ఈ రాశి వారు భూములు కొనుగోలు చేస్తారు | Rasi Phalalu: Daily Horoscope On 27-10-2026 In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu: ఈ రాశి వారు భూములు కొనుగోలు చేస్తారు

Oct 27 2026 3:02 AM | Updated on Oct 27 2026 3:02 AM

Rasi Phalalu: Daily Horoscope On 27-10-2026 In Telugu

గ్రహం అనుగ్రహం: శ్రీపరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వయుజ మాసం, తిథి: బ.పాడ్యమి ఉ.8.19 వరకు, తదుపరి విదియ, నక్షత్రం: భరణి సా.6.10 వరకు, తదుపరి కృత్తిక, వర్జ్యం: తె.5.33 నుండి 7.04 వరకు (తెల్లవారితే బుధవారం), దుర్ముహూర్తం: ఉ.8.17 నుండి 9.03 వరకు, తదుపరి రా.10.29 నుండి 11.19 వరకు, అమృత ఘడియలు: ప.1.33 నుండి 3.03 వరకు

సూర్యోదయం : 6.00
సూర్యాస్తమయం : 5.29
రాహుకాలం : ప.3.00 నుండి 4.30 వరకు
యమగండం : ఉ.9.00 నుండి 10.30 వరకు 

మేషం.... నూతన వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ధనలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలలో శ్రమ ఫలిస్తుంది.

వృషభం..... బంధువుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు. ఇంటాబయటా నిరాశ. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆటంకాలు.

మిథునం..... పరిస్థితులు అనుకూలిస్తాయి. శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. మిత్రుల నుంచి విమర్శలు. ఆరోగ్యభంగం. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగొడిగా ఉంటాయి.

కర్కాటకం.... కొన్ని సమస్యలు తీరతాయి. ఆకస్మిక ధనలబ్ధి. ప్రముఖులతో పరిచయాలు. వస్తులాభాలు. భూములు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత రాణిస్తాయి.

సింహం..అనుకున్న పనుల్లో అవాంతరాలు. రుణయత్నాలు. దూరప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. బంధువులతో వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.

కన్య....సన్నిహితులతో విభేదాలు. అర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగస్తులకు పనిభారం.

తుల....పరిచయాలు పెరుగుతాయి. ఆత్మీయులతో సఖ్యత నెలకొంటుంది. ఆకస్మిక ధనలబ్ధి. పనులు చకచకా సాగుతాయి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో మరిన్ని బాధ్యతలు స్వీకరిస్తారు.

వృశ్చికం...కొత్త పనుల్లో విజయం. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. సమాజంలో గౌరవం పొందుతారు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటుంది.

ధనుస్సు...పనుల్లో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. నిర్ణయాలలో ఆటంకాలు. దైవదర్శనాలు. వ్యాపారాల విస్తరణ నిలిపివేస్తారు. ఉద్యోగాలలో ఆటుపోట్లు.

మకరం.....సన్నిహితులతో అకారణంగా వివాదాలు. ఆలోచనలు కలసిరావు. బాధ్యతలు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.

కుంభం....వ్యవహారాలు సకాలంలో పూర్తి. కుటుంబంలో చిక్కులు తొలగుతాయి. ఆరోగ్యం కాస్త కుదుటపడుతుంది. భూములు, ఆభరణాలు కొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం.

మీనం..ఎంత కష్టించినా ఫలితం ఉండదు. వ్యయప్రయాసలు. బంధువుల నుంచి ఒత్తిడులు. ఆర్థికపరమైన సమస్యలు. అనుకోని ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశాజనకంగా ఉంటాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement