26న పాదాలమ్మ, బంగారమ్మ పండుగ | bangaramma,festival,simhachalam | Sakshi
Sakshi News home page

26న పాదాలమ్మ, బంగారమ్మ పండుగ

Jul 24 2016 12:56 AM | Updated on Oct 1 2018 6:33 PM

సింహగిరి గ్రామదేవతలు పాదాలమ్మ, బంగారమ్మ పండుగ మహోత్సవాన్ని ఈనెల 26న నిర్వహిస్తున్నట్లు దేవస్థానం ఈవో కె.రామచంద్రమోహన్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

సింహాచలం: సింహగిరి గ్రామదేవతలు పాదాలమ్మ, బంగారమ్మ పండుగ మహోత్సవాన్ని ఈనెల 26న నిర్వహిస్తున్నట్లు దేవస్థానం ఈవో కె.రామచంద్రమోహన్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 25వ తేదీ రాత్రి 9 గంటల నుంచి తొలేళ్ల ఉత్సవం, 26 సాయంత్రం నుంచి రాత్రి వరకు అనుపు మహోత్సవం జరుగుతుందన్నారు. 

26న అప్పన్న దర్శనాలు 
మధ్యాహ్నం 2.30 గంటల వరకే...
సింహగిరి గ్రామదేవతలు పాదాలమ్మ, బంగారమ్మ పండుగను పురస్కరించుకుని ఈనెల 26వ తేదీన మధ్యాహ్నం 2.30 గంటల వరకే సింహగిరిపై శ్రీ వరాహ లక్ష్మీనసింహస్వామి దర్శనాలు లభిస్తాయని ఈవో తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement