వీడియో: పవన్‌ ఫ్యాన్‌ వీరంగం.. పెట్రోల్‌ బంక్‌ పేల్చేస్తానంటూ.. | Pawan Kalyan Fan Simhachalam Over Action At Visakhaptanam | Sakshi
Sakshi News home page

వీడియో: పవన్‌ ఫ్యాన్‌ వీరంగం.. పెట్రోల్‌ బంక్‌ పేల్చేస్తానంటూ..

Aug 2 2024 8:05 AM | Updated on Aug 2 2024 9:24 AM

 Pawan Kalyan Fan Simhachalam Over Action At Visakhaptanam

సాక్షి, విశాఖపట్నం: ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ అభిమాని, జనసేన కార్యకర్త ఓ పెట్రోల్‌ బంక్‌ వద్ద హల్‌చల్‌ చేశాడు. తన సమస్యను పరిష్కరించాలని లేదంటే.. గ్యాస్‌ సిలిండర్‌తో బంక్‌ను పేల్చేస్తానని బెదిరింపులకు దిగాడు. అనంతరం, అక్కడకు చేరుకున్న పోలీసులు అతడిని అరెస్ట్‌ చేశారు.

వివరాల ప్రకారం.. విశాఖకు చెందిన జనసేన కార్యకర్త సింహాచలం స్థానికంగా ఉన్న ఓ పెట్రోల్‌ బంక్‌ వద్ద గ్యాస్‌ సిలిండర్‌తో హల్‌చల్‌ చేశాడు. తన సమస్యను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దగ్గరికి చేర్చాలంటూ పెట్రోల్ బంక్ దగ్గర హంగామా క్రియేట్‌ చేశాడు. తాను పవన్ కళ్యాణ్ అభిమాని, జనసేన కార్యకర్తను అంటూ అక్కడున్న వారిని బెదిరింపులకు గురిచేశాడు.

 

తన సమస్యను వెంటనే పరిష్కరించాలని లేదంటే ట్యాంకర్‌కి నిప్పు పెడుతానంటూ సిలిండర్, లైటర్‌తో బెదిరింపులకు పాల్పడ్డాడు. ఎంతో కష్టం మీద బంక్ సిబ్బంది సింహచలాన్ని అడ్డుకున్నారు. దీంతో, పెను ప్రమాదం తప్పింది. అనంతరం, బంక్‌ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలానికి చేరుకున్ని అతడిని అరెస్ట్‌ చేశారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement