స్థానిక సంస్థల ఎన్నికల‍్లో అక్రమాలపై సుప్రీంకోర‍్టుకు వైఎస్సార్‌సీపీ | YSRCP Approaches Supreme Court AP Local Body Elections 2026 | Sakshi
Sakshi News home page

స్థానిక సంస్థల ఎన్నికల‍్లో అక్రమాలపై సుప్రీంకోర‍్టుకు వైఎస్సార్‌సీపీ

Oct 19 2026 5:41 PM | Updated on Oct 19 2026 6:08 PM

YSRCP Approaches Supreme Court AP Local Body Elections 2026

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల‍్లో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ సుప్రీంకోర‍్టుకు వెళ్లింది. నామినేషన్లు వేయనివ్వకుండా అడ్డుకుంటున్నారని పిటిషన్‌ వేసింది.  ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల సమయం పొడిగించడంతో పాటు అభ్యర్థులకు పోలీసుల భద్రత కల్పించాలని కోరింది. 

స్థానిక ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేసే గడువును పొడిగించాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలి. నామినేషన్ పేపర్లు స్వీకరించేందుకు అదనపు, ప్రత్యామ్నాయ కేంద్రాలను ఏర్పాటు చేయాలి. మొత్తం ప్రక్రియను వీడియోగ్రఫీ చేయాలి. నామినేషన్ కేంద్రాలకు వెళ్లే అభ్యర్థులు, ప్రపోజర్లకు తగిన పోలీసు రక్షణ కల్పించాలి. 
ఏకగ్రీవ ఎన్నికపై స్టే ఇవ్వాలి’ అని వైఎస్సార్‌సీపీ తన పిటిషన్‌లో పేర్కొంది.
 
కాగా, మున్సిపల్‌ ఎన్నికల నామినేషన్లు ముగిసినప్పటికీ టీడీపీ గూండాల దాడుల ఆగడం లేదు. నామినేషన్ల పరిశీలన జరుగుతుండగా పలు చోట్ల పత్రాలను చించివేస్తున్నారు. మున్సిపల్ కార్యాలయాల వద్ద ఉద్రిక్తతలు చెలరేగుతున్నాయి. ఓటమి భయంతో టీడీపీ నేతలు నామినేషన్ పత్రాలను చించివేస్తున్నారు. పలు చోట్ల టీడీపీ మూకలు నామినేషన్ కేంద్రంలోకి బలవంతంగా చొరబడుతున్నాయి.

మరోవైపు, మైదుకూరు మున్సిపాలిటీ ఎన్నికలు వాయిదా పడ్డ విషయం తెలిసిందే. నామినేషన్ పత్రాలను టీడీపీ నాయకులు చించేయడంతో ఎన్నికలు వాయిదా పడ్డాయి. ప్రొద్దుటూరులోనామినేషన్ పరిశీలనకు వెళ్తున్న వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు, వైఎస్సార్‌సీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీఛార్జ్‌ చేశారు. ఈ పరిణామాలన్నింటి మధ్య వైఎస్సార్‌సీపీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 

ఇదీ చదవండి: కూటమి రాజకీయాలకో దండం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement