ఆస్తి తగాదాల నేపథ్యంలో వరుసకు తండ్రి అయ్యే వ్యక్తిని యువకుడు కర్రతో చితకబాదడంతో అతను తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతిచెందాడు.
ఆస్తి తగాదాల నేపథ్యంలో వరుసకు తండ్రి అయ్యే వ్యక్తిని యువకుడు కర్రతో చితకబాదాడు..దీంతో తీవ్రంగా గాయపడ్డ అతను ఆస్పత్రి లో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ సంఘటన విశాఖపట్నం జిల్లా జి.మాడుగుల మండలం కోరాపల్లి గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సోరాబు రాంనాయుడు(55) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.
ఈ క్రమంలో గ్రామానికి చెందిన వరుసక కొడుకు అయ్యే సింహాచలంతో గత కొంత కాలంగా ఆస్తి విషయంలో తగాదా పడుతున్నాడు. ఈ నేపథ్యంలో గురువారం ఇద్దరు కర్రలతో ఒకరి పై మరొక రు దాడి చేసుకున్నారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన రాంనాయుడు చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.