ఘోర ప్రమాదం.. రెండు బస్సులు ఢీ.. | 2 Punjab Govt Pilgrimage Buses Collide Head On In Tarn Taran | Sakshi
Sakshi News home page

ఘోర ప్రమాదం.. రెండు బస్సులు ఢీ..

Nov 15 2026 7:40 AM | Updated on Nov 15 2026 7:40 AM

2 Punjab Govt Pilgrimage Buses Collide Head On In Tarn Taran

తీర్థ యాత్రికులతో కూడిన రెండు బస్సులు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఐదుగురు చనిపోగా, 15 మంది గాయాలపాలయ్యారు. పంజాబ్‌లోని తరన్‌ తరన్‌ జిల్లా 54వ నంబర్‌ జాతీయ రహదారిపై శనివారం సాయంత్రం ఘటన చోటుచేసుకుంది. పంజాబ్‌ ప్రభుత్వ యాజమాన్యంలోని తీర్థ యాత్ర బస్సులు నౌషెరా పన్నువాన్‌ వద్ద ఢీకొన్నాయని అధికారులు తెలిపారు.

అమృత్‌సర్‌ వెళ్లే బస్సు డ్రైవర్‌ ఓ బైక్‌ను తప్పించే క్రమంలో రోడ్డు డివైడర్‌ దాటి, ఎదురుగా అమృత్‌సర్‌ నుంచి వస్తున్న ఇంకో బస్సును ఢీకొట్టాడు. ఆ తాకిడికి భారీ పేలుడు వంటి శబ్ధం వినిపించిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. రెండు బస్సుల ముందు భాగం పూర్తిగా నుజ్జయింది. దీంతో, ఇరుక్కుపోయిన వారిని స్థానికులతో కలిసి పోలీసులు అతికష్టమ్మీద బయటకు తీయ గలిగారు.

ఘటనలో బస్సులోని నలుగురుయాత్రికులతోపాటు బైక్‌పై వస్తున్న ఒకరు చనిపోయారని పోలీసులు తెలిపారు. తరన్‌ తరన్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో 15 మంది చికిత్స పొందుతున్నట్లు వెల్లడించారు. 50 ఏళ్లు పైబడిన వారి కోసం పంజాబ్‌ ప్రభుత్వం ఉచితంగా ‘ముఖ్యమంత్రి తీర్థ యాత్ర పథకం’ అమలు చేస్తోంది. ప్రమాద సమయంలో రెండు ఏసీ బస్సుల్లో కలిపి 37 మంది ఉన్నట్లు సమాచారం. 

ఇదీ చదవండి: పట్టెడన్నం దొరక్క.. ఆకలికి తట్టుకోలేక కుక్క కళేబరం పీక్కుతిన్నాడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement