భారత్, అమెరికా సహా 10 దేశాల సంతకాలు
వాషింగ్టన్: అరుదైన ఖనిజాలు, కృత్రిమ మేధ సరఫరా వ్యవస్థల పరిరక్షణను ఉమ్మడి బాధ్యతగా చేపట్టాలని భారత్, అమెరికాతో పాటు మరో 8 దేశాలు నిర్ణయించాయి. ఈ మేరకు శాన్‌ఫ్రాన్సిస్కో డిక్లరేషన్‌పై సంతకాలు చేశాయి. అమెరికా సారథ్యంలో ఏర్పాటైన పాక్స్ సిలికా కూటమి దేశాల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారత్‌తో పాటు ఆ్రస్టేలియా, బ్రిటన్, జపాన్, యూఏఈ, దక్షిణ కొరియా, ఇజ్రాయెల్, ఖతర్, సింగపూర్ దేశాల భాగస్వామ్యంతో ఈ కూటమి ఏర్పాటును అమెరికా గత డిసెంబర్లో ప్రకటించడం తెలిసిందే.
సెమీ కండక్టర్లు తదితరాల తయారీలో అత్యంత కీలకమైన సిలికాన్ తదితర అరుదైన ఖనిజ వనరుల సరఫరా వ్యవస్థల స్థిరీకరణే లక్ష్యంగా ఈ కూటమి ఏర్పాటైంది. అమెరికా ప్రభుత్వం కొంతకాలంగా కృత్రిమ మేధ (ఏఐ)ని సూపర్ ఇంటలిజెన్స్ (ఎస్‌ఐ)గా పేర్కొంటుండటం తెలిసిందే. ఆవిష్కరణల అనుకూల విధాన వ్యవస్థ, కీలక రంగాల్లో ఎస్‌ఐ అనువర్తనలు, సరఫరా వ్యవస్థల నడుమ సహకారం తదితర ఐదు అంశాలపై వర్కింగ్ గ్రూపులు ఏర్పాటు చేసుకోవాలని పాక్స్ సిలికా సభ్య దేశాలు ఈ సందర్భంగా నిర్ణయించాయి.


