‘స్థానిక’ నామినేషన్ల గడువు పొడిగించండి | YSRCP Moves SC Alleging Violence Prevented Its Candidates From Filing Nominations For AP Municipal Polls | Sakshi
Sakshi News home page

‘స్థానిక’ నామినేషన్ల గడువు పొడిగించండి

Oct 20 2026 4:02 AM | Updated on Oct 20 2026 4:02 AM

YSRCP Moves SC Alleging Violence Prevented Its Candidates From Filing Nominations For AP Municipal Polls

సుప్రీంకోర్టును అభ్యర్థించిన వైఎస్సార్‌సీపీ

హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ పిటిషన్‌ 

నామినేషన్ల సమయం ముగిసిందన్న ధర్మాసనం తీర్పు సరికాదు 

ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగితే న్యాయస్థానాలు జోక్యం చేసుకోవచ్చు 

ఎన్నికల ప్రక్రియకు ఆటంకం కలిగితే ఎస్‌ఈసీ షెడ్యూల్‌ మార్చవచ్చు 

ఇందుకు ఎన్నికల నిబంధనలు వీలు కల్పిస్తున్నాయి 

అత్యున్నత న్యాయస్థానానికి పార్టీ నివేదన 

సుప్రీంకోర్టు ముందు ఆధారాలతో కూటమి పార్టీల అరాచకాలు  

పుంగనూరు, కడప, తిరుపతి ఘటనలపై సాక్ష్యాల సమర్పణ

అత్యున్నత న్యాయస్థానం ముందు 9 మంది అభ్యర్థుల అఫిడవిట్లు 

నామినేషన్లు వేయలేకపోయినవారి పత్రాలను స్వీకరించేలా ఆదేశాలివ్వాలని అభ్యర్థన

ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఏకగ్రీవాలపై స్టే ఇవ్వాలని విజ్ఞప్తి

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న పట్టణ స్థానిక సంస్థల (మున్సిపల్‌) ఎన్నికల్లో అధికార కూ­టమి పాల్పడిన అరాచకాలపై వైఎస్సార్‌సీపీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. నగరపాలక, పురపాలక సంస్థల నామినేషన్ల గడువు పొడిగించాలని కోరింది. నామినేషన్ల గడువును మరో రోజు పొడిగించేందుకు నిరాకరిస్తూ  ఈ నెల 18న హైకోర్టు ఇచ్చిన తీర్పును ఈ పిటిషన్‌లో సవాలు చేసింది. నామినేషన్ల గడువు ఇప్పటికే ముగిసిపోయిందని, ఈ దశలో గడువును పొడిగించడం ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోవడమే అవుతుందని హైకోర్టు పేర్కొనడం సరికాదని వివరించింది. 

ఎన్నికల నిబంధనల్లోని రూల్‌ 7 ప్రకారం.. ఎన్నికల ప్రక్రియకు అంతరాయం కలిగినప్పు­డు ఎస్‌ఈసీ ఎన్నికల షెడ్యూల్‌ను మార్చి తిరిగి నో­టి­ఫై చేసే అధికారం ఉందని, ప్రజాస్వామ్య ప్రక్రియ­కు విఘాతం కలిగినప్పుడు రాజ్యాంగబద్ధమైన న్యా­యస్థానాలు జోక్యం చేసుకోవచ్చని పిటిషన్‌లో వైఎస్సార్‌సీపీ పేర్కొంది. వైఎస్సార్‌సీపీ  అభ్యర్థులు నా­మినేషన్లు వేయకుండా పెద్దఎత్తున జరిగిన దాడు­లు, అడ్డగింపులపై ఆధారాలను సుప్రీంకోర్టు ముందుంచింది. అభ్యర్థులను అడ్డుకున్న సదరు పట్టణ స్థానిక సంస్థల్లో  ఏ ఒక్క అభ్యర్థినీ ఏకగ్రీవంగా ఎన్ని­కైనట్లు ప్రకటించే ప్రక్రియను తదుపరి ఉత్తర్వు­లు ఇచ్చే వరకు నిలిపివేస్తూ స్టే విధించాలని అభ్యర్థించింది. 

