పూర్వాజ్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘కిల్లర్’.
జ్యోతి పూర్వాజ్ హీరోయిన్‌గా, మనీష్ గిలాడా, చంద్రకాంత్ కొల్లు, అయినాబత్తిన దశరథ మాధవ్ ఇతర పాత్రల్లో నటించారు.
ఉర్వీశ్ పూర్వాజ్ సమర్పణలో ధ్యానం నాన్నగారు ఆశీస్సులతో పూర్వాజ్, పద్మనాభరెడ్డి .ఎ. నిర్మించిన ఈ సినిమా ఈ నెల 30న రిలీజ్ కానుంది.
ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కి హరీష్ శంకర్ అతిథిగా హాజరై, ట్రైలర్ విడుదల చేశారు.


