ప్రొద్దుటూరులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు, నేతలపై దాడి చేస్తున్న పోలీసులు.. ఓ యువకుడి కంటికైన తీవ్ర గాయం.. వైఎస్సార్ కడప జిల్లా ఇప్పట్లలో టీడీపీ మూకల దాడిలో గాయపడిన వైఎస్సార్‌సీపీ నేతతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేస్తున్న ఎంపీ అవినాష్ రెడ్డి
నామినేషన్లకు ముందు, ఆ తర్వాత టీడీపీ మూక యథేచ్ఛగా దాడులు.. చించివేతలు
చివరకు నామినేషన్ల పరిశీలనలోనూ అదే దౌర్జన్యం, అదే అన్యాయం
8 చోట్ల నామినేషన్లకే అవకాశం ఇవ్వకుండా దుర్మార్గం
మరో 11 చోట్ల సగం కంటే తక్కువగా అవకాశం.. ఏకపక్షంగా గెలుచుకునేలా కుట్ర
ఇప్పుడు నామినేషన్లు ఉపసంహరించుకోవాలంటూ దాడులు, విధ్వంసం
కుప్పంలో వైఎస్సార్‌సీపీ మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థి కిడ్నాప్
ఎమ్మెల్సీ భరత్ ఇంటిపై దాడి.. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు తీవ్ర గాయాలు
ప్రొద్దుటూరులో చైర్మన్ అభ్యర్థి నామినేషన్ పత్రాలు చింపివేత
మహిళ చీర కొంగు లాగేసి నామినేషన్ పత్రాలు లాక్కున్న టీడీపీ గూండాలు
స్రూ్కటినీకి వెళ్తున్న అభ్యర్థులపై పోలీసుల లాఠీచార్జి.. పలువురికి గాయాలు
ఉమ్మడి కర్నూలు జిల్లాలో యథేచ్ఛగా రౌడీయిజం
డోన్‌లో కోట్ల సుజాతమ్మ, నంద్యాలలో ఎంపీ బైరెడ్డి శబరి హల్‌చల్
ఆళ్లగడ్డలో ఏకపక్షంగా నామినేషన్ల పరిశీలన
రాజంపేటలో తొలుత నామినేషన్ ఆమోదం.. ఆ తర్వాత తిరస్కరణ
చిత్తూరులో 30 మంది అభ్యర్థులకు ఫారం7 ఇవ్వని వైనం
నగరిలో వైఎస్సార్‌సీపీ చైర్మన్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణ
అడుగడుగునా అధికార దుర్వీనియోగం.. ప్రజాస్వామ్యంలో దుర్దినం
సాక్షి, నెటవర్క్: రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అన్నది మచ్చుకైనా కనిపించడం లేదు. నామినేషన్లకు ముందు, ఆ తర్వాత యథేచ్ఛగా దాడులు.. దౌర్జన్యాలు, బెదిరింపులు కొనసాగుతూనే ఉన్నాయి. ఎక్కడికక్కడ టీడీపీ రౌడీ మూకలు నామినేషన్ పత్రాలను చింపివేస్తున్నారు. చివరకు నామినేషన్ల పరిశీలనలోనూ అదే దౌర్జన్యం, అదే అన్యాయం పునరావృతమైంది. 8 మునిసిపాల్టీల్లో నామినేషన్లకే అవకాశమివ్వకుండా దుర్మార్గంగా వ్యవహరించారు. మరో 11 చోట్ల వారే ఏకపక్షంగా నెగ్గేలా కుట్రలు, కుతంత్రాలకు తెరతీశారు. నామినేషన్లు ఉపసంహరించుకోవాలంటూ ఒత్తిళ్లు తెస్తున్నారు.
లేదంటే ఇళ్లపై దాడులు, వాహనాల ధ్వంసంతో పేట్రేగిపోతున్నారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను లక్ష్యంగా చేసుకుని ఎల్లో గూండాలు దాడులకు దిగారు. కడప, అనంతపురం,కుప్పం, మదనపల్లె, నంద్యాల, ఆళ్లగడ్డ, ప్రొద్దుటూరు తదితర ప్రాంతాల్లో పచ్చ మూకలు అడ్డు అదుపులేకుండా రెచ్చిపోయాయి. అధికారపక్షానికి చెందిన నేతల నామినేషన్లు ఓకే చేయించుకోవడం, ప్రతిపక్ష నేతల నామినేషన్లు తొలగించేలా చేయడంలో ఎన్నికల అధికారులపై పచ్చ నేతలు సామ, దాన,భేద, దండోపాయాలను ప్రయోగించారు.
