అమెరికాకు మేం రాం రాం! | International Student Enrollment Down 9percent in Fall 2026 | Sakshi
Sakshi News home page

అమెరికాకు మేం రాం రాం!

Nov 17 2026 6:33 AM | Updated on Nov 17 2026 6:33 AM

International Student Enrollment Down 9percent in Fall 2026

9 శాతం తగ్గిన విదేశీ విద్యార్థులు 

గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో 15 శాతం 

అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో మూడు శాతం

న్యూయార్క్‌: మారుతున్న పరిస్థితులు అనండి.. ట్రంప్‌ వైఖరి అనండి.. లేదా ఇంకో కారణం ఏదైనా ఇచ్చేసుకోండి. వాస్తవం ఏమిటంటే ఏటికేడాదీ అమెరికాకు వెళ్లి చదువుకునే విదేశీ విద్యార్థుల సంఖ్య తగ్గిపోతోంది. ఈ ఏడాది ఫాల్‌ అడ్మిషన్లను పరిగణలోకి తీసుకుంటే భారత్‌తోపాటు ఇతర దేశాల నుంచి అమెరికా వెళ్లే విద్యార్థుల సంఖ్య దాదాపు తొమ్మిది శాతం తగ్గిందని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ ఎడ్యుకేషన్‌ (ఐఐఈ) చేసిన సర్వే తెలిపింది. 

అలాగే మొట్టమొదటిసారి చదువుకోసం అమెరికాకు వచ్చ విద్యార్థుల సంఖ్యలో 15 శాతం తగ్గుదల నమోదైంది. గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో చేరే వారి సంఖ్య దాదాపు 15 శాతం తక్కువగా ఉంటే అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో చేరేవారి తగ్గుదల మూడు శాతం మాత్రమే. దాదాపు 800 యూనివర్శిటీల అడ్మిషన్లను పరిశీలించిన తరువాత తామీ నిర్ణయానికి వచి్చనట్లు ఐఐటీ సోమవారం ప్రకటించింది. ‘‘ఈ మధ్య అమెరికాలో చదవాలని ఎవరూ అనుకోవడం లేదు’’అంటారు వీణా దుబల్‌. 

అమెరికా అసోసియేషన్‌ ఆఫ్‌ యూనివర్శిటీ ప్రొఫెసర్స్‌ ప్రధాన న్యాయసలహాదారు అయిన వీణ తండ్రి ఎప్పుడో 1960ల్లో భారత్‌ నుంచి అమోరికాలోని టస్కగీ యూనివర్శిటీలో చదువుకునేందుకు రావడం యాదృచి్ఛకమే కావచ్చు. ట్రంప్‌ ప్రభుత్వ వైఖరి పుణ్యమా అని ‘‘ఇదేమంత (అమెరికా) సేఫ్‌ ప్లేస్‌ కాదు’’అన్న మెసేజ్‌ ప్రపంచమంతా వెళ్లిపోయిందని, వాళ్లు ఈ సందేశాన్ని గుర్తిస్తున్నారని వివరించారు. గత ఏడాది కూడా విదేశీ విద్యార్థుల అడ్మిషన్లు తగ్గిపోయాయి. 

కానీ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన వాళ్లలో ఎక్కువమంది తాత్కాలికంగా పనిచేసుకునేందుకు ఉండిపోవడంతో తేడా స్పష్టంగా తెలియలేదని ఈ రంగంలోని నిపుణులు చెబుతున్నారు. ఎన్నో నెలల ఊహాపోహల తరువాత డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోంల్యాండ్‌ సెక్యూరిటీ (డీహెచ్‌ఎస్‌) బాంబులాంటి నిర్ణయం తీసుకోవడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఆప్షనల్‌ ప్రాక్టీస్‌ ట్రెయినింగ్‌ (ఓపీటీ) కోసం ఒక్కో విద్యార్తి తరఫున విద్యా సంస్థలు 70 వేల డాలర్లు చెల్లించాలని ప్రతిపాదించింది. తుదినిర్ణయం ఇంకా తీసుకోనప్పటికీ దీని ప్రభావం మాత్రం విదేశీ విద్యార్థులపై ఎక్కువగానే ఉంది. ఓపీటీలో పాల్గొనే విద్యార్థుల సంఖ్య ఈ ఏడాది ఆరు శాతం తగ్గిపోయింది.  

రాజకీయ దుమారం... 
అమెరికాలో వేలాది మంది అంతర్జాతీయ విద్యార్థులను అదుపులోకి తీసుకునేందుకు స్వదేశాలకు పంపించే లక్ష్యంతోనే డీహెచ్‌ఎస్‌ ఇటీవల ఓపీటీపై నియంత్రణలను ప్రవేశపెట్టినట్లు నిపుణులు చెబుతున్నారు. విద్యార్థులు నాలుగేళ్లకంటే ఎక్కువ కాలం ఉండరాదని, అందుకు కేంద్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరి అని కూడా డీహెచ్‌ఎస్‌ ఒక ప్రతిపాదన చేసింది కానీ.. న్యాయస్థానం దీన్ని తాత్కాలికంగా నిలిపివేసింది.

 విద్యార్థులు అవసరానికి మించి ఇక్కడ ఉండటాన్ని నివారించేందుకు చట్టంలోని లోసుగులను ఉపయోగించుకుంటున్నారని, అందుకే తాము ఈ రకమైన చర్యలు ప్రతిపాదిస్తున్నామని డీహెచ్‌ఎస్‌ వ్యవహారాలు చూసే మంత్రి మార్క్‌వేన్‌ ములిన్‌ చెబుతున్నారు. ఐఐఈ సర్వే చేసిన 800 యూనివర్శిటీలు, కాలేజీల్లో అడ్మిషన్లు తగ్గిపోయేందుకు  88 శాతం మంది వీసా పద్ధతులను తప్పుపట్టగా, 70 శాతం మంది ప్రయాణాలపై పెట్టిన నియంత్రణలను నిందిస్తున్నారు. ఓపీటీ విషయంలో కట్టడి చేస్తే అంతర్జాతీయ విద్యార్థులు ఇంకో దేశం వెళతారని 95 శాతం మంది అభిప్రాయపడటం గమనార్హం. అదే సమయంలో అమెరికాలో చదువు ఖర్చులు పెరిగిపోవడం కూడా విదేశీ విద్యార్థులను ఆలోచింపజేస్తోందని ఐఐఈ రీసెర్చర్‌ మిర్కా మార్టెల్‌ తెలిపారు.  

భారతీయ విద్యార్థుల్లోనూ తగ్గుదల.... 
ఈ ఏడాది అమెరికాలో చదువుకునేందుకు వెళుతున్న భారతీయ విద్యార్థుల సంఖ్యలో 6.5 శాతం తగ్గుదల ఉన్నట్లు ఓపెన్‌డోర్స్‌ సంస్థ సోమవారం విడుదల చేసిన నివేదిక స్పష్టం చేసింది. 2025–26 సంవత్సరంలో మొత్తం 3,39,435 మంది విద్యార్థులు వేర్వేరు అమెరికన్‌ యూనివర్శిటీలో చేరగా..2024–25లో ఈ సంఖ్య 363,019గా ఉండిందని వివరించింది. అయితే చదువుకోసం అమెరికా వెళ్లే విదేశీ విద్యార్థుల్లో ఈ ఏడాది కూడా భారతీయులదే అగ్రస్థానమని తెలిపింది. మొత్తం విదేశీ విద్యార్థుళ్లో 29.6 శాతం మంది భారతీయులని తెలిపింది. ఈ ఏడాది ముఖ్యంగా గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో చేరే భారతీయ విద్యార్థుల్లో దాదాపు 34 శాతం తగ్గుదల నమోదైందని, అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సుల విషయంలో ఇది కేవలం ఒక శాతం మాత్రమేనని వివరించింది. ఆసక్తికరంగా ట్రంప్‌ ప్రభుత్వం నియంత్రణ విధించాలని ప్రతిపాదించిన ఓపీటీ కోసం గత ఏడాది కంటే దాదాపు 27 శాతం మంది విద్యార్థులు ఎక్కువగా చేరారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement