త దాడులు రైళ్లు పరిగెట్టిస్తున్నాయి. తాజాగా సత్పురా టైగర్ రిజర్వ్‌ చెందిన ఉన్నతాధికారి అక్రమాస్తుల బాగోతం వెలుగు చూసింది. ఆదాయానికి మించి వందల రెట్లు ఎక్కువ సంపద కూడబెట్టారన్న ఆరోపణలతో లోకాయుక్త పోలీసులు ఏకకాలంలో పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. ఈ దాడుల్లో రూ.7.6 కోట్ల విలువైన అక్రమ ఆస్తుల సంపాదన బయటపడింది.

మధ్యప్రదేశ్‌లోని పచ్‌మర్హిలోని సత్పురా టైగర్ రిజర్వ్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న సంజీవ్ కుమార్ శర్మపై లోకాయుక్త విభాగానికి పక్కా సమాచారం అందింది. ఆయన తన భార్య, మరికొందరితో కలిసి ఆదాయానికి మించి భారీగా ఆస్తులు సంపాదించారంటూ ఫిర్యాదులందాయి. 

ప్రాథమిక విచారణలో ఆయన ఆస్తులు ఆదాయం కంటే సుమారు 228 శాతం ఎక్కువగా ఉన్నట్లు తేలింది. దీంతో కోర్టు నుంచి సెర్చ్ వారెంట్ జారీ చేయించుకున్న లోకాయుక్త ప్రత్యేక బృందాలు.. భోపాల్ డివిజన్ అధికారుల ఆధ్వర్యంలో ఏకకాలంలో దాడులకు దిగాయి.

లోకాయుక్త అధికారులు ప్రాథమిక అంచనా ప్రకారం ఇప్పటివరకు గుర్తించిన ఆస్తుల విలువ రూ. 7.6 కోట్లుగా తేల్చారు. ఇది ఆయన తెలిసిన ఆదాయ వనరుల కంటే సుమారు 560 శాతం అధికమని పేర్కొన్నారు. 

అయితే స్వాధీనం చేసుకున్న రిసార్ట్, హోటల్, భూముల పత్రాలను పూర్తిగా పరిశీలించి, అధికారికంగా విలువ లెక్క గట్టిన తర్వాత ఈ అక్రమాస్తుల మొత్తం మరింత పెరిగే అవకాశం ఉందని లోకాయుక్త వర్గాలు స్పష్టం చేశాయి. ప్రస్తుతానికి సోదాలు ఇంకా కొనసాగుతుండటంతో మరిన్ని ప్రాంతాల్లో కూడా తనిఖీలు చేపట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement