బాలీవుడ్‌ హీరోకి షాక్‌ : అక్రమ నిర్మాణం కూల్చివేత | Actor Ajay Devgans Juhu Bungalow Over Illegal Construction Hammer Action | Sakshi
Sakshi News home page

బాలీవుడ్‌ హీరోకి షాక్‌ : అక్రమ నిర్మాణం కూల్చివేత

Oct 17 2026 1:24 PM | Updated on Oct 17 2026 1:29 PM

Actor Ajay Devgans Juhu Bungalow Over Illegal Construction Hammer Action

బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్‌గన్‌కు భారీ ఎదురు దెబ్బ తగిలింది. ముంబైలోని జుహులోని తన బంగ్లాలో మున్సిపల్ అనుమతి లేకుండా అనధికారిక నిర్మాణాలు చేపట్టారనే ఆరోపణలతో ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) ఆ భాగాలను కూల్చివేసింది.

జుహులోని కపోల్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలో ఉన్న 7,802 చదరపు అడుగుల బంగ్లాలో అంతర్గత మార్పులు, విభజన గోడల నిర్మాణం, కిటికీల మార్పులు వంటి పనులను మున్సిపల్ అనుమతులు లేకుండా చేపట్టారంటూ ఇప్పటికే  కొన్నినోటీసులు బీఎంసీ తాజా చర్యలు చేపట్టింది. ముంబై మున్సిపల్ కార్పొరేషన్ చట్టంలోని సెక్షన్ 354ఏ కింద సెప్టెంబర్ 10న బీఎంసీ నోటీసు జారీ చేసింది. పనులు తక్షణమే నిలిపివేయాలని, సరైన పత్రాలు సమర్పించాలని ఆదేశించింది. నోటీసులు లెక్కచేయకుండా నిర్మాణాలు కొనసాగించడంతో, బీఎంసీ అధికారులు రంగంలోకి దిగి ఆ అనధికార భాగాలను సుత్తులతో కూల్చివేశారు.

కాగా అజయ్ దేవగన్ క్రైమ్ థ్రిల్లర్ ఫ్రాంచైజీ 'దృశ్యం-3'  మూవీ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ. 400 కోట్ల క్లబ్‌లో చేరింది. అషేక్ పాఠక్ దర్శకత్వంలో అక్టోబర్ 2న విడుదలైన ఈ సినిమాకు మంచి ప్రేక్షకాదరణ లభించింది.

ఇదీ చదవండి: నమ్మించి ఏకంగా రూ. 9.6 కోట్లు కొట్టేసిన నర్స్‌. కట్‌ చేస్తే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement