వైభవంగా సింహాద్రి అప్పన్న చందనోత్సవం

Simhachalam Simhadri Appanna Nijarupa Darshanam - Sakshi

సాక్షి, సింహాచలం: శ్రీవరాహ లక్ష్మీనృసింహస్వామి చందనోత్సవం(స్వామి వారి నిజరూప దర్శ­నం) వైభవంగా మొదలైంది. తెల్లవారు­జాము­న నాలుగు గంటల నుంచి సర్వ­దర్శనం ప్రారంభమైంది. భక్తులకు నిజ రూపంలో అప్పన్న స్వామి దర్శనమిస్తున్నారు. స్వామివారికి ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, టీటీడీ తరఫున ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు.

పాంచరాత్ర ఆగమశాస్త్రాన్ని అనుసరించి తెల్లవారుజామున ఒంటి గంట నుంచి దేవ­స్థానం అర్చకులు వైదిక కార్యక్రమాలు ప్రారంభించారు. భక్తులకు ఉదయం 4 గంటల నుంచి దర్శ­నాలు ప్రారంభించారు. రాత్రి 8.30 గంటల నుం­చి సహస్ర ఘటాభిషేకం నిర్వహిస్తారు. అనం­త­­రం స్వామి­వారికి తొలివిడతగా మూ­డు మ­ణు­­గుల చందనం (120 కిలోలు) సమ­ర్పి­­స్తా­రు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
చదవండి: దేవుడి సేవలన్నింటికీ ఆన్‌లైన్‌లో అడ్వాన్స్‌ బుకింగ్‌ 

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top