breaking news
simhadri appanna
-
నాడు అవాకులు చెవాకులు: నేడు దానిపై రెండు ఫ్లోర్ల నిర్మాణానికి ప్లాన్
చంద్రబాబు నేడు ఏ అంశాన్ని గట్టిగా విమర్శిస్తున్నారంటే నాలుగు రోజుల తరువాత అదే అంశాన్ని ఫాలో అవుతారని అర్థం. వైయస్ జగన్ ఆనాడు అమలు చేసిన సచివాలయ వ్యవస్థను విమర్శించిన బాబు.. నేడు మళ్లీ అదే వ్యవస్థపై ఆధారపడి పాలన సాగిస్తున్నారు. నాడు వైయస్ జగన్ తీసుకొచ్చిన పాలనా సంస్కరణలు అయిన గ్రామ సచివాలయాలు నేడు పాలనకు పట్టుగొమ్మలైనాయి.ఇది వందల కోట్లు పెట్టి కట్టిన ప్రాసాదం.. ఇది ప్రభుత్వ ఆస్తి కానే కాదు.. వైయస్ జగన్ విలాసాల కోసం నిర్మించుకున్న ప్యాలెస్. ఇందులో బోలెడు లొసుగులున్నాయి. నిబంధనల అతిక్రమణ ఉంది. పర్యావరణానికి విఘాతం కలిగించి.. కొండలు తొలిచి మరీ నిర్మించారు.. ఇలాంటి భవనాన్ని మనం నిర్వహించలేం. కరెంటు బిల్లులు ఎక్కువైనాయి.. ఇది ఎందుకు పనికొస్తుందో తెలియదు. దీన్ని పిచ్చాసుపత్రిగా మార్చాలి అంటూ చంద్రబాబు ఏదేదో చెప్పడం.. దాన్ని ఎల్లో మీడియా మక్కికిమక్కీ ప్రసారం.. ప్రచారం చేయడం ఈ ఏడాదిన్నరలో చూస్తూ వస్తున్నాం. చూసే జనాలకు కూడా అదేదో వైయస్ జగన్ సొంత ఆస్తి అన్నట్లుగా అనుమానాలు.. కాదు ఏకంగా నమ్మకం కలిగించేలా చంద్రబాబు ఆయన అనుచరులు మాట్లాడారు.ఏకంగా దాన్ని రుషికొండ జగన్ ప్యాలెస్ అని ప్రచారం చేసారు.. అయితే అదే ఇప్పుడు విశాఖ నగరానికి తలమానికం అయింది. ఇది రాష్ట్ర ప్రభుత్వ టూరిజం కార్పొరేషన్‌కు చెందిన జాగాలో గతంలో ఉన్న కాటేజీల స్థానంలో ఈ అధునాతన భవంతిని తక్కువ బడ్జట్లో వైయస్ జగన్ నిర్మించారు. అయితే దాన్ని రకరకాలుగా వక్రీకరించి ప్రభుత్వం ఇప్పుడు దాన్ని మరింత గొప్పగా వినియోగించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఋషికొండ భవనాలపైన, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పైన , స్మార్ట్ మీటర్లపైన, తిరుమల లడ్డూపైన, వివేకా హత్య కేసుపైన, ముఖ్యంగా ఏపీ అప్పులపైన... పనిగట్టుకుని పుకార్లు.. అబద్ధాలు ప్రచారం చేసిన బాబు నేడు అదే రుషికొండ ప్యాలెస్‌పై ప్రభుత్వ ఆస్తిగా చూపుతూ దాన్ని ఇంకోరకంగా వినియోగించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.దాన్ని లీజుకు ఇవ్వాలంటూ టాటా గ్రూపుకు చెందిన తాజ్ హోటల్స్.. లీలా గ్రూప్ వంటి అంతర్జాతీయ బ్రాండ్ హోటళ్ల వారు ఈ ప్యాలెస్‌లను అడుగుతున్నారు. దాన్ని వారు స్టార్ హోటళ్లుగా మార్చుకుని ప్రభుత్వానికి నెలనెలా అద్దె చెల్లించే ప్రాతిపదికన ఇవ్వాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. దీంతో ఇన్నాళ్లూ తెలుగుదేశం.. తమ అనుకూల మీడియా ప్రచారం చేస్తూ వచ్చినట్లు ఇది నిరర్ధక భవనం కాదని.. అంతర్జాతీయ ప్రమాణాలతో నడిచే హోటల్ లేదా ప్రభుత్వ గెస్ట్ హౌస్ వంటి వాటికి ఎంతగానో పనికొస్తుందని అర్థమవుతోంది.మరోవైపు ఈ భవనం మీద మరో రెండు అంతస్తులు నిర్మించడం ద్వారా దాన్ని మొత్తం 150 గదుల హోటల్‌గా మారిస్తే దానికి పూర్తి సార్థకత వస్తుందని కూడా ప్రభుత్వం భావిస్తోంది. అంటే వైయస్ జగన్ ఆనాడు నిర్మించిన భవనం ఇప్పుడు ఒక స్థిరమైన ఆస్తిగా మారి విశాఖకు వన్నె తెచ్చిందన్నమాట. మరి ఇన్నాళ్లుగా అది వైయస్ జగన్ సొంత ఆస్తిగా ప్రచారం చేస్తూ వచ్చిన మీడియా.. తెలుగుదేశం నాయకులూ.. దీనిపై ఏమంటారు.. అది జగన్ ఆస్తిగా చెప్పారు కదా మరి దాన్ని ఆయనకు ఇచ్చేస్తారా? లీజు డబ్బు జగన్ కుటుంబానికి అందజేస్తారు అంటూ ఇటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో ఎదురుదాడి ప్రశ్నల పరంపర మొదలైంది. అప్పుడు ఈ భవనం మీద ఇష్టానుసారం మాట్లాడిన చంద్రబాబు నేడు మళ్ళీ అదే భవనాన్ని గొప్పగా వినియోగించుకోవడానికి ప్రణాళికలు రూపొందించడం ఆయన అవకాశవాద తీరుకు నిదర్శనం అని అంటున్నారు- సిమ్మాదిరప్పన్న -
జంగ్లీ మహారాజ్ రోడ్ ... ఇంకా డ్రీమ్ గర్ల్ బుగ్గల్లానే నునుపుగా!
దేశంలో ఏ మూల చూసినా రోడ్ల గోసే ... నెల క్రితం వేసిన జాతీయ రహదారులు సైతం గుంతలు పడుతున్నతీరు.. ఇక గ్రామాలు.. జిల్లా రోడ్లు అయితే మరీను... ఎక్కడ అడుగుపెడితే అక్కడ మోకాలి లోతు గొయ్యి.. బండి నడపడం అంటే సర్కస్ తో సమానం. సైకిళ్ళు అయితే వెంటనే ఫోర్క్ విరిగిపోవాల్సిందే.. కార్లు అయితే గుంతల్లో పడి మరిక ముందుకు కదల్లేని పరిస్థితి.. ఇక్కడ కాంట్రాక్టర్ తో బాటు ప్రభుత్వాలు కూడా ఈ దుస్థితికి కారణమే అని ప్రజలు విమర్శిస్తున్నారు. రోడ్లలో చేపలు పడుతూ.. వరి నాట్లు వేస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. అత్యంత ఆధునికత సంతరించుకున్న ఈరోజుల్లేనే ఇలా ఉంటె ఆరోజుల్లో రోడ్లు ఇంకెలా ఉండేవో అనే సందేహం మనకు తప్పక వస్తుంది. కానీ ఆరోజులే అద్భుతం.. అప్పట్లో పుణేలో వేసిన రోడ్డు ఇంకా నునుపుగా .. కనీసం పింపుల్ కూడా లేని డ్రీమ్ గర్ల్ బుగ్గల్లా ఉన్నాయ్. దీనికి అప్పటి కాంట్రాక్టర్ తో బాటు ప్రభుత్వనాన్ని మెచ్చుకోకుండా ఉండలేం. సరిగ్గా యాభయ్యేళ్ళ క్రితం పుణేలో రెండున్నర కిలోమీటర్ల పొడవునా జంగ్లీ మహారాజ్ రోడ్డును నిర్మించారు. ఎనిమిదో శతాబ్దంలో రాష్ట్రకూట మహారాజులు శివును పేరిట నిర్మించిన జంగ్లీ మహారాజ్ ఆలయం ఈ రోడ్డుసమీపానే ఉంది. అందుకే ఈ రోడ్డుకు జంగ్లీ మహారాజ్ రోడ్డు అని పేరుపెట్టి అప్పట్లో రూ. 15 లక్షలతో నిర్మాణం చేపట్టారు. దాదాపు ఏడాదిన్నరలో రెకాండో (Recondo) అనే ముంబై కి చెందిన నిర్మాణ సంస్థ 1976లో ఈ రోడ్డును నిర్మించింది. అప్పట్లో ఆ రోడ్డుకు ఆ నిధులు ఎక్కువే కానీ సదరు సంస్థ నాణ్యతలో ఎక్కడా రాజీపడలేదు. అంతేకాకుండా వచ్చే పదేళ్లలో రోడ్డుకు ఎక్కడైనా చిన్న గుంత పడినా.. ఇంకేదైనా మరమ్మతు వచ్చినా రూపాయి కూడా ప్రభుత్వం నుంచి తీసుకోకుండా తాను మళ్ళీ రోడ్డును పునర్నిర్మిస్తానని అప్పట్లోనే హామీ ఇచ్చారు. కానీ ఆశ్చర్యంగా ఇరవై.. ముప్పై ఏళ్లయినా ఆ రోడ్డు అప్పడు నిర్మించినట్లే కొత్తగా తళతళ మెరుస్తూ ఉంది. ఇప్పటి కాంట్రాక్టర్లను.. వారిని పర్యవేక్షించే అధికారుల అవినీతిని వెక్కిరిస్తూనే ఉంది.అప్పటి పూణే మున్సిపాలిటీ స్టాండింగ్ కౌన్సిల్ చైర్మన్ శ్రీకాంత్ షిరోలే ఈ రోడ్డుతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ అప్పటి రోజులే వేరు.. కాంట్రాక్టర్ గొప్ప చిత్తశుద్ధితో ఎక్కడా రాజీపడకుండా రోడ్డును నిర్మించారు. అందుకే ఇన్నేళ్లయినా చెక్కుచెదరకుండా ఉంది అన్నారు. స్టాండింగ్ కౌన్సిల్ చైర్మన్ గా శ్రీకాంత్ శిరోలే ఈ రోడ్డు నిర్మాణానికి అనుమతులు ఇవ్వడమే కాకుండా ఆ పని గొప్పగా పూర్తయ్యేలా అకుంఠిత దీక్షతో దాన్ని చేపట్టారు. సదరు నిర్మాణ సంస్థ కూడా అంతే శ్రద్ధతో దాన్ని పూర్తి చేసింది. ఆ తరువాత పుణె నగరం జనసమ్మర్థంగా మారడం, ట్రాఫిక్ పెరగడంతో ప్రభుత్వం ఆ రోడ్డును మరింత విస్తరించింది. కానీ అప్పటి నాణ్యతను మాత్రం ప్రజలన స్మృతిపథం నుంచి చెరపలేకపోయింది. ఇప్పటికీ ఆ రోడ్డు కు ఇరువైపులా మిరుమిట్లు గొలిపే దుకాణాలతో షాపింగ్ ప్రియులను ఆకట్టుకుంటోంది.ఆశ్చర్యం ఏమంటే ఆ తరువాత సదరు రెకాండో (Recondo) అనే నిర్మాణ సంస్థకు మరెక్కడా రోడ్డు నిర్మాణ కాంట్రాక్టు దక్కలేదు. అదేంటో దేశంలో పని బాగా చేసేవాళ్లకు ఉద్యోగాలు దొరకవు.. నిజాయితీగా ఉండే నేతలకు అసెంబ్లీ టికెట్లు దొరకవు.. నిజాయితీగా నాణ్యతతో పని చేసే కాంట్రాక్టు సంస్థలకు కొత్త కాంట్రాక్టులు దక్కవు. :::సిమ్మాదిరప్పన్న Junglee Maharaj Road, Pune: This road is legendary for being pothole free.Built by a contractor Recondo run by 2 Parsi brothers in the 1970’s.It employed the best technique & materialsAnd gave a guarantee to repair it for free for 10 years.They never got a road contract again pic.twitter.com/qrZHpYS4hD— Vishal Bhargava (@VishalBhargava5) August 5, 2025 -
కష్టాలు పవన్ ఖాతాలో.. సుఖాలు లోకేష్‌కు
అమరావతిలో ఎప్పట్లానే ఉగాది ఆస్థానం ఏర్పాటు చేసారు... గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో అయితే చంద్రబాబు.. లోకేష్.. మంత్రులు మాత్రమే ఉండేవాళ్ళు.. