ఢాకా: బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా తిరిగి అడుగుపెట్టకముందే రాజకీయ ప్రకంపనలు మొదలయ్యాయి. డిసెంబర్‌లో స్వదేశానికి వస్తానంటూ ఆమె చేసిన ప్రకటనతో అవామీ లీగ్ కార్యకర్తలు రోడ్డెక్కారు. హసీనా సొంత జిల్లా గోపాల్‌గంజ్‌లో ఆదివారం (నవంబర్ 15) వందలాది మంది కార్యకర్తలు ఆయుధాలతో కవాతు నిర్వహిస్తూ విధ్వంసం సృష్టించారు. పోలీసుల బారికేడ్లను బద్దలుకొట్టి, సాయుధ పోలీసు వాహనానికి నిప్పంటించారు. పోలీసు అవుట్‌పోస్టును ధ్వంసం చేయడంతో పాటు ప్రభుత్వ ఆస్తులపై దాడులకు దిగారు. పరిస్థితి అదుపు తప్పకుండా బంగ్లాదేశ్ ప్రభుత్వం భారీగా భద్రతా బలగాలను మోహరించింది. జిల్లా కలెక్టర్, పోలీసు సూపరింటెండెంట్‌ను సైతం బదిలీ చేసింది.
గోపాల్‌గంజ్‌లో అవామీ లీగ్ కార్యకర్తల ఆందోళనలు తీవ్రరూపం దాల్చడంతో ప్రభుత్వం భద్రతను కట్టుదిట్టం చేసింది. ఇప్పటికే ఆరు ప్లాటూన్ల బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్ (బీజీబీ) బలగాలను మోహరించింది. స్థానిక నివేదికల ప్రకారం సుమారు 1,350 మంది పోలీసులను కూడా భద్రతా విధుల్లో నియమించారు. ఆందోళనకారులు పోలీసు వాహనం, పోలీసు బాక్స్‌తో పాటు స్మారక చిహ్నాన్ని ధ్వంసం చేశారు. హాదీ స్క్వేర్ వద్ద నేమ్‌ప్లేట్‌ను తొలగించారు. మూసివేసిన అవామీ లీగ్ జిల్లా కార్యాలయాన్ని తిరిగి తెరిచారు. రోడ్లపై టైర్లు తగలబెట్టి రాకపోకలకు అంతరాయం కలిగించారు.
భారత్ నిర్ణయంపైనే ఉత్కంఠ
హసీనా తిరిగి రావాలన్న ప్రకటనలకే పరిమితం కాకుండా తాజాగా కీలక అడుగు వేశారు. భారత్‌లో ఉంటున్న ఆమె బంగ్లాదేశ్ హైకమిషన్‌కు కొత్త పాస్‌పోర్టు, జాతీయ గుర్తింపు కార్డు (NID) జారీ చేయాలని కోరుతూ దరఖాస్తు పంపించారు. లండన్‌కు చెందిన మ్యాట్రిక్స్ ఛాంబర్స్ న్యాయ సంస్థ ఈ మేరకు దౌత్య కార్యాలయానికి లేఖ రాసింది. డిసెంబర్‌లో ఎట్టి పరిస్థితుల్లోనైనా స్వదేశానికి తిరిగొస్తానని హసీనా చెబుతున్నారు. అయితే ఆమెకు పత్రాలు జారీ చేయడానికి చట్టపరమైన అర్హత ఉందా? అనే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు బంగ్లాదేశ్ హోంమంత్రి తెలిపారు. మరోవైపు.. హసీనాను అప్పగించాలని బంగ్లాదేశ్ ప్రభుత్వం భారత్‌పై ఒత్తిడి పెంచుతోంది. తమ దేశంలో ఆమెకు మరణశిక్ష విధించిన నేపథ్యంలో అప్పగింత ఒప్పందం ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతోంది. ఈ ప్రక్రియకు సంబంధించిన న్యాయపరమైన లాంఛనాలు పూర్తయ్యాయని బంగ్లాదేశ్ న్యాయశాఖ మంత్రి ఇప్పటికే ప్రకటించారు. అయితే భారత్ విదేశాంగ శాఖ మాత్రం ఇది న్యాయపరమైన అంశమని, నిబంధనల ప్రకారం పరిశీలిస్తామని వెల్లడించింది. ఇప్పటివరకు అప్పగింతపై తుది నిర్ణయం ప్రకటించలేదు.
Inside the Bangladesh Foreign Minister's own constituency, the Awami League held a massive rally protesting in defiance of the suppression of the BNP-Jamaat coalition. https://t.co/EerXoGslSw
— Tasin Mahdi 🇧🇩 (@in_tasin) November 15, 2026
ఉద్రిక్తతలకు మరో కారణం
గోపాల్‌గంజ్‌లో ఆదివారం ఆందోళనలకు ముందు తుంగిపారాలో అధికార బీఎన్‌పీకి చెందిన రెండు కార్యాలయాలకు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పంటించారు. దీంతో అధికార, ప్రతిపక్ష వర్గాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఈ పరిణామాలపై ప్రధాని తారిఖ్ రెహ్మాన్ అధ్యక్షతన కేబినెట్ సమావేశంలో చర్చించారు. పరిస్థితిని అదుపులో ఉంచేందుకు అవసరమైతే మరిన్ని భద్రతా బలగాలను రంగంలోకి దించాలని ప్రభుత్వం భావిస్తోంది.
బంగ్లాదేశ్‌లో అసలు ఏం జరుగుతోంది?
2024 ఆగస్టులో హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత అవామీ లీగ్ రాజకీయ కార్యకలాపాలపై నిషేధం విధించారు. 2026 ఫిబ్రవరిలో జరిగిన ఎన్నికల్లో అవామీ లీగ్ పోటీకి దూరమైంది. బీఎన్‌పీ అధికారంలోకి వచ్చి తారిఖ్ రెహ్మాన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు హసీనా తిరిగి రావాలన్న ప్రయత్నాలు, ఆమెపై ఉన్న మరణశిక్ష, భారత్ వద్ద పెండింగ్‌లో ఉన్న అప్పగింత అభ్యర్థన.. ఈ మూడు అంశాలు బంగ్లాదేశ్ రాజకీయాల్లో కీలకంగా మారాయి.
Thousands of agitated people have taken to the streets in Gopalganj, Bangladesh. They have a single demand: to rid Bangladesh of militants, reinstate the Awami League—the party that secured the nation's independence—and ensure peace and order for the people. https://t.co/VU312XlPtR
— SA (@Shariaalam5) November 15, 2026
ఇదీ చదవండి: హసీనా రీఎంట్రీపై బంగ్లాదేశ్ కీలక ప్రకటన