రాష్ట్ర వ్యాప్తంగా నామినేషన్ల పరిశీలనలో పచ్చ మూక పట్టు సాధించేందుకు చేయని ప్రయత్నాలు అంటూ లేవు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల నామినేషన్ పరిశీలన పత్రాలను లాక్కొని చించివేయడం, అభ్యర్థులపై దాడులకు దిగడం, కిడ్నాప్ ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపాయి.
బాబూ.. ఇది మంచి ప్రభుత్వమా?
చంద్రబాబు ఆడంబరంగా ప్రకటనలు ఇచ్చుకుంటున్నట్లు ఇది నిజంగా మంచి ప్రభుత్వమే అయితే నామినేషన్లను ఎందుకు అడ్డుకున్నారు?ఎందుకు ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులపై మూకుమ్మడి దాడులు చేస్తున్నారు? మహిళలని కూడా చూడకుండా ఎందుకు దాడులకు దిగుతున్నారు? ఎందుకంటే పోటీలో ఉండి గెలుచుకునే దమ్ము, ధైర్యం లేకే ఈ అరాచకానికి పాల్పడుతున్నారని ఇట్టే స్పష్టమవుతోంది. ఎన్నికలప్పుడు ఇచ్చిన మేనిఫెస్టోలోని సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ సహా ఒక్క హామీ నెరవేర్చలేకే కుట్రలు, దౌర్జన్యాలు, అక్రమాలకు దిగారని తెలుస్తోంది.
చంద్రబాబు పాలనపై అన్ని వర్గాల్లోనూ తీవ్ర అసంతృప్తి రగులుతోంది.విద్య, వైద్యం, వ్యవసాయం.. ఇలా అన్ని రంగాలూ నిర్వీర్యయ్యాయి. వీటన్నింటిపై ప్రజలకు సమాధానం చెప్పుకోలేక దౌర్జన్యాలు, ప్రజాస్వామ్య హననానికి దిగారని స్పష్టమవుతోంది. వాస్తవానికి మేనిఫెస్టోలో 99 శాతం హామీలు నెరవేర్చిన ఘనత గత వైఎస్ జగన్‌కే దక్కుతుంది. అందుకే అప్పట్లో బాబు నియమించిన ఎస్‌ఈసీ నిమ్మగడ్డ ప్రసాద్ ఆధ్వర్యంలోనే స్థానిక ఎన్నికలు జరిపించారు.
ఆయన ఇష్టానుసారం అధికారుల బదిలీలు చేసినా వెరవలేదు. అయినా 100 శాతం కార్పొరేషన్లలో, 98 శాతం మున్సిపాలిటీల్లో వైఎస్సార్‌సీపీ విజయం సాధించింది. వైఎస్ జగన్ పారదర్శకంగా వ్యవహరించడం వల్లే తాడిపత్రిలో టీడీపీ విజయం సాధించిందని.. అప్పట్లో ‘హ్యాట్సాప్ టు జగన్..’ అని మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి వ్యాఖ్యానించడం గమనార్హం.
ఇప్పుడు చంద్రబాబు సర్కారు చేస్తున్నదేంటి?
ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల్లో నిజాయితీగా, ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరిపిస్తే కుప్పం సహా అన్ని చోట్లా ఓటమి తప్పదని చంద్రబాబు అండ్‌కో భయం. అందుకే అంతటా దౌర్జన్యం. ఇందుకోసం పోలీసులను అడ్డుపెట్టుకుని.. వైఎస్సార్‌సీపీ నేతలపై, అభ్యర్థులపై దౌర్జన్యాలు, దాడులకు దిగారు. రాష్ట్రంలో ఎంతటి దారుణమైన అప్రజాస్వామ్య పరిస్థితి ఉందంటే.. దాదాపు 8 మున్సిపాలిటీల్లో అసలు నామినేషన్లే పడని పరిస్థితి కల్పించారు.