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సైతం ఆస్థానంలో పాల్గొన్నారు. పంచాంగకర్త మాడుగుల నాగఫణి శర్మ.. గతంలో మాంచి ఫామ్‌లో ఉంటూ.. కొన్ని అనుకోని పరిస్థితుల్లో చిక్కుకుని ఫేడ్ అవుట్ అయిన మాడుగుల నాగఫణి శర్మ పంచాంగం చదూతున్నారు. లోలోన పవన్ లోకేష్ ఇద్దరూ టెన్షన్ టెన్షన్ అవుతున్నారు.. మాకు ఎలా ఉంటుంది.. ఏమై ఉంటుంది.. భవిష్యత్ బంగారమే కదా అంటూ ఆతృతగా ఎదురుచూస్తున్నారు.. నాగబాబు కూడా కొత్త కండువా మాటికీ సర్దుకుంటూ మేధావి నవ్వు నవ్వుతూ అటూ ఇటూ చూస్తున్నాడు. అసలు ఉగాది పండగను కనిపెట్టి.. తెలుగుప్రజలు కొత్త సంవత్సరాన్ని పరిచయం చేసిన చంద్రబాబు కూడా చిద్విలాసంతో కూర్చున్నారు..చెప్పండి శర్మగారూ అని చంద్రబాబు ఆదేశించగా... ముందుగా ఆదాయ వ్యయాలు అని మొదలెట్టారు.. ఆ.. గమ్మున చెప్పండి అన్నారు అందరూ కోరస్ గా.. మీ అందరికీ ఆదాయం వెయ్యి.. ఖర్చు పావలా అన్నారు శర్మగారు.. దీంతో వారంతా లోలోన మురిసిపోయారు.. అవును .. అమరావతి కాంట్రాక్టులతో బాగానే వస్తోంది.. ఎక్కడా పైసా ఖర్చు చేయక్కర్లేదు.. శర్మగారు బాగానే చెప్పారు అనుకున్నారు.. లోకేష్ కూడా.. అవును పోస్టింగులు.. బదిలీలు అన్నీ నావే కాబట్టి నా ఆదాయం బాగానే ఉంటుంది.. పైగా జిల్లాలకు వెళ్ళినపుడు ఏమైనా ఖర్చు ఉన్నా అదంతా ప్రభుత్వ ఖాతాలోకి పోతుంది.. కాబట్టి నాకు అంతా ఆదాయమే అనుకున్నారు. పవన్ కూడా నేను నియోజ కవర్గానికి వెళ్లడమే తక్కువ.. క్యాడర్ గురించి బాధ లేదు.. అటు సినిమాలు చేస్తూ ఆదాయం బాగానే వస్తోంది.. అంటే పంచాంగం కరెక్ట్ గానే ఉన్నట్లుంది అనుకున్నారు. ఇక రాష్ట్ర ఆదాయం గురించి శర్మ గారు చెబుతూ రాష్ట్రానికి ఆదాయం తగ్గుతుంది.. అప్పులు పెరుగుతాయి అన్నారు.. ఇది విన్నాక బాబుగారు లోలోన రాష్ట్రం ఏమైపోతే నాకేంటి..స్టేట్ మొత్తం అప్పులైతే నాకేంది అనుకున్నారు. ఇహ లోకేష్ గారి సంగతి చూస్తే అంటూ కండువా సవరించుకున్న శర్మగారు.. ఆయనకు సీఎం పదవికి ప్రస్తుతం పవనాలు అనుకూలంగా లేవు.. కొన్నాళ్ళు మంత్రిగిరిలోనే ఉంటారు అన్నారు.. దీంతో లోకేష్ పవన్ వైపు గుర్రుగా చూడగా.. నిన్ను సీఎం ను ఎలా చేస్తాను అనుకున్నావు అంటూ పవన్ బదులిచ్చారు. ఇప్పుడు పవన్ గారి రాశి ప్రకారం చూస్తే ప్రస్తుతానికి ఫర్లేకున్నా మున్ముందు భవిష్యత్ కష్టమే అన్నారు.. దీంతో లోకేష్ చంద్రబాబులు పవన్‌ను కుమ్మేద్దాం కళ్ళతో అని సిగ్నల్స్ ఇచ్చుకున్నారు. మరి నా సంగతి ఏమిటి అన్నాడు నాగబాబు.. నీకూ పదవీ యోగం ఉంది అన్నాడు శర్మ.. హమ్మయ్య అనుకుంటూ అందరూ వెళ్లిపోయారు..:::సిమ్మాదిరప్పన్న... -
సింహాచలంలో తెప్పోత్సవానికి ఘనంగా ఏర్పాట్లు
-
సింహాద్రి అప్పన్న చందనోత్సవం.. నిజరూప దర్శనానికి పోటెత్తిన భక్తులు (ఫొటోలు)
-
సింహాద్రి అప్పన్న చందనోత్సవం.. నిజరూప దర్శనానికి పోటెత్తిన భక్తులు (ఫొటోలు)
-
వైభవంగా సింహాద్రి అప్పన్న చందనోత్సవం
