'ది రాజా సాబ్' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది అందాల భామ రిద్ధి కుమార్. సినిమాలతోనే కాకుండా సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ, తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన కొన్ని ఫొటోలు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. తను ఎంతో ఇష్టపడి, లాంగ్ గ్యాప్ తర్వాత సొంతం చేసుకున్న ఒక కలర్‌ఫుల్ మ్యాక్సీ స్కర్ట్ వెనుక ఉన్న ఆసక్తికరమైన కథను ఆమె అభిమానులతో పంచుకుంది.