కౌన్సిలర్‌గా గానీ, చైర్మన్‌గా గానీ జీరో నామినేషన్లు నమోదు కాగా, మరో 11 చోట్ల సగం కంటే తక్కువగా (36 శాతం) నామినేషన్లకు అవకాశం ఇచ్చి, ఏకపక్షంగా విజయం సాధించేలా కుతంత్రాలు రచించారు. పలు చోట్ల వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు నామినేషన్లు వేసి అక్నాలెడ్జ్‌మెంట్ స్లిప్పులు తీసుకున్నప్పటికీ, అధికారుల ఎదుటే వారి నామినేషన్ పత్రాలను చింపేశారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికల్లో పోటీ చేయడానికి నామినేషన్లు కూడా వేసే పరిస్థితి లేదంటే పాలన ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
కుప్పంలో టీడీపీ గూండాగిరి
చిత్తూరు జిల్లా కుప్పంలో వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్ అభ్యర్థులు సోమవారం నామినేషన్ల పరిశీలన కార్యక్రమానికి వెళ్తుండగా, టీడీపీ శ్రేణులు అడ్డుపడి చైర్మన్ అభ్యర్థి విజయ్‌కుమార్‌ను కిడ్నాప్ చేసి, వైఎస్సార్‌సీపీ నాయకులపై దాడులకు పాల్పడ్డారు. ఎమ్మెల్సీ భరత్ నివాసాన్ని ముట్టడించి లోపలికి వెళ్లేందుకు యత్నించారు. అడ్డొచ్చిన వైఎస్సార్‌సీపీ శ్రేణులను చితకబాదుతూ వారి చేతుల్లో ఉన్న సర్టిఫికెట్లను చింపివేసి తరిమి కొట్టారు.
ఈ దాడుల్లో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు జయశంకర్, జితిన్, హఫీజ్,జాఫర్‌తో పాటు మరోపది మంది గాయపడ్డారు. చైర్మన్ అభ్యర్థి విజయ్‌కుమార్ కిడ్నాప్ ఉదంతంపై మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జిల్లా ఎస్పీ తుషార్డూడితో ఫోన్లో మాట్లాడారు. వైఎస్సార్‌సీపీ నేతల ఆగ్రహంతో ఎట్టకేలకు ఆయన్ను వదిలేశారు. కాగా, వైఎస్సార్‌సీపీ శ్రేణులపై జరుగుతున్న దాడిని చిత్రీకరించేందుకు యత్నించిన కుప్పం సాక్షి విలేకరి వెంకటాచలం ఫోన్‌ను లాక్కుని ధ్వంసం చేశారు.
గుమ్మనూరు ఆదేశంతో నామినేషన్ తిరస్కరణ
అనంతపురం జిల్లా గుత్తి మునిసిపల్ చైర్మన్ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మాతంగి అంజల నామినేషన్ తిరస్కరణకు గురైంది. కుల ధ్రువీకరణ పత్రం సరిగా లేదన్న నెపంతో అధికారులు ఆమె నామినేషన్‌ను తిరస్కరించారు. అయితే..గుంతకల్లు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు సూచన మేరకే అధికారులు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి నామినేషన్‌ను తిరస్కరించారని చెబుతున్నారు.
కొప్పుల నామినేషన్ తిరస్కరణ
పల్నాడు జిల్లా దాచేపల్లి నగర పంచాయతీ వైఎస్సార్‌సీపీ చైర్మన్ అభ్యర్థి రవికుమార్ నామినేషన్‌ను అధికారులు తిరస్కరించారు. డిపాజిట్ చెల్లించని కారణంగా తిరస్కరించినట్లు రిటర్నింగ్ అధికారులు ప్రకటించారు.రవికుమార్ డిపాజిట్ చెల్లించారు. ఆ మేరకు రిసీప్ట్ కూడా చూపారు. రవికుమార్ సమర్పించిన అన్ని పత్రాలను అధికారులు పరిశీలించారు. అయినప్పటికీ డిపాజిట్ చెల్లించినట్లు ఆధారాలు లేవని ఆయన నామినేషన్‌ను తిరస్కరించారు. మార్కాపురం జిల్లా గిద్దలూరులోని మున్సిపల్ కార్యాలయంలో బీజేపీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి నారాయణ నామినేషన్ పత్రాలను టీడీపీ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి బావమరిది సురేష్‌రెడ్డి, మరి కొందరు టీడీపీ నేతలు కలిసి చించిపడేశారు.

