విజయనగరం : పైడితల్లి సిరిమానోత్సవంలో భాగంగా సిరిమాను చెట్టు తరలింపు ప్రక్రియ సంబరంగా సాగింది.
విజయనగరం మండలం జొన్నవలసలో సిరిమాను, ఇరుసుమాను చెట్లకు భక్తులు ప్రత్యేక పూజలు చేశారు.
పసుపుకుంకుమలు సమర్పించారు. ముహూర్తం ప్రకారం సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు, ఆలయ అధికారులు, ప్రజాప్రతినిధులు సిరిమాను చెట్టు కొట్టేందుకు గొడ్డలితో గాట్లు పెట్టారు.
వడ్రంగులు రెండు చింత చెట్లను నరికి ఎడ్లబళ్లకు కట్టి తరలింపునకు ఏర్పా ట్లు చేశారు.
జొన్నవలసలో సాయంత్రం ఆరంభమైన సిరిమాను చెట్టు తరలింపు లో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు.


