‘తిరుపతి లడ్డూ ఇష్యూను డైవర్ట్‌ చేసేందుకే ఈ దాడులు’ | YSRCP Leader Gudivada Amarnath On AP Govt Diversion Politics | Sakshi
Sakshi News home page

‘తిరుపతి లడ్డూ ఇష్యూను డైవర్ట్‌ చేసేందుకే ఈ దాడులు’

Feb 3 2026 11:40 AM | Updated on Feb 3 2026 12:04 PM

YSRCP Leader Gudivada Amarnath On AP Govt Diversion Politics

విశాఖ:  ఏపీలో లా అండ్‌ ఆర్డర్‌ పూర్తిగా ఫెయిలైందని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత గుడివాడ అమర్నాథ్‌ ధ్వజమెత్తారు. ప్లాన్‌ ప్రకారమే అంబటి రాంబాబుపై, ఆయన ఇంటిపై దాడులకు పాల్పడ్డారని మండిపడ్డారు. విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా కూటమి నేతలు ఫ్లెక్సీలు పెడుతున్నారని, ప్రధానంగా తిరుపతి లడ్డూపై తప్పుడు ప్రచారం చేస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారని విమర్శించారు. 

ఈరోజు(మంగళవారం, ఫిబ్రవరి 3వ తేదీ) విశాఖ నుంచి మీడియాతో మాట్లాడిన అమర్నాథ్‌.. అంబటి రాంబాబు ఇంట్లోకి వెళ్లి పచ్చమూకలు విధ్వంసం సృష్టించడమే రాష్ట్రంలో లా అండ్‌ ఆర్డర్‌ విఫలమైందనే దానికి ఉదాహరణ అని అన్నారు.  ‘పచ్చమూకలను చెదరగొట్టే అవకాశమున్నా పోలీసులు పట్టించుకోలేదు. 

జోగి రమేష్‌ ఇంటిపై ఏకంగా పెట్రోల్‌ బాంబులే వేశారు. పక్కాప్లాన్‌ ప్రకారమే దాడులు చేస్తూ లడ్డూ ఇష్యూను డైవర్ట్‌ చేస్తున్నారు. తిరుపతి లడ్డూ వ్యవహారంలో చంద్రబాబు కుట్ర బయటపడుతుందనే డైవర్షన్‌ పాలిటిక్స్‌. తిరుపతి లడ్డూ, చంద్రబాబు కుటుంబం భూదోపిడీని డైవర్షన్‌ చేసేందుకే దాడులు’ అని  ఆగ్రహం వ్యక్తం చేశారు.  

ఎంపీ భరత్‌ లెక్క ప్రకారమే దోపిడీ చేసిన గీతం భూమి విలువ రూ. 1000 కోట్లు. అంటే భూమి కబ్జా చేసినట్లు ఒప్పుకున్నట్లే కదా?,  ప్రభుత్వ భూమి చుట్టూ కాంపౌండ్‌ వాల్‌ కట్టే హక్కు మీకెరిచ్చారు?, విశాఖలో ఉన్న భూములు, ఆస్తులు మీ జాగీరు కాదు’ అని హెచ్చరించారు.

Advertisement
 
Advertisement
Advertisement