ప్రొద్దుటూరులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు, నేతలపై దాడి చేస్తున్న పోలీసులు.. ఓ యువకుడి కంటికైన తీవ్ర గాయం.. వైఎస్సార్ కడప జిల్లా ఇప్పట్లలో టీడీపీ మూకల దాడిలో గాయపడిన వైఎస్సార్‌సీపీ నేతతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేస్తున్న ఎంపీ అవినాష్ రెడ్డి
మదనపల్లెలో ఎన్నికల అధికారిపై దాడి
అన్నమయ్య జిల్లా మదనపల్లె దొంతి వీధిలోని నామినేషన్ సెంటర్లో ఎన్నికల విధులు నిర్వహిస్తున్న అదనపు ఎన్నికల అధికారి బుర్రయ్యపై టీడీపీ మూకలు దాడి చేశాయి. ఎన్నికల కేంద్రం వద్ద నామినేషన్ల పరిశీలన జరుగుతున్న సమయంలో స్థానిక పదో వార్డుకు, టీడీపీ తరఫున కౌన్సిలర్‌గా నామినేషన్ వేసిన అభ్యర్థి సహదేవ నాయుడు వచ్చాడు. అతని వెంట రాజేష్ మరికొందరు నామినేషన్ సెంటర్‌లోకి ప్రవేశించారు. ఎన్నికల అసిస్టెంట్ అధికారి బుర్రయ్యతో వాగ్వాదానికి దిగి, ప్రత్యర్థి వర్గ అభ్యర్థి సుధాకర్ రెడ్డి నామినేషన్ తిరస్కరించాలని పట్టుబట్టారు. దీంతో ఇద్దరి మధ్య వాగి్వవాదం జరగ్గా.. వారు ఎన్నికల అధికారిపై దాడికి పాల్పడ్డారు. ఆయన చొక్కా చింపి వేశారు.
ఒంగోలులో పోలీసుల బెదిరింపులు
ఒంగోలులో అధికార టీడీపీ బెదిరింపుల పర్వానికి తెరదీసింది. ఇందులో భాగంగా వివిధ డివిజన్ల నుంచి పోటీ చేస్తున్న వైఎస్సార్ సీపీ అభ్యర్థుల ఇళ్లకు పోలీసులను పంపించి కుటుంబ సభ్యుల మీద ఒత్తిడి తెస్తున్నారు. 9వ డివిజన్ నుంచి పోటీ చేస్తున్న చర్చిల్ గిఫ్ట్ అనే అభ్యరి్థని విత్‌డ్రా చేసుకోవాల్సిందిగా టీడీపీ నాయకులు ఒత్తిడి తెచ్చారు. అందుకు అతడు అంగీకరించకపోవడంతో పోలీసులను రంగంలోకి దించారు. ఈ క్రమంలోనే సోమవారం ఒక సీఐ, కొందరు పోలీసులతో కలిసి చర్చిల్ గిఫ్ట్ ఇంటికి వెళ్లి అతడి తల్లి తేళ్ల సుజన్ కుమారిని బెదిరించారు. ఈ మేరకు చర్చిల్ తల్లి రోదిస్తూ మీడియాతో మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇదే రీతిలో ఐదుగురు అభ్యర్థులను బెదిరించారు.
కనిగిరిలో పచ్చమూకలతో కలిసి పోలీసుల హల్‌చల్
మార్కాపురం జిల్లా కనిగిరిలో పోలీసుల అండతో పచ్చగూండాలు రెచ్చిపోయారు. సుమారు 500 మంది పచ్చ మూకలు రంగంలోకి దిగి నామినేషన్ కేంద్రం బయట, లోపల భయభ్రాంతులకు గురి చేశారు. ఆదివారం 8 నామినేషన్ పత్రాలను చించేసిన పచ్చమూక.. నామినేషన్‌ల పరిశీలనకు కూడా అభ్యర్థులను కేంద్రంలోని పోనీయకుండా అడ్డుకున్నారు. పోలీసులు చేతులెత్తేయడాన్ని ప్రశ్నించిన వైఎస్సార్‌సీపీ నేతలు, అభ్యర్థులపై పోలీసులు ఎదురుదాడికి దిగారు. మీడియా ప్రతినిధులపై కూడా టీడీపీ మూకలు దాడికి దిగాయి.
పోలీసుల తీరుపై కనిగిరి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జి డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి పులి శాంతి రెడ్డి, పార్టీ నేతలు నామినేషన్ కేంద్రం బయట బైఠాయించారు. చేతిలోని కాగితాలను లాక్కుని చించేస్తున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించడం ఏమిటని నిలదీశారు. సీఐ సుబ్రహ్మణ్యం, ఎస్సై సందీప్‌ల ఏకపక్ష వైఖరిని తీవ్రంగా దుయ్యబట్టారు. చైర్మన్ అభ్యర్థి పులి శాంతిరెడ్డి, సిరుప వెంకట గోవర్ధన్‌రెడ్డిలు చేతులెత్తి దండం పెట్టి కన్నీటి పర్యంతమై వెనుదిరిగారు. తుదకు కనిగిరి మున్సిపల్ చైర్‌పర్సన్ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పులిశాంతిరెడ్డి నామినేషన్‌ను అధికారులు తిరస్కరించారు.
ప్రొద్దుటూరులో ప్రజాస్వామ్యం ఖూనీ
సోమవారం నామినేషన్ల పరిశీలన ఉండటంతో 36 మంది వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు, పార్టీ నేతలు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డితో కలిసి ప్రొద్దుటూరులోని మున్సిపల్ కార్యాలయానికి వెళ్లారు. ముందుగా చైర్మన్ అభ్యర్థి పోరెడ్డి నరసింహారెడ్డి, మహిళా కౌన్సిలర్ అభ్యర్థులు రాచమల్లు రమాదేవి, లావణ్య తదితరులు తగు పత్రాలు అధికారులకు చూపుతుండగా.. ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి అనుచరులు పత్రాలను లాక్కొని చించేశారు. పత్రాలు ఇవ్వడానికి నిరాకరించిన పోరెడ్డి నరసింహారెడ్డిపై దాడికి పాల్పడ్డారు. వైఎస్సార్‌సీపీకి చెందిన దళిత మహిళా కౌన్సిలర్ అభ్యర్థి లావణ్య మున్సిపల్ కార్యాలయం నుంచి రోదిస్తూ బయటికి వచ్చారు.
తన వద్ద నామినేషన్ పత్రాలను చీర కొంగులో పెట్టుకోగా టీడీపీ గూండాలు బలవంతంగా చేతులు పెట్టి లాక్కున్నారని రోదించారు. తమ వారిపై దాడి చేసి పత్రాలను లాక్కున్న టీడీపీ గూండాలపై చర్యలు తీసుకోవాలని రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి పోలీసు అధికారులను నిలదీశారు. పోలీసుల సాయంతో తమ కౌన్సిలర్ అభ్యర్థులను కార్యాలయంలోకి తీసుకెళ్తామని ఇక్కడికి తీసుకొచి్చ, టీడీపీ మూకలతో దాడులు చేయిస్తారా అంటూ రాచమల్లు పోలీసులపై ధ్వజమెత్తారు. ఈ క్రమంలో డీఎస్పీ బాలస్వామిరెడ్డితో పాటు సీఐలు, ఎస్‌ఐలు వైఎస్సార్‌సీపీ శ్రేణులపై విచక్షణా రహితంగా లాఠీలతో విరుచుకు పడ్డారు. ఈ ఘటనలో పార్టీ కార్యకర్త రాజశేఖర్‌కు కన్ను వద్ద తీవ్ర గాయమవడంతో హుటాహుటినా హైదరాబాద్‌కు తీసుకెళ్లారు.
లాఠీ చార్జి చేస్తున్న పోలీసులకు చైర్మన్ అభ్యర్థి పోరెడ్డి నరసింహారెడ్డి రెండు చేతులెత్తి దండం పెట్టారు. పదవి కోసం ఇంతగా హింసించడం ఎందుకు.. నన్ను కాల్చేయండి అంటూ కంట తడి పెట్టారు. పోలీసుల తీరును నిరసిస్తూ చొక్కా విప్పి నడుచుకుంటూ వెళ్లిపోయారు. కాగా, ప్రొద్దుటూరులోని వైఎంఆర్ కాలనీలోని పోరెడ్డి నరసింహారెడ్డి ఇంటిపై ఆదివారం అర్ధరాత్రి మొహానికి ముసుగు వేసుకుని వచి్చన వ్యక్తులు రాళ్లతో దాడి చేయగా రెండు కార్ల అద్దాలు పగిలాయి. సోమవారం నామినేషన్ల పరిశీలన సందర్భంగా ఆ దృశ్యాలు చిత్రీకరిస్తున్న మీడియా ప్రతినిధుల సెల్‌ఫోన్లను టీడీపీ నేతలు లాక్కున్నారు. తుదకు వైఎస్సార్‌సీపీ చైర్మన్ అభ్యర్థి పోరెడ్డి నరసింహారెడ్డిని పోటీ నుంచి తప్పించారు. టీడీపీ అభ్యర్థి నంద్యాల రాఘవరెడ్డి నామినేషన్ చెల్లుబాటు అవుతుందని అధికారులు ప్రకటించారు.
చిత్తూరు జిల్లాలో ‘పచ్చ’రాజ్యం
చిత్తూరులోని సత్యనారాయణపురం నామినేషన్ కేంద్రం వద్ద టీడీపీ అభ్యర్థి లక్ష్మి నామినేషన్‌ను ఆర్‌వో తిరస్కరించడాన్ని జీర్ణించుకోలేని పచ్చ మూకలు అక్కడున్న వైఎస్సార్‌సీపీ మైనారిటీ నాయకుడు సయ్యద్‌బాషాను చితక్కొట్టారు. చిత్తూరు కొంగారెడ్డిపల్లెలో ఉన్న వైఎస్సార్‌సీపీ జిల్లా పార్టీ కార్యాలయంపైకి రాళ్లు రువ్వారు. ఇక్కడే ఉన్న నామినేషన్ కేంద్రంలోకి చొరబడ్డ టీడీపీ నేతలు, వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్ పత్రాలతో పాటు ఇతర పత్రాలు తీసుకెళ్లిపోయారు. నామినేషన్ ఆమోదించినట్లు ఆర్‌వోలు ఇవ్వాల్సిన ఫారం–7ను చిత్తూరులో 30 మంది వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు ఇవ్వలేదు. నగరిలో వైఎస్సార్‌సీపీ చైర్మన్ అభ్యర్థి బాలకృష్ణన్ పదిసెట్ల నామినేషన్ దాఖలు చేస్తే ఆర్‌వో అన్నింటినీ ఏకపక్షంగా తిరస్కరించారు. పలమనేరు మున్సిపాలిటీలో టీడీపీ నేతలు హల్‌చల్ చేశారు. తన భార్య నామినేషన్‌ను తిరస్కరించడంతో వైఎస్సార్‌సీపీ మైనారిటీ నాయకుడు రహీంఖాన్ అక్కడే సొమ్మసిల్లి పడిపోయారు.
లోకేశ్ ఫోన్‌తో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల నామినేషన్ల తిరస్కరణ
మంత్రి నారా లోకేశ్ ఫోన్ చేయడంతో చిత్తూరు జిల్లా నగరిలో వైఎస్సార్‌సీపీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరించారు. చైర్మన్ అభ్యర్థి ఇ.వి.బాలకృష్ణ వేసిన 2 నామినేషన్లతో పాటు రమేష్‌రెడ్డి, వెంకటరత్నం నామినేషన్లను సైతం ఎన్నికల అధికారులు తొలుత ఆమోదించారు. ఇందుకు సంబంధించిన రసీదులను సాయంత్రం వచ్చి తీసుకోవాలని తెలిపారు.
సాయంత్రం వెళ్లిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల్లో వెంకటరత్నంకు నామినేషన్ పేపర్ 2, నామినేషన్ పేపర్ 5కు చెందిన రెండు రశీదులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో మంత్రి లోకేశ్ నుంచి మున్సిపల్ కార్యాలయానికి ఫోన్ రావడంతో కమిషనర్, ఆర్వోలు తలుపులు వేసుకుని మాట్లాడుకున్నారు. ఆపై బయటకు వచ్చిన అధికారులు నోటీసు బోర్డులో ఒక్క టీడీపీ అభ్యర్థి పేరునే ప్రకటించారు. దీంతో టీడీపీ అభ్యర్థి ఏకగ్రీవం అయినట్లు ఆ పార్టీ నేతలు సంబరాలు చేసుకున్నారు. దీనిపై మాజీ మంత్రి రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు.
నెల్లూరులో అధికార దుర్వీనియోగం
నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 72 డివిజన్లు ఉండగా 11 డివిజన్ల వైఎస్సార్‌సీపీ మెయిన్ అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరించారు. 63వ డివిజన్ వైఎస్సార్‌సీపీ అభ్యరి్థపై కేసులున్నాయంటూ అధికారులు తిరస్కరించారు. ఇతనిపై ఎలాంటి కేసులు లేకపోయినప్పటికీ అధికార పార్టీ నేతల ప్రోత్భలంతోనే పోలీసులు అక్రమ కేసులు బనాయించినట్లు తెలుస్తోంది. 10వ డివిజన్‌లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పేరు ఓటరు లిస్ట్‌లో లేదంటూ నామినేషన్‌ను తిరస్కరించారు. 68వ డివిజన్‌లో పోటీ చేసే వైఎస్సార్‌సీపీ అభ్యర్థి గతంలో పొదుపు లీడర్‌గా ఉన్నారు.
ఆమె ప్రస్తుతం లీడర్‌గా లేదని సర్టీఫికెట్ సమర్పించలేదన్న కారణంతో నామినేషన్‌ను తిరస్కరించారు. 36, 38, 39, 40, 41, 44, 46 వార్డుల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల నామినేషన్లలో కొట్టివేతలు ఉన్నాయని, సరైన పత్రాలు సమర్పించలేదన్న కారణాలతో అధికారులు వాటిని తిరస్కరించారు. ఆత్మకూరు మున్సిపాలిటీలో వార్డు కౌన్సిలర్లకు 148 నామినేషన్లు దాఖలు కాగా, అందులో 4 నామినేషన్లు తిరస్కరించారు. చైర్‌పర్సన్ స్థానానికి 10 నామినేషన్లు ఆమోదమయ్యాయి. కౌన్సిలర్ల నామినేషన్లలో వైఎస్సార్‌సీపీ నామినేషన్లు రెండు తిరస్కరించారు. బుచ్చిరెడ్డిపాళెం మున్సిపాలిటీలో కౌన్సిలర్ల స్థానాలకు 4 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి.
ఉమ్మడి కర్నూలు జిల్లాలో అరాచకం
నంద్యాల జిల్లా ఆత్మకూరులో నామినేషన్ల పరిశీలన సందర్భంగా వైఎస్సార్‌సీపీ మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థి డాక్టర్ ప్రియాంకబాయి కుల ధృవీకరణ పత్రాన్ని పచ్చ నేతలు అధికారుల సమక్షంలోనే చింపి వేశారు. మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి ఆయన తనయుడు శిల్పా కార్తీక్‌రెడ్డిలు నామినేషన్ల పరిశీలన కేంద్రం వద్దకు వస్తుండగా డీఎస్పీ రామాంజనేయ నాయక్ అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. డాక్టర్ ప్రియాంక అభ్యర్థిత్వాన్ని ఆమోదించకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని శిల్పా చక్రపాణిరెడ్డి అధికారులకు తేల్చి చెప్పారు.
ప్రియాంకబాయి కుల ధృవీకరణ పత్రం మళ్లీ అందజేయడంతో ఆమె నామినేషన్‌ను ఆమోదించారు. ఆళ్లగడ్డలో వైఎస్సార్‌సీపీకి చెందిన ఏడుగురు వార్డు అభ్యర్థులను నామినేషన్ల పరిశీలనకు రాకుండా అడ్డుకున్నారు. ఆదివారం రాత్రి కిడ్నాప్ చేసిన వారిని సోమవారం వదిలి పెట్టారు. డోన్‌లో టీడీపీ మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థి కోట్ల సుజాతమ్మ హల్‌చల్ చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆమె నామినేషన్ల కార్యాలయంలో తిష్టవేసి వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను రానివ్వకుండా అడ్డుకున్నారు.
వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పోస్టు ప్రసాద్ నామినేషన్‌ను తిరస్కరించాలని అధికారులపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చారు. నంద్యాలలో పార్టీ నేత శీను, సీనియర్ న్యాయవాది ఫణీంద్రనాథ్, 38వ వార్డులో వైఎస్సార్‌సీపీ నేత చంద్రశేఖర్‌లపై పచ్చమూకలు దాడికి తెగబడ్డాయి. టీడీపీ ఎంపీ శబరి, ఆ పార్టీ నేత ఏవీ సుబ్బారెడ్డిలు వైఎస్సార్‌సీపీ నేతలపై దౌర్జన్యానికి దిగారు. మాజీ ఎమ్మెల్యే శిల్పారవిచంద్రకిశోర్‌రెడ్డి మున్సిపల్ కార్యాలయం వద్దకు వచ్చి ఆందోళనకు దిగారు. కాగా, పోలీసులు వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు వాట్సాప్ కాల్ చేసి బెదిరింపులకు దిగారు. నామినేషన్ ఉపసంహరించుకోవాలని, కేసుల్లో ఇరుక్కోవద్దంటూ హెచ్చరిస్తున్నారు.