అభ్యర్థులకు తగిన పోలీసు రక్షణ కల్పించడంతో పాటు అక్టోబర్‌ 18తో ముగిసిన నామినేషన్ల గడువును పొడిగించాలని అత్యున్నత న్యాయస్థానాన్ని కోరింది. అభ్యర్థులు సురక్షితంగా నామినే­ష­న్లు దాఖ­లు చేసేందుకు వీలుగా అదనపు, ప్రత్యా­మ్నాయ కేంద్రాలను ఏర్పాటు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్‌లో విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి తరఫున ఈ స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ (ఎస్‌ఎల్‌పీ)ను న్యాయవాది మహ్ఫూజ్‌ అహ్సన్‌ నజ్కీ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, ఇతరులను ప్రతివాదులుగా పేర్కొన్నారు.

రేపు విచారణ  
వైఎస్సార్‌సీపీ దాఖలు చేసిన పిటిషన్‌పై అక్టోబర్‌ 21న (బుధవారం) సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. విచారణ జాబితాలో మొదటి స్థా­నంలో ఉన్న ఈ వ్యాజ్యాన్ని  న్యాయమూర్తులు జస్టిస్‌ జాయ్‌మాల్యా బాగ్చీ, జస్టిస్‌ వి.మోహనలతో కూడిన వెకేషన్‌ బెంచ్‌ విచారించనుంది.

పిటిషన్‌లో ముఖ్యాంశాలు
తొలి రోజు నుంచే దాడులు 
అక్టోబర్‌ 16న నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన తొలి రోజు నుంచే పాలక పార్టీ అరాచకాలు, దాడులు ప్రారంభమయ్యాయి. ప్రతిపక్ష అభ్యర్థులు రిటర్నింగ్‌ అధికారుల వద్దకు చేరుకోకుండా ఉద్దేశపూర్వకంగా అడ్డుకున్నారు. పుంగనూరు, రాయచోటిలో అభ్యర్థులతో పాటు వెళ్లిన పార్టీ లోక్‌సభాపక్ష నాయకుడు ఎంపీ పి.వి.మిథున్‌ రెడ్డి కాన్వాయ్‌పై రాళ్ల దాడి జరిగింది. కడపలో 3వ డివిజన్‌ అభ్యర్థిని దారిలోనే అడ్డుకుని నామినేషన్‌ పత్రాలను లాక్కొని చించివేశారు. 

తిరుపతి మున్సిపల్‌ కార్పొరేషన్‌లో ఏకంగా 9 మంది వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను (వార్డు నెంబర్లు 1, 4, 9, 10, 13, 19, 55, 59, 65) నామినేషన్‌ కేంద్రాల గదిలోకి వెళ్లకుండా భౌతికంగా అడ్డుకున్నారు. ఈ ఘటనలకు సంబంధించి బాధిత అభ్యర్థులు (ఎన్‌. కుప్పయ్య, పి.సాయి ప్రసన్న కుమార్, ఈ. అనిల్‌ కుమార్‌ రెడ్డి తదితరులు) స్వయంగా ధ్రువీకరిస్తూ ఇచ్చిన అఫిడవిట్లను సుప్రీంకోర్టుకు సాక్ష్యాలుగా సమరి్పంచారు. తాడిపత్రిలో ప్రతిపక్ష అభ్యర్థులను నామినేషన్లు వేయనివ్వబోనని మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌ రెడ్డి బహిరంగ బెదిరింపులకు పాల్పడిన విషయాన్ని కూడా న్యాయస్థానం దృష్టికి తీసుకుని వస్తున్నాం.    

