విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.
ప్రస్తుత దసరా శరన్నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో ఆలయానికి భక్తుల తాకిడి భారీగా పెరిగింది.
ఉత్సవాల వేళ కనకదుర్గనగర్, క్యూలైన్లు మరియు ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయాయి.