సాక్షి, సింహాచలం: శ్రీవరాహ లక్ష్మీనృసింహస్వామి చందనోత్సవం(స్వామి వారి నిజరూప దర్శనం) వైభవంగా మొదలైంది. తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి సర్వదర్శనం ప్రారంభమైంది. భక్తులకు నిజ రూపంలో అప్పన్న స్వామి దర్శనమిస్తున్నారు. స్వామివారికి ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, టీటీడీ తరఫున ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు. పాంచరాత్ర ఆగమశాస్త్రాన్ని అనుసరించి తెల్లవారుజామున ఒంటి గంట నుంచి దేవస్థానం అర్చకులు వైదిక కార్యక్రమాలు ప్రారంభించారు. భక్తులకు ఉదయం 4 గంటల నుంచి దర్శనాలు ప్రారంభించారు. రాత్రి 8.30 గంటల నుంచి సహస్ర ఘటాభిషేకం నిర్వహిస్తారు. అనంతరం స్వామివారికి తొలివిడతగా మూడు మణుగుల చందనం (120 కిలోలు) సమర్పిస్తారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: దేవుడి సేవలన్నింటికీ ఆన్లైన్లో అడ్వాన్స్ బుకింగ్ -
ఎయిర్‌పోర్టులో సింహాద్రి అప్పన్న
గోపాలపట్నం (విశాఖ పశ్చిమ): విశాఖ విమానాశ్రయంలో చందనధారుడు ప్రయాణికులకు దర్శనమివ్వనున్నారు. అంతర్జాతీయ విమానాశ్రయంలో అప్పన్న ఆలయ అధికారులు చందన రూపంలో ఉండే శ్రీవరాహ లక్ష్మీనృసింహస్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దీనిని విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ సోమవారం తొలి పూజలు చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా దేవస్థానం ఈవో చంద్రకళ మాట్లాడుతూ.. విశాఖపట్నం వచ్చే ప్రయాణికులు అప్పన్నను దర్శనం చేసుకునే అవకాశం కల్పించామన్నారు. స్వామి వారి చరిత్ర, డొనేషన్లు ఇచ్చే వారి కోసం వెబ్సైట్లు ఏర్పాటు చేశామన్నారు. స్వామి చరిత్ర ఆడియో వినేందుకు క్యూఆర్ కోడ్ త్వరలోనే సిద్ధం చేస్తామన్నారు. ఇప్పటికే విశాఖ రైల్వే స్టేషన్లో అప్పన్న విగ్రహాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. త్వరలో భువనేశ్వర్ రైల్వే స్టేషన్లోనూ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎయిర్పోర్ట్ డైరెక్టర్ శ్రీనివాసరావు, స్థానాచార్యులు రాజ్‌గోపాల్, పురోహితులు కరి సీతారామాచార్యులు, ఏఈవో రమణమూర్తి, శిల్పి రమణ, ఈఈ శ్రీనివాసరావు, పాలకమండలి సభ్యులు గంట్ల శ్రీనుబాబు, దినేష్‌రాజు, దొడ్డి రమణ, సతీష్, పాత్నుడు, చందు, సువ్వాడ శ్రీదేవి, వంకాయల నిర్మల, రామలక్ష్మి పాల్గొన్నారు. అప్పన్నను దర్శించుకున్న కేజీఎఫ్ హీరో విమానాశ్రయంలో సింహాద్రి అప్పన్న విగ్రహం ప్రారంభోత్సవం జరిగిన కొద్దిసేపటికే కేజీఎఫ్ హీరో యష్ రావడంతో తొలి దర్శనం చేసుకున్నారు. ఆలయ పురోహితులు సీతారామాచార్యులు ప్రత్యేక పూజలు చేశారు. ఈవో చంద్రకళ యష్‌కు స్వామివారి శేష వస్త్రాలు కప్పి స్వాగతం పలికారు. స్వామిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని యష్ తెలిపారు. -
సింహద్రి అప్పన్నను దర్శించుకున్న పి.వి.సింధు
-
సింహాద్రి అప్పన్న చందనోత్సవం
విశాఖపట్నం: సింహగిరిపై కొలువైన సింహాద్రి అప్పన్న చందనోత్సవం శనివారం వేకువజామున కన్నులపండువగా ప్రారంభమైంది. ఆలయ అనువంశిక ధర్మకర్త, కేంద్రమంత్రి అశోక్‌గజపతిరాజు సింహాద్రి అప్పన్నకు తొలిపూజ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరుఫున గవర్నర్ నరసింహన్, తితిదే తరుఫున ఈవో సాంబశివరావు అప్పన్నకు పట్టువస్త్రాలు సమర్పించారు. రాష్ట్ర మంత్రులు గంటా శ్రీనివాసరావు, మాణిక్యాలరావు స్వామి వారిని దర్శించుకున్నారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు భారీగా తరలిరావడంతో రద్దీ నెలకొంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. -
పాపభీతితో లొంగిపోయాడు
పాతపోస్టాఫీసు (విశాఖ దక్షిణ): పాపభీతి వెంటాడటంతో తలనీలాల దొంగ పో లీసులకు లొంగిపోయాడు. సింహాద్రి అప్పన్న ఉగ్రరూపంలో నిద్రలో కనిపిస్తున్నాడని, నిజం చెప్పమని గర్జించడంతో లొంగిపోయానని సింహాచలం దేవస్థానంలో తలనీలాలు దొంగిలించిన ప్రధా న నిందితుడు ఏలూరు సమీపంలోని మాదేపల్లి గ్రామానికి చెందిన పసుపులేటి రాంబాబు (47) పోలీసులకు తెలిపాడు. విశాఖ పోలీస్ కమిషనరేట్ సమావేశ మందిరంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నగర సంయుక్త పోలీస్ కమిషనర్ సత్తార్ ఖాన్, క్రైం డీసీపీ రవికుమార్‌మూర్తి వివరాలు వెల్లడించారు. 2015 ఫిబ్రవరి 14న సింహాచలం దేవస్థానంలో 10 బస్తాల్లో ఉన్న సుమారు 150 కేజీల తలనీలాలు చోరీకి గురయ్యాయి. వీటి విలువ రూ. 7.50 లక్షలు ఉంటుందని అప్పట్లో అంచనా వేశారు. తలనీలాలు ఎవరు దొంగలించారు, ఎక్కడికి తరలించారో తెలుసుకునేందుకు పోలీసులు చేపట్టిన దర్యాప్తు అంగుళం కూడా ముందుకు సాగలేదు. దొంగగా మారిన తలనీలాల వ్యాపారి ఈ కేసులో ప్రధాన నిందితుడైన రాంబాబు తండ్రి నుంచి వారసత్వంగా తలనీలాల వ్యాపారం స్వీకరించాడు. రాష్ట్రంలోని పలు దేవాలయాలకు చెందిన తలనీలాలను వేలం ద్వారా కొనుగోలు చేసి వాటిని ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తున్నాడు. కొన్నాళ్లపాటు భద్రాచలం కొత్తగూడెంకు చెందిన చల్లా జంపన్నతో కలిసి తలనీలాల వ్యాపారం చేశాడు. వీరిద్దరూ క్రికెట్ బెట్టింగ్‌లలో తమ వద్ద ఉన్న సొమ్మంతా పోగొట్టుకుని అప్పులపాలయ్యారు. అప్పుల ఊబి నుంచి బయట పడేందుకు రాంబాబు, జంపన్నలు కలిసి సింహాచలం దేవస్థానం కల్యాణకట్టలో నిల్వ ఉంచిన తలనీలాల బస్తాలలో పదింటిని కిటికీ ఊసలు వంచి దొం గిలించారు. తర్వాత కాణిపాకం వినాయకుని దేవస్థానంలో కూడా వీరిద్దరూ కలిసి దొంగతనానికి పాల్పడ్డారు. ఈ కేసులో చల్లా జంపన్నను అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. అదే తరుణంలో రాంబాబులో పాపభీతి మొదలయింది. సింహాద్రి అప్పన్న కలలో కనిపిస్తున్నాడని, తాను లొంగిపోదామనుకుంటున్నానని ప్రకాశం జిల్లా మాలకొండ దేవస్థానం కార్యనిర్వహణాధికారికి ఫోన్ ద్వారా సమాచారం అందించాడు. దీంతో విషయం తెలుసుకున్న గోపాలపట్నం పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేపట్టి రాంబాబును అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి రూ.4.50 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. విలేకరుల సమావేశంలో అడిషినల్ డీసీపీ (క్రైం) వరదరాజు, ఏసీపీ భీమారావు, గోపాలపట్నం సీఐ వైకుంఠరావు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు. -
వైభవంగా సింహాద్రి అప్పన్న చందనోత్సవం
విశాఖపట్నం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన సింహాచలం సింహాద్రి అప్పన్న చందనోత్సవం సోమవారం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. శ్రీవరాహ లక్ష్మీనరసింహస్వామి చందనో త్సవానికి తొలి చందనాన్ని ఆలయ ప్రధాన అర్చకులు స్వామి వారికి నివేదన చేశారు. వంశపారంపర్య ధర్మకర్త, కేంద్ర మంత్రి పూసపాటి అశోకగజపతిరాజు, ఆయన కుటుంబసభ్యులు సోమవారం తెల్లవారుజామున తొలి దర్శనం చేసుకోనున్నారు. ప్రభుత్వం తరఫున మంత్రి గంటా శ్రీనివాసరావు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయంలో గంటా ప్రత్యేక పూజలు నిర్వహించారు. చందోనత్సవ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయాధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. -
అప్పన్నకు ‘ఐటీ’ నామం!
-
అప్పన్న చందనోత్సవంలో గందరగోళం
-
వైభవంగా సింహాద్రి అప్పన్న చందనోత్సవం
-
కన్నుల పండుగగా సింహాద్రి అప్పన్న కల్యాణం
చైత్రశుద్ద ఏకాదశిని పురస్కరించుకుని విశాఖ జిల్లా సిహాచలంలో కొలువుదీరిన శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వార్షిక కల్యాణ మహోత్సవం మంగళవారం రాత్రి వైభవంగా జరిగింది. సింహగిరిపై ఉన్న నృసింహ కల్యాణ మండపంలో భారీ ఎత్తున వేదిక ఏర్పాటుచేసి పాంచరాత్ర ఆగమశాస్త్రం ప్రకారం వైదికులు కల్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిల ఉత్సవమూర్తులను శోభాయమానంగా అలకరించి వేదికపై అధిష్టింపచేశారు. విష్వక్సేనపూజ, పుణ్యాహవచనం, యజ్ఞోపవీత ధారణ, జీలకర్రబెల్లం, మాంగల్యధారణ, తలంబ్రాలు తదితర ఘట్టాలతో ఘనంగా జరిపారు. భక్తులకు ముత్యాల తలంబ్రాలను అందజేశారు. అంతకుముందు సాయంత్రం నాలుగు గంటల నుంచి కొట్నాల ఉత్సవం, ధ్వజారోహణం, ఎదురు సన్నాహోత్సవం నిర్వహించారు. రాత్రి 8 గంటల నుంచి సింహగిరి మాడ వీధుల్లో రథోత్సవాన్నినిర్వహించారు. రథోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దేవస్థానం అనువంశిక ధర్మకర్త పూసపాటి ఆనందగజపతిరాజు దంపతులు స్వామిని దర్శించుకున్నారు. దేవస్థానం ఈవో కె.రామచంద్రమోహన్ ఆధ్వర్యంలో అధికారులు ఏర్పాట్లు చేశారు.