ఎస్‌ఈసీకి ముందే చెప్పినా చర్యల్లేవు 
ఎన్నికల నోటిఫికేషన్‌ రాకముందు నుంచే సెపె్టంబర్‌ 4, అక్టోబర్‌ 9, అక్టోబర్‌ 16 తేదీల్లో ఎస్‌ఈసీకి వైఎస్సార్‌సీపీ పలుమార్లు వినతులు సమరి్పంచింది. కేంద్ర బలగాలను మోహరించాలని, జిల్లా కలెక్టరేట్లలో ప్రత్యామ్నాయ నామినేషన్‌ కేంద్రాలు ఏర్పాటు చేయాలని, సీసీ కెమెరాల నిఘా ఉంచాలని కోరింది. అయితే  అవాంఛనీయ ఘటనలు జరిగిన తర్వాత కూడా అధికారుల నుంచి ఆశించిన స్థాయిలో చర్యలు లేవు.

సుప్రీంకోర్టుకు అభ్యర్థనలు 
⇒ అక్టోబర్‌ 18న ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ దాఖలు చేసిన అప్పీల్‌ను స్వీకరించాలి.  
⇒ అభ్యర్థులను అడ్డుకున్న సదరు పట్టణ స్థానిక సంస్థల్లో  ఏ ఒక్క అభ్యర్థినీ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించే ప్రక్రియను తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు నిలిపివేస్తూ స్టే విధించాలి.  

⇒  ఈ పిటిషన్‌ పరిష్కారం అయ్యే వరకు నామినేషన్ల దాఖలుకు తగినంత గడువును పొడిగించేలా 4వ ప్రతివాదిని (రాష్ట్ర ఎన్నికల సంఘం) ఆదేశించాలి.   
⇒  అభ్యర్థులు స్థానికంగా తీవ్ర భయాందోళనలకు గురవుతున్న నేపథ్యంలో నామినేషన్ల స్వీకరణ కోసం అదనపు, ప్రత్యామ్నాయ ప్రదేశాలను ఏర్పాటుచేసేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలి. ఈ నామినేషన్ల ప్రక్రియ అంతటినీ తప్పనిసరిగా వీడియోగ్రఫీ చేయాలి.   

⇒ పొడిగించిన గడువు సమయంలో నామినేషన్‌ కేంద్రాలకు వెళ్లే అభ్యర్థులకు, వారిని ప్రతిపాదించే వారికి మార్గంమధ్యలోనూ, కేంద్రాల వద్ద ఎలాంటి ఆటంకాలు లేకుండా తగిన పోలీసు రక్షణ కల్పించేలా ప్రతివాదులు 3, 7 (హోంశాఖ, డీజీపీ)లను ఆదేశించాలి.   
⇒   భౌతికంగా అడ్డుకున్నారని ప్రమాణపూర్వక అఫిడవిట్లు సమర్పించిన అభ్యర్థులతో పాటు, అదే విధమైన పరిస్థితులను ఎదుర్కొన్న ఇతర అభ్యర్థులందరి నామినేషన్‌ పత్రాలను ‘నామినేషన్‌ పొడిగింపు సమయంలో’ తప్పనిసరిగా స్వీకరించేలా ఆదేశాలు ఇవ్వాలి.   

⇒  పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని  పై విజ్ఞప్తుల అమలు కోసం అత్యవసరంగా ఎక్స్‌–పార్టీ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలి.   
⇒  నామినేషన్‌ కేంద్రాలన్నింటిలో సీసీ కెమెరాలు/వెబ్‌ కెమెరాలు ఏర్పాటు చేసి, వాటి ప్రత్యక్ష ప్రసారాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం నేరుగా పర్యవేక్షించేలా చూడాలి.   
⇒ నామినేషన్ల స్వీకరణకు ఆటంకం కలిగించిన ఘటనలపై జిల్లా ఎన్నికల అధికారుల నుంచి తక్షణ రిపోర్ట్‌ తెప్పించుకోవాలి. అభ్యర్థులను అడ్డుకున్న వ్యక్తులపై, నామినేషన్లు స్వీకరించని అధికారులపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలి. 
⇒ కేసు వాస్తవాలు, పరిస్థితులకు అనుగుణంగా  న్యాయస్థానం ఇతర తగిన ఉత్తర్వులైనా జారీ చేయాలి.     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement