సింహాద్రి అప్పన్న చందనోత్సవం | Simhadri Appanna Chandanotsavam | Sakshi
Sakshi News home page

సింహాద్రి అప్పన్న చందనోత్సవం

Apr 29 2017 8:12 AM | Updated on Sep 5 2017 9:59 AM

సింహాద్రి అప్పన్న చందనోత్సవం

సింహాద్రి అప్పన్న చందనోత్సవం

సింహగిరిపై కొలువైన సింహాద్రి అప్పన్న చందనోత్సవం కన‍్నులపండువగా ప్రారంభమైంది

విశాఖపట్నం: సింహగిరిపై కొలువైన సింహాద్రి అప్పన్న చందనోత్సవం శనివారం వేకువజామున కన‍్నులపండువగా ప్రారంభమైంది. ఆలయ అనువంశిక ధర్మకర్త, కేంద్రమంత్రి అశోక్‌గజపతిరాజు సింహాద్రి అప్పన్నకు తొలిపూజ చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం తరుఫున గవర్నర్‌ నరసింహన్‌, తితిదే తరుఫున ఈవో సాంబశివరావు అప్పన్నకు పట్టువస్త్రాలు సమర్పించారు. రాష్ట్ర మంత్రులు గంటా శ్రీనివాసరావు, మాణిక్యాలరావు స్వామి వారిని దర్శించుకున్నారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు భారీగా తరలిరావడంతో రద్దీ నెలకొంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement